railway trak
-
పరుగులు తీసి.. ప్రాణం కాపాడి..
సాక్షి,చిత్తూరు(రేణిగుంట): ఏ కష్టమొచ్చిందో ఆ వృద్ధురాలికి ప్రాణాలు తీసుకోవాలనుకుంది.. ఆగి ఉన్న గూడ్సు కింద పట్టాలపై తలపెట్టి పడుకుంది.. అదే సమయంలో రైలు కదిలేందుకు సిగ్నల్ పడింది.. సీసీ కెమెరా ద్వారా గుర్తించిన రైల్వే పోలీసులు పరుగులు పెట్టారు.. పట్టాలపై నుంచి వృద్ధురాలిని పక్కకు లాగి కాపాడారు. ఆర్పీఎఫ్ సిబ్బందిని ఉరుకులు పెట్టించిన ఈ ఘటన ఆదివారం రేణిగుంట రైల్వే స్టేషన్లో జరిగింది. జీఆర్పీ ఎస్ఐ అనిల్‌కుమార్ కథనం మేరకు.. రేణిగుంట బాలాజీ కాలనీకి చెందిన వరదరాజులు భార్య పాండియమ్మ(76) సాయంత్రం 6.30గంటల సమయంలో రైల్వేస్టేషన్‌కు వచ్చింది. ఐదో నంబర్ ప్లాట్‌ఫామ్ చివరకు వెళ్లి ఆగి ఉన్న గూడ్స్ కింద తలపెట్టింది. ఈ విషయం ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ సీసీ కెమెరాలో గమనించారు. వెంటనే ఆయన జీఆర్పీ స్టేషన్ సమాచారం అందించారు. అప్పటికే రైలుకు సిగ్నల్ పడడంతో ఎస్ఐ అనిల్‌కుమార్ తన సిబ్బందితో కలిసి పరుగుపరుగున పట్టాలపై పడుకున్న వృద్ధురాలి వద్దకు చేరుకున్నారు. ఆమెను బలవంతంగా పక్కకు లాగేయడంతో అందరూ ఊపిరి తీసుకున్నారు. వృద్ధురాలిని కాపాడిన కొద్దిక్షణాల్లోనే రైలు కదలింది. అనంతరం రైల్వే పోలీసులు పాండియమ్మ వివరాలు తెలుసుకుని ఆమె కుటుంబసభ్యులను పిలిపించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వృద్ధురాలితో ఇంటికి పంపించారు. చదవండి: కత్తులు పట్టుకొని బాలీవుడ్ డైలాగులు.. వాట్సాప్ స్టేటస్ -
ఓ దొంగోడు.. పోలీసులు.. సినిమాను తలపించే సీన్!
మనం నిత్యం ఎన్నో దొంగతనాల గురించి చదువుతూనే ఉన్నాం. కొందరు పొట్టకూటి కోసం దొంగలుగా.. మారితే మరికొందరు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి తప్పుదోవ పడతారు. అయితే కొన్ని దొంగతనాలు సినిమాలను మించి జరుగుతుంటాయి. తాజాగా బ్రిటన్‌లో ఓ కారు దొంగతనం సీన్ సినిమాను తలపించే విధంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. యూకే రైల్వే స్టేషన్లో ఓ దొంగ ల్యాండ్ రోవర్ డిస్కవరీ కారును దొంగిలించడానికి పథకం వేశాడు. ఇది గుర్తించిన పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిని తోసేసి కారును రైలు పట్టాలపై పరుగు పెట్టించాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా, కారును పట్టాలపై కొంత దూరం పరుగు పెట్టించిన దొంగ అక్కడే వదిలేసి పారిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ఈ సీన్ గ్రాండ్ తెఫ్ట్ ఆటో (జిటిఏ) గేమ్‌ను గుర్తు చేసింది.’’ అంటూ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ ‘‘ ఈ సీన్ కంప్యూటర్ గేమ్‌లను తలదన్నేలా ఉంది.’’ అంటూ రాసుకొచ్చాడు. Man was tekking from the police on the tracks 😭😭 pic.twitter.com/Jkp2CTuCRb — A (@Cyp_Alii) July 15, 2021 -
ఆసరాగా ఉంటాడనుకుంటే.. ఆయువు తీసుకున్నాడు
సాక్షి,ఆమదాలవలస: ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న కుమారుడు విగతజీవిగా కనిపించడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీకాకుళం రోడ్డు(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధి కుద్దిరాం – ఆమదాలవలస మధ్య ట్రాక్‌పై మంగళవారం రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమదాలవలస మండలం తురకపేట గ్రామానికి చెందిన మామిడి మురళీ(17) స్థానిక ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకెండియర్ చదువుతున్నాడు. ఏదో విషయమై కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నన్నాడు. ఆసరాగా నిలుస్తాడనుకున్న కుమారుడు మృత్యువు ఒడిలోకి చేరడాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మురళీ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
రైలు పట్టాలపై నిద్రిస్తే ఎలా ఆపగలం?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా స్వస్థలాలకు తరలివెళుతోన్న వలస కార్మికులను నిలువరించడం, పర్యవేక్షించడం కోర్టులకు సాధ్యం కాదని, ఆపని చేయాల్సింది ప్రభుత్వాలేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వలస కార్మికులకు తగిన రవాణా సౌకర్యాలు కల్పించేంత వరకు ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించేలా కేంద్రం చర్యలు చేపట్టేలా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేయాలని దాఖలైన పిటిషన్‌ని కోర్టు తిరస్కరించింది. దేశవ్యాప్తంగా వలస కార్మికుల కదలికలను ఆపలేమనీ, ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వాలే తగిన చర్యలు చేపట్టాలని కోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు, వలస కార్మికులు పట్టాలపైనే నిద్రిస్తోంటే ఎలా ఆపగలమని ప్రశ్నించింది. జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం రహదారులపై నడచివెళుతోన్న వలస కార్మికులను ఆపడానికి ఏమైనా మార్గం ఉందా అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాని ప్రశ్నించింది. వలస కార్మికులకు ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నారనీ, అంత వరకు వేచి ఉండకుండా కార్మికులు వెళుతున్నారని తుషార్ మెహతా కోర్టుకి తెలిపారు. వారిని కాలినడకన వెళ్ళొద్దని అధికారులు కోరగలరేగానీ, బలవంతంగా ఆపలేరన్నారు. -
సమస్యలు.. సైడ్ ట్రాక్
సాక్షి,తాడేపల్లిగూడెం : ఎర్ర కాలువపై ఉన్న పాత అక్విడెక్ట్ తొలగించినా...గట్లు ఎత్తు పెంచి ఆధునీకరించినా, ముంపు సమస్య నివారణకు శాశ్వత పరిష్కారం లభించలేదు. ఆధునీకరణలో భాగంగా గట్లు ఎత్తు పెంచారు. అయితే, గట్లను రివిట్మెంట్ చేయకపోవడంతో చిన్నపాటి వర్షానికే గత ఏడాది జూలైలో గట్లు జారిపోయాయి. దీనికి తోడు అదే ఏడాది ఆగస్టులో కురిసిన వర్షాలకు మారంపల్లి వద్ద రైల్వే ట్రాక్‌ను ఆనుకుని గట్లు పూర్తి స్థాయిలో అనుసంధానించకపోవడమే ముంపునకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో నందమూరు, మారంపల్లి, ఆరుళ్ల గ్రామాల వైపు, జగన్నాథపురం, మాధవరం గ్రామాల వైపు వేలాది ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో రైతాంగం అపార నష్టం చవి చూసింది. పలు చోట్ల చేలలో ఇసుక మేటలు వేసింది. ఈ ముంపునకు సంబంధించి రైతాంగానికి ప్రభుత్వం నుంచి రావలసిన పరిహారం అందని పరిస్థితి. మరో మూడు నెలలు గడిస్తే ముంపునకు ఏడాది పూర్తి కావస్తుంది. మళ్లీ వర్షాకాలం వచ్చింది. గట్లు జారిన చోట పటిష్ట చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో మళ్లీ రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. రైల్వే ట్రాక్ భద్రత కోసమే...! ఎర్ర కాలువ నిర్మాణం జరిగిన సమయంలోనే మారంపల్లి వద్ద రైల్వే ట్రాక్ సమీపం వరకు గట్లు వేయలేదని తెలుస్తోంది. ట్రాక్ అతి దగ్గరగా గట్లు వేయడం వల్ల పై నుంచి వరద నీరు ఉధృతంగా వస్తే ట్రాక్ భద్రత ఇబ్బందుల్లో పడుతుందని రైల్వే శాఖ భావిస్తోంది. దీంతో ట్రాక్‌కు చేరువగా గట్లు వేయడానికి అనుమతి నిరాకరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా ట్రాక్‌కు ఆనుకుని వరద నీరు పోయేలా కాలువలను తవ్వింది. ఆ కాలువలు కాలక్రమంలో ఆక్రమణలకు గురై పూడుకుపోవడంతో వరద నీరంతా మారంపల్లి రైల్వే ట్రాక్ సమీపం నుంచి చేలను ముంచెత్తుతుంది. దీన్ని గుర్తించని రైతులు పాత అక్విడెక్ట్‌ను పట్టుబట్టి తొలగించారు. అయితే, ముంపును నివారించాలంటే మారంపల్లి వద్ద రైల్వే ట్రాక్ కానాలను పెంచడం, గట్లను ట్రాక్ వరకు పొడిగించడం చేయవలసి ఉంది. ఇది జరిగితేనే ఎర్ర కాలువ ముంపు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. గట్లు పొడిగిస్తే ముంపు నివారణ మారంపల్లి రైల్వే ట్రాక్‌కు రెండు వైపులా ఉన్న ఖాళీ ప్రాంతాన్ని గట్లు వేసి పూడ్చడం వల్ల ముంపును నివారించవచ్చు. ఈ విషయాన్ని గుర్తించిన ఎంపీపీ గన్నమని దొరబాబు ఈ మేరకు రైల్వే అధికారులను తీసుకొచ్చి ముంపు ప్రాంతాన్ని చూపించినా ప్రయోజనం లేకపోయింది. జంగారెడ్డిగూడెం వద్ద కొంగువారిగూడెం ప్రాజెక్టు నుంచి వదిలిన వరద నీరు ఎర్ర కాలువకు చేరుతుంది. ఇలా వస్తున్న వరద నీరు నందమూరు అక్విడెక్ట్ వద్ద లాగకపోవడం ముంపునకు మరో కారణంగా కనిపిస్తోంది. దీంతో వేలాది ఎకరాలు ముంపునకు గురవుతూ వచ్చాయి. మారంపల్లి వద్ద ట్రాక్ కానాలు పెంచడంతో పాటు దువ్వ వద్ద వెంకయ్య – వయ్యేరు కాలువ కానాలను పెంచితేనే గానే పూర్తి స్థాయిలో వరద నీరు లాగే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
సాక్షి, అనంతగిరి: ప్రమాదవశాత్తు గూడ్స్ రైలు పట్టాలు తప్పిన సంఘటన జిల్లాకేంద్రం వికారాబాద్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ నుంచి రాయిచూర్‌కు బొగ్గు లోడ్‌తో గూడ్స్ రైలు వికారాబాద్ మీదుగా వెళ్తోంది. బుధవారం తెల్లవారుజామున వికారాబాద్ సమీపానికి రాగానే కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో 7 బోగీలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. బోగీలు కిందపడడంతో పట్టాలు పూర్తిగా దెబ్బతినఆనయి. అయితే రైలుముందు భాగం, వెనుకభాగానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కేవలం 7 బోగీలు ప్రమాదానికి గురవ్వగా 4 బోగీలు కిందికిదిగాయి. ఈ సంఘటనతో వెంటనే స్పందించిన రైల్వే అధికారులు అక్కడికు చేరుకున్నారు. ప్రమాదం తీరును పరిశీలించారు. హుటాహుటిన సిబ్బందిని పిలిపించి జేసీబీతో బొగ్గును, కిందపడిన బోగిలను పక్కకు జరిపారు. బోగీలను పక్కకు తొలగించిన అనంతరం పట్టాలకు మరమ్మతు పనులు చేస్తున్నారు. బోగీలను రైల్వే ట్రాక్ మీద నుంచి తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. అర్ధరాత్రి వరకు పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రమాదానికి కారణం బోగీల తప్పిదమా లేక రైలు పట్టాల తప్పిదమా తెలియాల్సి ఉంది.. కాగా ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది. ఘటన స్థలాన్ని సికింద్రాబాద్ రైల్వే చీఫ్ సెక్యూరిటీ కమీషనర్ రమేష్ చందర్, జీయం గజానంద్ మల్యా, డీఆర్‌యం ఆనంద్ భటియా, సీనియర్ డీవిజనల్ సెక్యూరిటి కమీషనర్ రామకృష్ణ, ఏఎస్స్ ఉజ్జల్ దాస్, సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్పాల్ లతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది వచ్చారు. పలు రైళ్ల రాకపోకలు ఆలస్యంగా ఈ ప్రమాదంతో హైదాబాద్ నుంచి వికారాబాద్ వైపు వచ్చే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతినడంతో కొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది. పట్టాలు ఊడిపోవడంతో సిబ్బంది సరి చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి వచ్చే రైళ్లను చిట్టిగడ్డ రైల్వేస్టేషన్‌కు రాగానే నిలిపివేస్తున్నారు. వికారాబాద్ నుంచి హైదరా బాద్ వైపు వెళ్లే రైళ్లు లేని సమయంలో లేదా అటు నుంచి వచ్చే రైళ్లను ఆపి ఒకే ట్రాక్ మీద రైళ్ల రాకపోకలను కొనసాగించారు. దీంతో రైళ్ల రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పలు రైళ్లు రద్దు.. కాగా ప్రమాదంలో రైలు పట్టాలు ధ్వంసం కావడంతో పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. హైదరాబాద్–గుల్బర్గా (57156), గుల్బర్గా–హైదరాబాద్(57155), సికింద్రాబాద్–తాండూరు (67250), తాండూరు–సికింద్రాబాద్ (67249) రైళ్లను రద్దు చేశారు. గుంటూరు నుంచి వికారాబాద్ వరకు వచ్చే పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను లింగంపల్లి వరకే నడిపారు. సికింద్రాబాద్–వికారాబాద్ ప్యాసింజర్‌ను శంకర్పల్లి వరకే నడిపించారు. ఈ ప్రమాదంతో వికారాబాద్ మీదుగా వెళ్లే రైళ్లన్నీ సుమారు గంటకు పైగా ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వికారాబాద్, తాండూరుకు వెళ్లే ఎన్నికల సిబ్బంది కూడా ఈ ప్రమాదంతో ఆలస్యంగా విధులకు చేరుకున్నారు. పలువురు ఉద్యోగులు బస్సుల్లో ప్రయాణించి ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. -
చావడానికి దూకితే...
వ్యక్తిగత కారణాలు ఆమెను మానసికంగా కుంగదీశాయి. నెలలు కూడా నిండని పసికందుతోసహా ఆత్మాహూతికి సిద్ధపడింది. అమాంతం రైలు పట్టాలపై దూకేసింది. జనాలు చూస్తుండగానే రైలు వాళ్ల మీదినుంచి పోయింది. కానీ, అదృష్టవశాత్తూ ఆ రెండు ప్రాణాలు నిలిచాయి. భోపాల్: శనివారం ఉదయం ఓ మహిళ, ఓ చంటి బిడ్డతో భూర్హన్‌పూర్ జిల్లాలోని నేపానగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. పుష్కక్ ఎక్స్‌ప్రెస్ స్టేషన్‌కు వస్తున్న సమయంలో అమాంతం పట్టాలపైకి దూకింది. జనాలంతా అరుస్తుండగానే రైలు వాళ్ల మీదునుంచి వెళ్లింది. అయితే చిన్న గాయం కూడా కాకుండా ఆ తల్లికూతుళ్లు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ట్రాక్‌కు సరిగ్గా మధ్యలో పడిపోవటంతో రైలు వారి మీదుగా వెళ్లింది. షాక్‌లోకి వెళ్లిన మహిళను సమీపంలోని ఆస్పత్రికి ప్రయాణికులు తరలించారు. రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తన పేరు తబాస్సుమ్ అని, భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నానని, ఎటు వెళ్లాలో తెలీని స్థితిలో బిడ్డతో కలిసి చనిపోయేందుకు నిర్ణయించుకున్నానని వివరించింది. దీంతో ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు సఖి సెంటర్‌కు తరలించి, ముంబైలోని ఆమె బంధువులకు సమాచారం అందించారు. -
ఎర్ర కండువాతో తప్పిన పెను ప్రమాదం
న్యూ ఢిల్లీ : ఇద్దరు ట్రాక్మెన్ల సమయస్ఫూర్తి వందలాది మంది ప్రాణాలను కాపాడింది. ప్రియస్వామి(60), రామ్ నివాస్(55) ఇద్దరు రైల్వే ట్రాక్మెన్లు. వారు తమ విధుల్లో భాగంగా యమున బ్రిడ్జి, తిలక్ బ్రిడ్జ్‌ల మధ్య రైల్వె ట్రాక్‌ను పరిశీలుస్తుండగా... ఒక చోట వారికి 6 అంగుళాల మేర ట్రాక్ తొలగిపోయి కనిపించింది. అదే సమయంలో శివగంగా ఎక్స్‌ప్రెస్ ఆ ట్రాక్ మీద దూసుకొస్తోంది. స్టేషన్‌కు ఫోను చేసి సమాచారం అందిద్దామంటే సమయానికి వారి దగ్గర ఫోను కూడా లేదు. ఏం చేయాలో వారికి పాలుపోలేదు. మరోవైపు వారికి ఎదురుగా రైలు వస్తున్న శబ్ధం వినిపిస్తోంది. ఇంతలోనే ప్రియస్వామికి ఏదో గుర్తుకు వచ్చింది. టక్కున తన ఎర్ర కండువాను గాలిలో ఊపుతూ రైలుకు ఎదురుగా పరిగెత్తాడు. మరొక ట్రాక్‌మాన్ రామ్ నివాస్ కూడా ఎర్రజెండాను తీసుకుని పరిగెత్తుకు వచ్చాడు. వారి ప్రయత్నం ఫలించి అదృష్టం కొద్ది రైలు విరిగిన ట్రాక్‌కు కొద్ది దూరంలో నిలిచిపోయింది ఆ రైల్. వీరి సమయస్ఫూర్తి వల్ల పెను ప్రమాదం తప్పింది. కార్లు, బైక్‌లు, బస్సులు వంటి వాటిని సడెన్ బ్రేక్ చేసి ఆపవచ్చు. కానీ రైళ్లకు అది సాధ్యపడదు. గంటకు సుమారు 50-60 కిమీ వేగంతో వెళ్తున్న రైలు ఆగాలంటే ఆ రైలు100 మీటర్ల దూరాన ఉంటే తప్ప సాధ్యం కాదు. కానీ సకాలంలో రైల్వే ట్రాక్మెన్లు తీసుకున్న నిర్ణయంతో వందల మంది ప్రాణాలు పెను ప్రమాదం నుంచి బయటపడ్డాయి. వీరు ఎర్ర కండువా, ఎర్రజెండా పరుగెత్తుకుని వచ్చేది గమనించిన రైలు డ్రైవర్ ఇంజిన్‌ను స్లో చేశాడు. దీంతో తొలిగిపోయిన ట్రాక్‌కు కొద్ది దూరంలో రైలు ఆగిపోయింది. జరిగిన విషయం తెలుసుకుని రైలు డ్రైవర్ పెను ప్రమాదం నుంచి బయట పడినందుకు ఊపిరి పీల్చుకుని, వారిని అభినందించాడు. వందలమందిని కాపాడిని ఈ ఇద్దరు ట్రాక్మెన్లను సత్కారించాలనుకుంటున్నామని ఉత్తర రైల్వే డిప్యూటి మేనేజర్ ఆర్ ఎన్ సంగ్ తెలిపారు. గతంలోనూ.... రామ్ నివాస్‌కు గతంలోనూ ఇలాంటి అనుభవం ఎదురయ్యింది. ఆ సమయంలో అతడు ట్రాక్ వెంట 500 మీటర్లు పరిగెత్తి డ్రైవర్‌ను అప్రమత్తం చేశాడు. దీని గురించి రామ్ నివాస్‌ను అడగ్గా ప్రయాణికుల భద్రతే నాకు ముఖ్యం. నా చిన్నతనంలో మా స్వస్థలం బీహార్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. ఆ ప్రమాదానికి గల కారణాలు నాకు తెలుసు. అందుకే నేను సర్వీసులో ఉన్నంత కాలం అలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవడం నా బాధ్యత అన్నారు. -
రామకూరు.. కన్నీరు మున్నీరు
జె.పంగులూరు/నరసరావుపేట టౌన్: ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలంలోని రామకురుకు చెందిన పెనుబోతు సోమశేఖర్, విజయలక్ష్మి దంపతులతోపాటు వారి ఇద్దరు బిడ్డలు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట ఏరియా వైద్యశాలలో శవ పంచనామా నిర్వహించిన అనంతరం తల్లీబిడ్డల మృతదేహాలను మంగళవారం రామకూరుకు తీసుకొచ్చారు. తండ్రితోపాటు ఈ ముగ్గురి మృతదేహాలకు సాయంత్రం పోలీసుల పర్యవేక్షణలో అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగానే బంగారు నగలు పుట్టింటికి.. విజయలక్ష్మి రైలు కింద పడి మరణించాలని నిర్ణయించుకున్న విజయలక్ష్మి ఆ తరువాత ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. తన బిడ్డలతో ఫొటో తీయించుకోవడంతోపాటు, తన ఒంటిపై ఉన్న బంగారు నగలను, తీసి మూటగట్టి తెలిసిన వారితో పుట్టింటికి పంపింది. విజయలక్ష్మి ఇలా ఎందుకు చేసిందో ఆరా తీసి, బంధువులు అక్కడికి చేరకునే సరికే అనంత లోకాలకు పయమై పోయారు. తన ఇద్దరు పిల్లలను చీరతో కదలకుండా కట్టేసి నరసరావుపేటలో రైల్వే ట్రాక్‌పై పడేసింది. వారిపై రైలు ఎక్కిన తర్వాత తానూ అదే రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిందని ఘటనాస్థలానికి సమీపంలో ఉన్నవారు తెలిపారు. ట్రాకు పక్కనే ఉన్న కొందరు పిల్లల కేకలు విని అక్కడికొచ్చేలోపే, దారుణం జరిగిపోయింది. తల్లి, ఇద్దరు పిల్లలు రైల్వే ట్రాకుపై రక్తపు మడుగులో నెత్తుటి ముద్దలుగా మారారు. సాయిగణేశ్ తల ఆనవాళ్లు మినహా విజయలక్ష్మి, దిగ్విజయ మృతదేహాలు మాంసపు ముద్దలుగా మారాయి. ఆకారాలే లేవు. షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్తున్నారా..? నీకేం కష్టం వచ్చిందమ్మా... చూస్తూ చూస్తూనే ఎంత పని చేశావే తల్లీ.. అంటూ విజయలక్ష్మి మృతదేహం వద్ద ఆమె తల్లి అన్నపూర్ణమ్మ రోదన.. గణేశా.. షేక్ హ్యాండ్ ఇవ్వరా.. అంటూ మనవల మృతదేహాల వద్ద తాత పేరయ్య విలపించిన తీరు చూపరుల హృదయాన్ని కలిచివేసింది. రోజూ బడికి వెళ్లే సమయంలో నాకు షేక్ హ్యాండ్ ఇచ్చే వాళ్లు కదా. ఈ రోజు నాకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్తున్నారే.. ఇక నాకు ఎవరు షేక్ హ్యాండ్ ఇస్తారంటూ పేరయ్య మృతదేహాలపై పడి విలపించాడు. ఎమ్మెల్సీ కరణం బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్ రామకూరు వెళ్లి మృతదేహలకు నివాళులు అర్పించారు. బరువెక్కిన హృదయాలతో తుది వీడ్కోలు.. భర్త సోమశేఖర్ మృతదేహంతో సహా నలుగురికి ఒకే సారి బంధువులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ అంతిమ యాత్రలో గ్రామంలోని పిల్లా పెద్దలతో సహా అందరూ పాల్గొన్నారు. గ్రామస్తులంతా మంగళవారం ఆ కుటుంబానికి శోకతప్త హృదయాలతో తుది వీడ్కోలు పలికారు. చీరాల డీఎస్పీ ప్రేమ్‌కాజల్, సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్ఐ నాగరాజు తమ సిబందితో గ్రామంలో అవాంచనీయ సంఘటనలు ఎదురు కాకుండా పర్యవేక్షించారు. కుటుంబసభ్యుల ఆత్మహత్యలపై కేసు నమోదు చేశామని, సమగ్ర దర్యాప్తు చేస్తామని డీఎస్పీ తెలిపారు. ఘటన వెనుక ఎన్నో ప్రశ్నలు.. ముక్కు పచ్చలారని పిల్లలను వదలకుండా వారితో సహా రైలు కింద పడి మృతిచెందిన తల్లి విజయలక్ష్మి, ఎందుకంత కర్కశ నిర్ణయం తీసుకుంది? చిన్న కారణానికే పంతం పట్టి మరణించాలని నిర్ణయించుకుందా? వారిపై ఎంత ప్రేమ లేకపోతే వారి మరణ వార్త విన్న వెంటనే భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాడు? ఇవన్నీ ఎవరికీ అర్థం కాని ప్రశ్నలుగా మిగిలాయి. తన భర్త ఆయన తండ్రి, సోదరుడితో కలిసి వ్యవసాయం చేయడం, ప్రతి అవసరానికి డబ్బులు వారిని అడుగుతుండటంపై తరచూ సోమశేఖర్, విజయలక్ష్మి దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవని బంధువలు ద్వారా తెలిసింది. సోమవారం కుమార్తె పుట్టిన రోజు సందర్బంగా కొత్త బట్టలు తెచ్చే విషయంలో గొడవ జరిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ దారుణ ఘటనకు ఇదే కారణం అయివుండవచ్చిన కొందరు భావిస్తున్నారు. -
ఇద్దరి పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్లలో విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శక్రవారం వెలుగు చూసింది. దరివాద కొత్తపాలెం సమీపంలో రైలు పట్టాలపై 35 ఏళ్ల మహిళ, పదేళ్ల వయసున్న ఓ బాలిక, బాలుడు మృతదేహాలు పడి ఉండగా, శుక్రవారం ఉదయం లైన్మెన్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాల్ని పరిశీలించారు. మృతుల వివరాలు, సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.