కామ్రేడ్ల రాంగ్ మార్చ్ | Communist Party collapses nation wide | Sakshi
Sakshi News home page

కామ్రేడ్ల రాంగ్ మార్చ్

Published Sun, Apr 27 2014 4:58 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

కామ్రేడ్ల రాంగ్ మార్చ్ - Sakshi

కామ్రేడ్ల రాంగ్ మార్చ్

రంగు వెలుస్తున్న ఎర్రజెండా.. దేశవ్యాప్తంగా కుదేలైన సీపీఎం, సీపీఐ
 వామపక్షాలు. ఒకప్పుడు అధికార కాంగ్రెస్‌ను, ఇతర పార్టీలను గజగజ వణికించిన పార్టీలు. ప్రత్యామ్నాయ పార్టీలుగా నీరాజనాలందుకున్న శక్తులు. సామ్రాజ్యవాదుల గుండెల్లో పరుగెత్తిన రైళ్లు. సామ్యవాద ఉద్యమాలకు కొత్త ఊపిరులు. ముఖ్యంగా సీపీఐ, సీపీఎం అయితే చాలాకాలం పాటు తాడిత, పీడిత, బాధిత ప్రజానీకానికి ఏకైక ఆశాకిరణాలుగా నిలిచాయి. ఆ పార్టీలు అధికారంలోకి వస్తే తమ బతుకుల్లో శాశ్వతంగా వెలుగులు నిండుతాయని ఆశించిన వారు ఎందరో! ఇదంతా గతం. మూల సిద్ధాంతాలకు కట్టుబడి కొనసాగలేక, అలాగని మారుతున్న కాలానికి అనుగుణంగా మారనూ లేక.. గత వైభవాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ... ఒకదాని వెంట ఒకటిగా చారిత్రక తప్పిదాలు చేస్తూ, ఆనక తీరిగ్గా అందుకు విచారిస్తూ, గతుకుల దారిలో వెనక్కూ ముందుకూ ఊగిసలాడుతూ పయనిస్తూ... ఇదీ వామపక్షాల వర్తమాన దైన్యం.
 
 జాతీయ పార్టీలుగా ఒక వెలుగు వెలిగిన రోజుల నుంచి ఎక్కడికక్కడ ఏదో ఒక ప్రాంతీయ పార్టీ పంచన చేరకుంటే వాటి ఉనికే కనాకష్టంగా మారిన దుస్థితి. చివరికి బెంగాల్, కేరళ వంటి కంచుకోటలు కూడా బద్దలయ్యాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోలేకపోవడం. సైద్ధాంతిక పునాదులను నేల మీద కాకుండా ఊహల్లో నిర్మించుకోవడం. భారత సామాజిక వ్యవస్థను, కుల సమీకరణాలను సరిగా అర్థం చేసుకోకపోవడం... ఈ దుస్థితికి కారణాలెన్నో. ఏదేమైనా భారత్‌లో వామపక్షాల లాంగ్‌మార్చ్‌కు రెడ్‌లైట్ పడింది. గత దశాబ్ద కాలంలో సీపీఎం, సీపీఐ ఉత్థాన పతనాలపై ఫోకస్...
 
 నాంచారయ్య మెరుగుమాల: భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వావ్యు పంథాను ఆమోదించిన సీపీఎం, సీపీఐ తొలిసారిగా లోక్‌సభలో 50 సీట్ల కన్నా ఎక్కువ సాధించింది ఒక్క 2004 ఎన్నికల్లోనే. అప్పుడు సీపీఎం 43, సీపీఐ 10 స్థానాలు గెలుచుకున్నారుు. కానీ ఆ తర్వాత 2009 లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థారుులో బలాన్ని కోల్పోయి కేవలం 20 సీట్లకే పరిమితవుయ్యూయి. ఇలా కవుూ్యనిస్టులు ఒక లోక్‌సభ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ చూడని విజయూన్ని సాధించి, ఆ తర్వాతి ఎన్నికల్లోనే అత్యంత అధ్వాన స్థితికి చేరుకోవడం విచిత్రం! ఇక ఈ లోక్‌సభ ఎన్నికల్లోనైతే సీపీఎం, సీపీఐ వురింత నీరసించి కన్పిస్తున్నాయి. ప్రస్తుతమున్న 20 సీట్లను కూడా నిలబెట్టుకోలేని దుస్థితికి చేరుకున్నాయి...
 
 ఆరేళ్ల ఎన్డీఏ పాలనలో వుతతత్వం పెరిగిపోరుుందని, 2002 గుజరాత్ ఊచకోతకు కారణమైన బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని నినాదమిస్తూ కవుూ్యనిస్టులు 2004లో పోరాడారు. తోటి వావుపక్షాలైన ఫార్వర్డ్ బ్లాక్ (3), రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆరెస్పీ-3)తో కలిసి సీపీఎం, సీపీఐ తొలిసారిగా దాదాపు 60 లోక్‌సభ సీట్లు కైవసం చేసుకున్నారుు. కాంగ్రెస్ నాయుకత్వంలో కేంద్రంలో ఏర్పడిన యుూపీఏకు బయుటి నుంచి వుద్దతిచ్చాయి. అయితే 2008లో వున్మోహన్‌సింగ్ సర్కారు అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవడానికి నిరసనగా ఎన్నికలకు దాదాపు ఏడాది వుుందు యుూపీఏ సర్కారుకు వుద్దతు ఉపసంహరించుకున్నారుు. ఎస్పీ వంటి పార్టీల వుద్దతుతో యుూపీఏ నిలబడింది.
 
 సింగూరు, నందిగ్రాం దెబ్బలు
 2009 ఎన్నికల్లో అంతకు వుుందు తవుకు అత్యధిక స్థానాలు లభించిన పశ్చివుబెంగాల్, కేరళల్లో ఉభయు కవుూ్యనిస్టు పార్టీలు చావుదెబ్బ తిన్నాయి. దాంతో వాటి స్కోరు 20కి పడిపోరుుంది. అప్పటికి ఆ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కవుూ్యనిస్టులపై జనంలో నెలకొన్న వ్యతిరేకత ఆ ఎన్నికల్లో వాటిని కోలుకోలేనంతగా దెబ్బ తీసింది. అదీగాక, 1977 నుంచి పశ్చివుబెంగాల్‌లో సీపీఎం నేతృత్వంలో అప్పటికి 32 ఏళ్లుగా అధికారంలో ఉన్న కవుూ్యనిస్టు ప్రభుత్వంపై ప్రజల్లో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పెరిగాయి.
 
  ఇందుకు బుద్ధదేవ్ భట్టాచార్య నేతృత్వంలో 2006లో రెండోసారి వచ్చిన కవుూ్యనిస్టు సర్కారు పారిశ్రామికీకరణ పేరుతో చేసిన రెండు ప్రయుత్నాలు ప్రధానంగా కారణమయ్యాయి. సింగూరులో టాటా మోటర్స్ తలపెట్టిన నానో కారు ప్రాజెక్టుకు దాదాపు 10,000 ఎకరాల పంట భూవుులను రైతుల నుంచి బలవంతంగా సేకరించి కట్టబెట్టడం, మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రాం లోనూ ఇదే తరహాలో ఇండొనేసియూకు చెందిన కంపెనీకి వేలాది ఎకరాలు బలవంతంగా జనం నుంచి సేకరించడానికి ప్రయుత్నించి ప్రాణనష్టానికి కారణం కావడంతో సీపీఎం ప్రతిష్ట వుసకబారింది.
 
  ప్రజలకు భూమి పై ఉన్న హక్కును కాపాడే పేదల మిత్రులనే పేరు గాల్లో కలిసిపోరుుంది. దాంతో 2011లో కేరళ, బెంగాల్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ఫలితాలు 2009 లోక్‌సభ ఎన్నికలనే ప్రతిబింబించారుు. బెంగాల్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న తృణవుూల్ కాంగ్రెస్ తిరుగులేని విజయుం సాధించి అధికారంలోకి వచ్చింది. బుద్ధదేవ్ సైతం ఓడిపోయూరు. కేరళలోనూ పరాజయుం తప్పలేదు. గత వుూడేళ్లలో వువుతా బెనర్జీ నాయుకత్వంలోని తృణవుూల్ సర్కారు ఏలుబడిలో శారదా చిట్‌ఫండ్స్ వంటి కుంభకోణాలు, సర్కారీ నియుంతృత్వ ధోరణల వంటివి కొనసాగుతున్నా జనం ఇంకా పాలకపక్షం వైపే ఉన్నారని ఇటీవలి సర్వేలు తెలుపుతున్నారుు. ఈ పరిస్థితుల్లో బెంగాల్‌లో సీపీఎం బలం ఈసారి వురింత తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నారుు. 2004లో బెంగాల్‌లో సీపీఎం 26, సీపీఐ 3 సీట్లు కైవసం చేసుకున్నారుు. 2009లో మాత్రం సీపీఎం బలం 9 సీట్లకు, సీపీఐది 2 సీట్లకు పడిపోయాయి. తృణవుూల్ 19 సీట్లు కైవసం చేసుకుంది. ఈసారి అది 28 సీట్ల దాకా పెరగవచ్చంటున్నారు. అదే జరిగితే ఉభయ కవుూ్యనిస్టులూ కలిపి ఆరేడు సీట్లకే పరిమితవుయ్యే ఆస్కారముంది. ఇక కేరళలో వూత్రం అవి పుంజుకోకపోరుునా మరీ ఎక్కువగా దెబ్బ తినే ఆస్కారం కూడా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. 2009 లో ఇక్కడ మొత్తం 20 సీట్లకు గాను సీపీఎం కేవలం 4 సీట్లు గెలవగా సీపీఐ ఖాతా కూడా తెరవలేదు! 2004 ఎన్నికల్లో కేరళలో సీపీఎం 12 సీట్లు, సీపీఐ 3 సీట్లు గెలుచుకున్నాయి.
 
 స్కాంలు వెలికితీసినా
 2జీ స్పెక్ట్రం కుంభకోణాన్ని బయట పెట్టింది సీపీఎం నేత సీతారాం ఏచూరే. యుూపీఏ-1 హయూంలోనే దీన్న ఆయన వెలగులోకి తీసుకొచ్చారు. అంతేగాక కృష్ణా-గోదావరి బేసిన్‌లోని సహజవాయుువు ధర నిర్ణయుంలో రిలయున్స్ ఇండస్ట్రీస్‌కు బాగా లాభించేలా యుూపీఏ సర్కారు నిర్ణయూలు తీసుకుంద తొలుత లేవనెత్తింది కూడా సీపీఐ అగ్రనేత, ప్రవుుఖ పార్లమెంటేరియున్ గురుదాస్ దాస్‌గుప్తాయే. ఈ రెండు కుంభకోణాలు యుూపీఏ ప్రతిష్టను దెబ్బ తీశాయి. ఫలితంగా ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ లోక్‌సభలో రెండంకెలకు దిగజారనుందని అంటున్నారు. కానీ ఇలాంటి కుంభకోణాలను బయట పెట్టిన ప్రయోజనం కవుూ్యనిస్టులకు కాకుండా బీజేపీకి, దాని మిత్రపక్షాలకు లభించేలా పరిస్థితులు వూరిపోయూరుు.
 
  మరోవైపు అవినీతి వ్యతిరేకోద్యవుం నుంచి కొత్తగా పుట్టుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా కేంద్రంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న ఆశ్రీత పక్షపాత పెట్టుబడిదారీ విధానాలపై కవుూ్యనిస్టుల బాటలో ఎప్పటికప్పుడు పోరాడుతూ వాటి స్థానాన్ని నెవ్ముదిగా ఆక్రమించేలా కన్పిస్తోంది. ఆధునిక పద్ధతుల్లో వుుందుకొచ్చిన ఆప్‌తో కమ్యూనిస్టులు పోటీ పడలేని స్థితికి చేరుకున్నారు. కేరళ, బెంగాల్ కన్నా వుుందు కవుూ్యనిస్టు పార్టీ వేళ్లూనుకున్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లోనైతే ఈసారి సీపీఎం, సీపీఐ ఒక్క లోక్‌సభ స్థానం కూడా గెలవడం అసాధ్యంగా కనిపిస్తోది. అవి రెండూ కలిసి ఐదారు లోక్‌సభ సీట్లు గెలిచిన సందర్భాలున్న బీహార్‌లో కూడా ఈసారి సున్నా చుట్టేయడం ఖాయమే.
 
 బెంగాల్లోనూ దిగాలే
 ఎవుర్జెన్సీ తొలగించాక 1977లో బెంగాల్‌లో 17 సీట్లు గెలిచిన సీపీఎం, తర్వాత వుూడు నెలలకు రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకుంది. అంతేగాక ఆ తర్వాత అక్కడ జరిగిన ఏ ఎన్నికల్లోనూ వెనకబడలేదు. తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో 28 (1980), 18 (1984), 26 (1989), 27 (1991), 23 (1996), 23 (1998), 21 (1999), 26 (2004) చొప్పున సీట్లు గెలుస్తూ వచ్చింది. కానీ బెంగాల్లో 2009 లోక్‌సభ ఎన్నికల్లో మొదలైన వామపక్షాల పతనం (సీపీఎం 9, సీపీఐ 2)... 2011 అసెంబ్లీ ఎన్నికలతో వేగం పుంజుకుంది. ఈసారి వాటి బలం మరింత తగ్గడం ఖాయువునే దాదాపు అన్ని ఎన్నికల సర్వేలూ చెబుతున్నారుు.
 
 చీలిక తర్వాతా బలపడి కూడా...
 1964లో ఉవ్ముడి కవుూ్యనిస్టు పార్టీ సీపీఐ, సీపీఎంగా చీలిపోయూక 1967 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ 23, సీపీఎం 19 సీట్లు సాధించారుు. తర్వాత 1971 నుంచి 2004 దాకా జరిగిన తొమ్మిది లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీల ఉమ్మడి బలం ఎప్పుడూ పాతిక సీట్లకు తగ్గలేదు. అలాంటిది 2009లో 20 స్థానాలకు దిగజారింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement