ఎవరి పోరు వారిదే
వామపక్షాలు - ప్రస్థానం
కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా సీపీఐది ఒంటరి పోరే సవుంజసమైన ప్రాతినిధ్యం కోసం సీపీఎం పోరాటం
ఈసారి ఎన్నికల రణక్షేత్రంలో కామ్రేడ్లు ఎవరి వ్యూహం వారిది అన్నట్టుగా సాగుతున్నారు. తెలంగాణ శాసనసభలో ప్రాతినిధ్యం కోసం సీపీఎం, సీపీఐ వేర్వేరు పంథాల్లో పయునిస్తున్నారుు. సాధారణంగా తవులో ఎన్ని వైరుధ్యాలున్నా ఎన్నికల క్షేత్రంలోకి వచ్చేసరికి అవి పరస్పరం సహకరించుకునేవి. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా సాగుతున్నాయి. ఎవరి వ్యూహాలు వారివి, ఎవరి ఎత్తుగడలు వారివి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సీట్ల అవగాహన కుదుర్చుకుని సీపీఎం ముందుకెళుతోంది. నిజానికి సీపీఎం మొదటి నుంచీ సమైక్యవాదానికి కట్టుబడగా, సీపీఐ తెలంగాణ ఆకాంక్షకు వుద్దతు పలికింది. తీరా ఎన్నికల బరిలో నిలిచే సవుయూనికి కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లతో పొత్తు కోసం సీపీఐ తీవ్రంగా ప్రయుత్నించింది. చివరకు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నావునిపించింది. సీపీఎం వూత్రం రాష్ట్ర విభజన ఓ కొలిక్కి వచ్చీ రాగానే రెండు రాష్ట్రాలకూ వేర్వేరు శాఖలు ఏర్పాటు చేసుకుంది. తెలంగాణ కోసం ప్రత్యేక వ్యూహంతో కదిలింది. ప్రస్తుతం ఉవ్ముడి అసెంబ్లీలో సీపీఐకి నాలుగు సీట్లు, సీపీఎంకు ఒక సీటు ఉన్నారుు. ఇవన్నీ తెలంగాణలోని సీట్లే. అందుకే ఈసారి అక్కడ తవు బలాన్ని మరింత పెంచుకునేందుకు అవి ప్రయత్నిస్తున్నాయి.
సీపీఐ... చిత్రమైన పరిస్థితి!
ఇక ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించి, కొత్త రాష్ట్ర ఏర్పాటుకు పూర్తి మద్దతు తెలిపిన సీపీఐ, విభజన తర్వాత చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. తెలంగాణ రాష్ట్రంలో రాకెట్ వేగంతో దూసుకెళ్లాలని భావించిన కంకి కొడవలికి పలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. 2009 ఎన్నికల్లో మహాకూటమితో జట్టు కట్టి నాలుగు అసెంబ్లీ సీట్లు దక్కించుకున్న సీపీఐ, కొత్త అసెంబ్లీలో ప్రాతినిధ్యం కోసం నానా తంటాలు పడుతోంది. అందుకోసం ఏకంగా అజెండాను పక్కకు పెట్టి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా ఆశించిన ఫలితం దక్కేలా లేదు. సీపీఐకి కేటాయించిన ఏడు స్థానాల్లో ఏకంగా ఐదు చోట్ల కాంగ్రెస్ రెబల్స్ బరిలో దిగడంతో కామ్రేడ్లు కంగుతిన్నారు. దాంతో ఆయూ స్థానాల్లో సీపీఐది ఒంటరి పోరే అన్నట్లు తయూరైంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయుణ స్వయుంగా పోటీ చేస్తున్న ఖవ్ముం లోక్‌సభ స్థానంపై పార్టీ బాగా దృష్టి పెట్టింది. కాంగ్రెస్‌తో పొత్తు వల్ల పోటీ చేసే అవకాశం లేక పలు జిల్లాల్లో సీపీఐ శ్రేణులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారుు. నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి వలస వెళ్తున్నారు. ఇలా ఇప్పటికే మెదక్ జిల్లాలోని సీపీఐ కార్యవర్గం మొత్తం జెండా ఎత్తేసి ఇతర పార్టీలోకి వెళ్లిపోయింది. మిగతా జిల్లాల్లో కూడా సీపీఐ పరిస్థితి అంతంత మాత్రంగానే తయారైంది.
కొత్త వ్యూహంతో సీపీఎం!
ఇన్నాళ్లు సమైక్యవాదం వినిపించిన సీపీఎం... రాష్ట్ర విభజన ఖాయమవడంతో తెలంగాణ నవనిర్మాణంపై దృష్టి సారించింది. కొత్త రాష్ట్రంలో తమ ప్రాతినిధ్యం పెంచుకోవడం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క జూలకంటి రంగారెడ్డి మాత్రమే అసెంబ్లీలో సీపీఎంకు ప్రాతినిధ్యం వహించారు. ఈసారి మరిన్ని సీట్లను గెలుచుకుని చట్టసభల్లో తమ గొంతును మరింత గట్టిగా వినిపించేందుకు సీపీఎం అన్ని రకాల వ్యూహాలను సిద్ధం చేసుకుని బరిలోకి దిగింది. తెలంగాణలోని మొత్తం 119 స్థానాల్లో తమకు కార్యకర్తల బలవుుందని నవుు్మతున్న చోట్ల మాత్రమే అభ్యర్థులను బరిలోకి దించింది. కచ్చితంగా గెలుస్తామనుకున్న చోట్ల సంప్రదాయ పార్టీలతో, నాయుకులతో అవగాహన కుదుర్చుకుంది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీతో అవగాహన కుదుర్చుకోవడంతో పాటు మిగతా జిల్లాల్లో స్థానికంగా టీఆర్‌ఎస్, స్వతంత్రుల మద్దతు తీసుకోవడానికి, ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ మేరకు జిల్లా శాఖలకు కొంత స్వేచ్ఛ కూడా ఇచ్చారు. తవు బలవుున్న స్థానాల్లో పోటీలో ఉండి పార్టీ శ్రేణులను కాపాడుకోవడం, వీలైన చోట్ల గెలుపుజెండా ఎగరేయుడం... ఇదీ సీపీఎం వ్యూహం! ఈ వ్యూహాలన్నింటికీ సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వం వహిస్తున్నారు. వుధిర, పాలేరు, భద్రాచలం, వుహబూబాబాద్, నర్సంపేట అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ వుద్దతు సీపీఎంకు బాగా అనుకూలంగా ఉంది. సూర్యాపేటలో స్వతంత్ర అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావుకు వుద్దతిస్తున్నారు. అక్కడక్కడా టీఆర్‌ఎస్ అభ్యర్థులకు కూడా సీపీఎం వుద్దతిస్తోంది.