పట్టాలపై ఎర్రజెండా.. నిద్రపోయిన గేట్మ్యాన్ | gateman keeps red flag on railway track, sleeps aside | Sakshi
Sakshi News home page

పట్టాలపై ఎర్రజెండా.. నిద్రపోయిన గేట్మ్యాన్

Published Sat, Jul 26 2014 1:43 PM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM

పట్టాలపై ఎర్రజెండా.. నిద్రపోయిన గేట్మ్యాన్

పట్టాలపై ఎర్రజెండా.. నిద్రపోయిన గేట్మ్యాన్

ఓపక్క రైలుప్రమాదాలు ఎన్ని సంభవిస్తున్నా, నిర్లక్ష్యం మాత్రం వీడట్లేదు. నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మోషంపూర్లో ఓ గేట్మ్యాన్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఏకంగా రైలు పట్టాల మీద ఎర్రజెండాను పాతి నిద్రపోయాడు. దాంతో అటువైపుగా వెళ్తున్న కాచిగూడ-బోధన్ ప్యాసింజర్ రైలు నిలిచిపోయింది.

ఎర్రజెండా ఉండటంతో ముందు ఏమైనా ప్రమాదం ఉందేమోనన్న అనుమానంతో డ్రైవర్లు రైలును నిలిపివేశారు. ఏమైందో తెలియక ప్రయాణికులు కూడా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తీరా చూస్తే, అక్కడకు సమీపంలోనే గేట్ మ్యాన్ నిద్రపోతూ కనిపించడంతో అతడిని లేపి అడిగితే అసలు విషయం తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement