హరిద్వార్: ఉత్తరాఖండ్‌లోని రూర్కీ–లుక్సార్ మార్గంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్ సిలిండర్‌ను ఉంచారు. ధంధేరా రైల్వే స్టేషన్ సమీపంలో రెండో లైన్‌పై ఉన్న సిలిండర్‌ను శనివారం ఉదయం 6.45 గంటల సమయంలో గూడ్స్ రైలు గార్డు ఒకరు గమనించి అధికారులకు వెంటనే సమాచారిమిచ్చారు.
ఆ సమయంలో ఆ మార్గంలో రైళ్లేవీ ప్రయాణించడం లేదని లుక్సర్ రైల్వే పోలీస్ ఇన్‌చార్జి సంజయ్ శర్మ చెప్పారు. రైలు మార్గం మధ్యలో మూడు కిలోల చిన్న ఖాళీ సిలిండర్ పడి ఉందని తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసు బృందాలు సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రూర్కీ సివిల్ లైన్ పోలీస్‌స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై రైల్వే చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు.
ఎక్స్‌ప్రెస్ రైలు బోగీకి మంటలు
ఛతర్‌పూర్: మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో ఆదివారం ఉదయం గీతా జయంతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీకి మంటలంటుకున్నాయి. ఉదయం 7.30 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ఇషానగర్ స్టేషన్ నుంచి రైలు వెళ్తుండగా డీ5 కోచ్‌లో పొగలు రావడాన్ని గమనించిన వెంటనే సిబ్బంది రైలును నిలిపివేసి, ఆర్పివేశారని ఓ అధికారి తెలిపారు. కోచ్ దిగువ భాగంలోని రబ్బర్ వేడెక్కడం వల్లే మంటలు మొదలైనట్లు తెలుస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment