My Speech Removed Says Ashok Gehlot Prime Minister's Office Responds - Sakshi
Sakshi News home page

రాజస్థాన్ సీఎం అలక .. ఆపై ప్రధానికి అలా ఆహ్వానం

Published Thu, Jul 27 2023 1:08 PM | Last Updated on Thu, Jul 27 2023 2:49 PM

My Speech Removed Says Ashok Gehlot Prime Ministers Office Responds - Sakshi

జైపూర్: ప్రధాని కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమంలో తన ఆహ్వాన ప్రసంగానికి సమయం ఇవ్వనందున తాను కార్యక్రమానికి హాజరు కావడం లేదని ఈ విధంగా ట్విట్టర్లో మా ఆహ్వానాన్ని అందుకోండంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నరేంద్ర మోదీకి ఆహ్వానాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ అనారోగ్యం కారణంగా ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని, ఆయన వీలైనంత తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. 

శిఖర్ వేదికగా కిసాన్ సమ్మాన్ నిధులను రైతుల ఖాతాలో జమ చేసేందుకు రాజస్థాన్ విచ్చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అంతకుముందు ఈ కార్యక్రమానికి షెడ్యూలును విడుదల చేసింది ప్రధాని కార్యాలయం. కానీ అందులో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేరు లేకపోవడంతో కోపగించి తాను కూడా ప్రధానిని ఆహ్వానించడానికి వెళ్లడం లేదని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ సందర్బంగా ఇదే ట్విట్టర్ వేదికగా ప్రధానికి ఆహ్వానాన్ని తెలుపుతున్నానని అన్నారు. 

అశోక్ గెహ్లాట్ తన సందేశంలో ఏమని రాశారంటే.. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి, మీ కార్యాలయం వారు కార్యక్రమానికి ముందుగా ఉండాల్సిన నా 3 నిముషాల ఆహ్వాన ప్రసంగాన్ని తొలగించిన కారణంగా నేను స్వయంగా వచ్చి  మీకు ఆహ్వానం తెలపలేకపోతున్నాను. అందుకే ఈ ట్విట్టర్ మాధ్యమాం ద్వారా మీకు ఆహ్వానం తెలుపుతున్నానని, గడిచిన ఆరు నెలల్లో ఏడోసారి పర్యటిస్తున్న మీకు అక్కడకు వచ్చి ఆహ్వానించి మీకు కొన్ని డిమాండ్లను తెలపాలని అనుకున్నాను. కానీ అది కుదరకపోవంతో ఈ మాధ్యమం ద్వారా వాటిని మీ ముందుంచుతున్నానని ఐదు డిమాండ్లను రాశారు 

దీనికి బదులుగా ప్రధాని కార్యాలయం స్పందిస్తూ..  ప్రోటోకాల్ ప్రకారం మొదట షెడ్యూలులో మీ ఆహ్వాన ప్రసంగం చేర్చడం జరిగింది. కానీ మీ కార్యాలయం నుండి మీరు కార్యక్రమానికి హాజరు కావడం లేదని తెలిపారు. ప్రధాని గత పర్యటనల్లో మిమ్మల్ని ఆహ్వానించినా ప్రతిసారి మీరు హాజరయ్యారు. ఈ రోజు కార్యక్రమానికి కూడా మిమల్ని ఆహ్వానిస్తున్నాము. అభివృద్ధి కార్యక్రమాల ఫలకాల మీద కూడా మీ పేరుని చేర్చడం జరిగింది. మీకు తగిలిన గాయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టనంతవరకు మీరు కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానిస్తున్నామని రాసింది. 

త్వరలో జరగనున్న రాజస్థాన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, శిఖర్ లో ఆ పార్టీకి 8 ఎమ్మెల్యే సీట్లలో ఒక్కటి కూడా దక్కని కారణంగా ఈసారి ఇక్కడ  ఎలాగైనా బోణీ కొట్టాలన్న ఉద్దేశ్యంతోనే ఇక్కడ కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమాన్ని నిర్వహించారని అంటున్నాయి రాజస్థాన్ కాంగ్రెస్ వర్గాలు.   

ఇది కూడా చదవండి: ఆగ్రాలో మరో దారుణం.. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిపై మూత్ర విసర్జన         

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement