జైపూర్/రేవాడీ: కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఆ పార్టీ బంధుప్రీతి, వారసత్వ రాజకీయాల విష వలయంలో చిక్కుకుందని, అందుకే నాయకులంతా బయటకు వెళ్లిపోతున్నారని చెప్పారు. తనను వ్యతిరేకించడమే కాంగ్రెస్ ఏకైక అజెండాగా మారిపోయిందని మండిపడ్డారు.
‘‘కాంగ్రెస్‌కు దశ, దిశ లేవు. భవిష్యత్తులో చేయాల్సిన అభివృద్ది పట్ల విజన్, రోడ్డు మ్యాప్ లేవు’’ అన్నారు. శుక్రవారం జైపూర్‌లో ‘వికసిత్ భారత్, వికసిత్ రాజస్తాన్’ సభనుద్దేశించి మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. రోడ్లు, రైల్వేలు, సౌర శక్తి, విద్యుత్ సరఫరా, తాగునీరు, పెట్రోలియం, సహజ వాయువు తదితర రంగాలకు చెందిన రూ.17,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
వికసిత్ భారత్ అంటే...
ప్రజలకు ఇచి్చన గ్యారంటీలను తాము అమలు చేస్తుంటే కొందరికి నిద్ర పట్టడం లేదని మోదీ అన్నారు. వికసిత్ భారత్, మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ వంటివి తాము ప్రారంభించిన పథకాలు కావడంతో వాటి గురించి కాంగ్రెస్ మాట్లాడడం లేదని ఆరోపించారు. మోదీ ఏం మాట్లాడినా, ఏం చేసినా కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని, దీనివల్ల దేశానికి భారీ నష్టం కలిగే అవకాశం ఉన్నా ఆ పార్టీ లెక్కచేయడం లేదని మండిపడ్డారు.
ఇలాంటి ప్రతికూల రాజకీయాలు యువతకు ఏమాత్రం స్ఫూర్తిని ఇవ్వబోవని తేలి్చచెప్పారు. ఇటీవలే యూఏఈలో పర్యటించానని, భారత్ సాధిస్తున్న ప్రగతిని చూసి అక్కడి నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారని ప్రధాని మోదీ వెల్లడించారు. వికసిత్ భారత్ అంటే కేవలం కొన్ని పదాలు లేదా భావోద్వేగం కాదని వివరించారు. దేశంలో ప్రతి కుటుంబాన్ని సౌభాగ్యవంతంగా మార్చే, పేదరికాన్ని తొలగించే, ఉపాధి అవకాశాలు సృష్టించే, ఆధునిక వసతులు కలి్పంచే కార్యక్రమం అని తెలియజేశారు.
తన దృష్టిలో యువత, మహిళలు, రైతులు, పేదలు అనే నాలుగు కులాలు మాత్రమే ఉన్నాయని ప్రధానమంత్రి మరోసారి వివరించారు. హరియాణాలోని రేవాడీలో ఎయిమ్స్‌కు మోదీ శంకుస్థాపన చేశారు. పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. రాముడు కేవలం ఊహేనని, ఆయోధ్యలో ఆలయం అవసరం లేదని అన్న కాంగ్రెస్ ఇప్పుడు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తోందని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment