
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లా గుమియపాల్ వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో గుమియపాల్ అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. అదే సమయంలో మావోయిస్టులు వారికి తరసా పడటంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులను సిబ్బంది మట్టుబెట్టారు. ఒకరిని అరెస్ట్ చేసి.. వారి వద్ద ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. తాజా ఘటనతో దంతేవాడ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ను మరింత కట్టుదిట్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment