
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా సిబ్బంది కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లా సీతాగోటా అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. శనివారం ఉదయం స్థానిక రిజర్వ్ గార్డ్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా స్థలంలో భారీగా పేలుడు సామాగ్రి, ఆయుధాలను సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఏకే-47, 303 రైఫిల్స్, 12 బోర్‌గన్స్ సింగిల్ షాట్ రైఫిల్స్ వంటి ఆయుధాలు వారి వద్ద లభ్యమయ్యాయి. అయితే ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు డీజీపీ డీఎం అవాస్తీ తెలిపారు. మరోవైపు మహారాష్ట్ర సరిహద్దులో కూడా కాల్పులు జరుపుతున్నట్లు సమాచారం.
కాగా మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీతాగోట్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తోన్న దళాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో మెరుపువేగంతో వారిపై కాల్పులు జరిపి.. ఏడుగురిని హతమార్చరు.
Comments
Please login to add a commentAdd a comment