ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. చింతగుప్ప పోలీసు స్టేషన్ పరిధిలోని బొత్తలంక, ఎరపల్లి అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఆపరేషన్‌లో పాల్గొన్న సైనికులపై నక్సల్స్ కాల్పులు జరిపారు. సైనికులపై నక్సల్స్ మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. నక్సల్స్ కాల్పులను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. నక్సల్స్ కోర్ ఏరియాలోకి భద్రతా బలగాలు ప్రవేశించాయి.
గురువారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.అయితే.. ఈ ఎన్ కౌంటర్‌లో పలువురు నక్సలైట్లు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. డీఆర్జీ, సీఆర్పీ ఎఫ్, కోబ్రా దళాలకు సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్, సీఆర్పీ ఎఫ్ డీఐజీ ఆనంద్, కుంట డీఐజీ సూరజ్‌పాల్ వర్మలు ఎప్పటి కప్పుడు ఎన్ కౌంటర్ సమాచారం తెలుసుకుంటూ సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
చదవండి: కోల్‌కతా బాధితురాలి విగ్రహావిష్కరణ.. సోషల్ మీడియాలో చర్చ
Comments
Please login to add a commentAdd a comment