దంతెవాడ: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. చిట్టడవిలో కాల్పుల మోత మరోసారి మోగింది. ఈ పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన దంతేవాడ జిల్లాలోని దోల్కల్ అటవీ ప్రాంతంలో డీఆర్జీ జవాన్లు, నక్సల్స్ మధ్య గురువారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. బైరాంగఢ్ ఏరియా కమిటీ మావోయిస్టులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.
ముగ్గురి మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. మృతిచెందిన వారు 1.బిర్జు కాకెం బెచాపాల్ నివాసి, మిలీషియా ప్లాటూన్ కమాండర్. ఇతడిపై రూ.లక్ష రివార్డు ఉంది. 2. జక్కు కకేం తమోడి బెచాపాల్ ఆర్పిసీ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. రూ.లక్ష రివార్డు ఉంది. మూడో వ్యక్తి మిలటియా ప్లాటూన్ సభ్యుడు నీలవా నివాసి రామ్నాథ్. మావోయిస్టుల నుంచి మూడు దేశీయ ఆయుధాలు, మూడు కిలోల ఐఈడీ, పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment