
రాయ్‌పూర్ : నక్సల్ ఏరివేతలో భాగంగా ఎనిమిది నెలల గర్భవతి విధులు నిర్వర్తిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. నక్సల్ కార్యక్రమాలను అరికట్టడంలో భాగంగా చత్తీస్‌గఢ్ ప్రభుత్వం నక్సల్ ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా ఎనిమిది నెలల గర్భంతో ఉన్న సునైనా పటేల్ అనే మహిళా కమాండర్ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటోంది. నక్సల్స్‌లో పోరు అంటేనే ఎంతో ప్రమాదకరమైనది అయినా ఏమాత్ర భయం లేకుండా దట్టమైన అడవిలో బంధుకు చేతబూని దూసుకుపోతోంది.
దీనిపై సునైనా మాట్లాడుతూ.. తాను విధుల్లో చేరినప్పుడు రెండు నెలల గర్భవతి అని చెప్పారు. తాను పరిస్థితుల్లో ఉన్నా.. తనకు అప్పగించిన విధిని నిర్వర్తించడమే దన అంతిమ లక్ష్యమన్నారు. ప్రమాదకరమైన ఈ వృత్తిలో కొనసాగడానికి తనకు ఏమాత్రం భయం లేదన్నారు. కాగా విధిపై తనకున్న అంకితభావానికి పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఆమె దంతెవాడ జిల్లా రిజర్వ్ గార్డుగా విధుల్లో ఉన్నారు.