
సాక్షి, దంతెవాడ: ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడలోని ఆర్నాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్ బృందాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. కూంబింగ్ సమయంలో మావోయిస్టులు ఎదురుపడి కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. మృతుల్లో ఓ మహిళ మావోయిస్టు కూడా ఉండగా, ఘటనా స్థలం నుంచి విప్లవ సాహిత్యంతో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment