sukma
-
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్..ఇద్దరు మావోయిస్టులు మృతి
రాయ్‌పూర్:ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు,పోలీసులకు మధ్య మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.సుక్మా జిల్లా కార్కగున అటవీ ప్రాంతంలో మంగళవారం(సెప్టెంబర్24) కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతాబలగాలపై తొలుత మావోయిస్టులు కాల్పులు జరిపారు.ఈ కాల్పులకు ప్రతిగా బలగాలు జరిపిన కాల్పుల్లో మావోయిస్టులు మృతిచెందారు.సోమవారమే ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. -
చత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో సోమవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మహిళ సహా ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారు. జిల్లాలోని భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దంతేష్‌పురం అడవుల్లో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఎన్కౌంటర్ స్థలం నుంచి నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు(ఐఈడీ), ఆటోమేటిక్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతుంది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో పాల్గొన్న సమయంలో కాల్పులు జరిగినట్లు సుక్మా పోలీస్ సూపరింటెండెంట్ సునీల్ శర్మ తెలిపారు. డీఆర్జీ జవాన్లపై నక్సలైట్లు కాల్పులు జరిపారని, ఆ తర్వాత పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయని పేర్కొన్నారు. చెప్పారు. జవాన్ల చేతిలో హతమైన మావోయిస్టులను గొల్లపల్లి ఎస్ఓఎస్ కమాండర్ మద్కమ్, ఆయన భార్య పొడియం భీమ్‌గా గుర్తించారు. మద్కమ్‌పై రూ 8 లక్షల రివార్డు ఉండగా.. ఆయన భార్యపై రూ. 3లక్షల రివార్డు ఉన్నట్లు పేర్కొన్నారు. చదవండి: Karnataka Elections: తెలుగువారి ప్రభావమున్న జిల్లాలో ఎవరిది పైచేయి -
రోడ్డు ప్రమాదానికి గురైన ‘బచ్పన్ కా ప్యార్’ బాలుడు.. తలకు తీవ్ర గాయం
సుక్మా: ‘జానే మేరీ జానేమన్.. బచ్పన్ క్యా ప్యార్ మేరా..’ ఈ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 14 ఏళ్ల సహదేవ్ క్లాస్‌రూంలో పాడిన ఈ పాట దేశ వ్యాప్తంగా మార్పోగింది. ఈ బుడ్డోడి గొంతుకు సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. చత్తీస్‌గఢ్ సీఎం సీఎం భూపేష్ బాఘేల్ అతడిని స్వయంగా పిలిపించుకుని ఘనంగా సన్మానించారు. తాజాగా బచ్ పన్ కా ప్యార్ పాటతో పాపులర్ అయిన బాలుడు సహదేవ్ డిర్డో మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ద్విచక్ర వాహనంపై తన తండ్రితో కలిసి వెళ్తుండగా అదుపుతప్పి కిందపడింది. తండ్రికి స్వల్పగాయాలవ్వగా.. సహదేవ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని సుక్మా జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జగ్దల్పూర్ వైద్య కళాశాల హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రమాదం గురించి తెలుసుకున్న కొంటా ఎమ్మెల్యే కవాసీ లఖ్మా.. సహదేవ్ దిర్డోకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఛదవండి: ఒక్కసారిగా పెరిగిన కోవిడ్ కేసులు.. 44 శాతం అధికంగా.. 781కి చేరిన ఒమిక్రాన్ కేసులు అదే విధంగా జిల్లా కలెక్టర్ వినీత్ నందన్వర్, ఎస్పీ సునీల్ శర్మ.. అతడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుతం సహ్‌దేవ్ ప్రమాదం గురించి తెలిసిన పలువురు సెలబ్రిటీలు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. సహదేవ్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ట్వీట్ చేస్తున్నారు. మరోవైపు సహదేవ్ ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గానే ఉందని, స్పృహలోకి వచ్చాడని. సింగర్ బాద్షా ట్వీట్ చేశాడు. Sahdev is better now and has regained consciousness. Will go to Raipur to see a good neurosurgeon. Thank you for your prayers 🙏🙏 — BADSHAH (@Its_Badshah) December 29, 2021 BIHAR: Boy from 'Bachpan ka Pyaar' viral video Sahdev Dirdo meets with accident,#bachpankapyar #SahdevDirdo pic.twitter.com/jiP6fZwF1u — Syed Kamran Ali (@Sayedkamran_jk) December 28, 2021 -
సెలవుల విషయంలో గొడవ.. జవాన్ల పరస్పర కాల్పులు..నలుగురు మృతి
సుక్మా(ఛత్తీస్‌ఘడ్): ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ జవాను తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు. ఈ సంఘటన సుకుమాజిల్లా లింగపల్లి బేస్ క్యాంప్‌లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. బేస్ క్యాంప్‌లో విధులు నిర్వహిస్తున్న జవాన్ల మధ్య దీపావళి సెలవుల విషయంలో జవాన్ల మధ్య వివాదం రాజుకుంది. ఈ క్రమంలో ఆగ్రహించిన ఓ జవాను.. తోటి జవాన్లపై కాల్పులకు తెగ బడ్డాడు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హెలికాప్టర్లో రాయ్‌పూర్‌కు తరలించారు. మృతులలో.. బిహర్‌కు చెందిన రాజమణియాదవ్, డంజి, బెంగాల్ కు చెందిన రాజుమండల్‌గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పేదరైతు కొడుకు పాట.. నసీబ్‌ను మార్చేసింది
Viral Kid Sahdev Dirdo: సోషల్ మీడియా ఎప్పుడు.. ఎవరిని.. ఎలా ఫేమస్ చేస్తుందో ఊహించడం కష్టం. అయితే సానుకూల ధోరణి, లేదంటే వ్యతిరేక విమర్శలతోనైనా సరే పాపులర్ అయిపోతుంటారు. ఇక దక్కిన పాపులారిటీని నిలబెట్టుకోలేక కనుమరుగు అయ్యేవాళ్లే ఎక్కువగా ఉంటారు. ఇదిలా ఉంటే ‘ జానే మేరీ జానేమన్.. బస్‌పన్ క్యా ప్యార్ మేరా..’ అంటూ ఓ సాంగ్ రీమిక్స్ వెర్షన్ నార్త్ ఇండియాను తెగ ఊపేస్తోంది. కారణం ఈ పాటను యూనిఫాల్లో ఉన్న సహదేవ్ అనే పిలగాడు అమాయకంగా పాడడమే. రాయ్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా చింద్‌ఘడ్‌కు చెందిన సహదేవ్ డిర్దో(14).. ఈ కుర్రాడు నార్త్ ఇండియాలో ఇప్పుడు ఇంటర్నెట్ స్టార్. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ పిల్లాడి వీడియో మొత్తం దేశానికి చేరింది. ఆపై రీమిక్స్తోడై సోషల్ మీడియా ఊగిపోతోంది. టీవీ షోల దగ్గరి నుంచి ఫిల్మ్సెలబబ్రిటీల దాకా ఈ చిన్నారి గాత్రాన్ని ఎక్కించేసుకున్నారు. బుల్లితెర రియాలిటీ షోలు అయితే ప్రతీరోజూ ఈ పాటను వాడేసుకుంటున్నాయి. చివరికి ఆ చిన్నారి టాలెంట్-దక్కిన ఫేమ్కి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ సైతం ఫిదా అయ్యారు. సహదేవ్‌ను పిలిపించుకుని ఘనంగా సన్మానించారు కూడా. ఇంతకీ రెండేళ్ల క్రితం ఆ పిలగాడు పాడిన పాట ఎలా వైరల్ అయ్యిందంటే.. बचपन का प्यार....वाह! pic.twitter.com/tWUuWFP71f — Bhupesh Baghel (@bhupeshbaghel) July 27, 2021 కమలేష్ బారోత్ అనే ప్రైవేట్ ఆల్బమ్స్ సింగర్ కమ్ ఆర్టిస్ట్ కంపోజ్ చేసిన ‘బచ్పన్ కా ప్యార్’ సాంగ్ 2019లో యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యింది. నార్త్‌లో రూరల్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది ఈ పాట. ఆ టైంలో స్కూల్లో తన టీచర్ కోసం ‘బచ్(స్)పన్ క్యా ప్యార్’ అంటూ పాడేశాడు ఏడో తరగతి చదివే సహదేవ్. ఆ పాట ఆ టీచర్‌ను ఆకట్టుకోవడంతో ఫోన్లో రికార్డు చేశాడు. ఇంటర్నెట్లో అప్లోడ్ చేసినప్పటికీ.. అది వైరల్ అవ్వడానికి రెండేళ్లు పట్టింది. అటు ఇటు తిరిగి ఈ పాట ర్యాపర్ బాద్షా చేతికి చేరింది. ఇంకేం అతగాడు దాన్నీ రీమిక్స్ చేసి ఇన్స్టాగ్రామ్ వదిలాడు. దీంతో ఆ వాయిస్ ఎవరిదా? అనే ఆరాలు ఎక్కువయ్యాయి. చివరికి మీడియా హౌజ్‌ల చొరవతో ఎట్టకేలకు చిన్నారి సహదేవ్ వెలుగులోకి వచ్చాడు. View this post on Instagram A post shared by BADSHAH (@badboyshah) ఫ్రెండ్సే చూపించారు సహదేవ్ తండ్రి పేద రైతు. ఉన్న కొద్ది భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. తల్లి కూలీ పనులకు వెళ్తుంటుంది. ఇక మనోడు గవర్నమెంట్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇంతకీ ఈ పాట ఎలా బట్టీపట్టావ్ అని అడిగితే.. తన ఇంట్లో టీవీ లేదని, రోడ్డు మీద టీవీల్లో చూసి బట్టీపట్టానని అమాయకంగా చెప్తున్నాడు సహదేవ్. ఇక ఇప్పుడు ఇంటర్నెట్లో తన పాట వైరల్ అయ్యింది కూడా తన స్నేహితుడి తండ్రి మొబైల్లోనే చూశాడట. ఊరంతా తనని ‘సూపర్‌స్టార్’ అని పిలుస్తున్నారని మురిసిపోతున్నాడు సహదేవ్. ఈ చిన్నారి కుటుంబ ఆర్థికస్థితి తెలిసి చాలామంది దాతలు సాయానికి ముందుకు వస్తున్నారు. మరోవైపు ఈ సాంగ్ రీమిక్స్ కారకుడైన ర్యాపర్ బాద్షా.. ఈ కుర్రాడికి తనతో కలిసి ఆల్బమ్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. View this post on Instagram A post shared by vishnu_singh91 (@only_mod031zzz) -
ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి
దంతేవాడ : ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, సుకుమా జిల్లాల సరిహద్దుల్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. అరణ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టుతోపాటూ, మరోకరు మృతిచెందారు. ఘటనా స్థలంలో ఒక ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్‌తోపాటూ, 12 బోర్ గన్లు, విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి
సాక్షి, దంతెవాడ: ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడలోని ఆర్నాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో డీఆర్జీ, ఎస్టీఎఫ్ బృందాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. కూంబింగ్ సమయంలో మావోయిస్టులు ఎదురుపడి కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. మృతుల్లో ఓ మహిళ మావోయిస్టు కూడా ఉండగా, ఘటనా స్థలం నుంచి విప్లవ సాహిత్యంతో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. -
దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్లు
-
‘మహా’ ఎన్కౌంటర్.. రక్తపుటేరుగా ఇంద్రావతి
గడ్చిరోలి ; మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృత దేహాలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. గడ్చిరోలి వద్ద ఇంద్రావతి నదిలో మరో రెండు మృతదేహాలను పోలీసు బలగాలు వెలికి తీశాయి. దీంతో వరుస ఎన్కౌంటర్లలో మృతుల సంఖ్య 42కి చేరింది. ఇంతకు ముందు నది నుంచి 15 మృతదేహాలను వెలికి తీయటం తెలిసిందే. తప్పించుకునే మార్గం లేకే?... నది తీర ప్రాంతంలో మావోయిస్టులు గుడారాలు వేసుకున్న ఆనవాలు, ఘటనాస్థంలో కొన్ని వస్తువులు దర్శనమిచ్చాయి. ఎన్కౌంటర్ నేపథ్యంలో తప్పించుకునే మార్గం లేక మావోయిస్టులంతా నదిలోకి దూకేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మొసళ్లు, చేపలు పీక్కుతినటంతో మృతదేహాల గుర్తింపు కష్టతరంగా మారింది. మరోవైపు మృతుల్లో నలుగురు దళ కమాండర్లు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లో ఆహెరి, పెరిమిళ దళాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లేనని పోలీసులు ప్రకటించారు. మృతుల్లో పౌరులు లేరు... ఇక మృతుల్లో సాధారణ పౌరులు ఉన్నట్లు వస్తున్న వార్తలను తడ్‌గావ్ ఏఎస్సై సమీర్ దబాడే తోసిపుచ్చారు. ‘ఒకవేళ పౌరులు చనిపోయి ఉంటే వారి తరపు బంధువులుగానీ, ప్రజాసంఘాలుగానీ, నేతలుగానీ ఫిర్యాదు చేసి ఉండేవారు. కానీ, అలా జరగలేదు. చనిపోయివారంతా మావోయిస్టులే’ అని సమీర్ మీడియాకు వెల్లడించారు. ఇంద్రావతి నది పరిసరాల్లో కూంబింగ్ కొనసాగుతోందని.. మరిన్ని మృతదేహాలు బయటపడే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. మృతదేహాలను హెలికాఫ్టర్‌లో తరలిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలు ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో శనివారం నక్సల్స్ జరిపిన దాడిలో సీఆర్పీఎఫ్ ఏఎస్సై ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆ వెంటనే నక్సల్స్ కోసం భారీ కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభమైంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు సంయుక్తంగా కిలోమీటర్ల మేర అడవిని జల్లెడపట్టాయి. గడ్చిరోలి జిల్లా ఏటపల్లి వద్ద శనివారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో 16 మంది మావోయిస్టులు చనిపోయారు. ఆదివారం రాత్రి సుక్మా జిల్లాలో 5 గురు.. రాజారాం ఖాండ్లా అడవి(గడ్చిరోలి)లోని జిమాల్‌గట్ట ప్రాంతంలో 4గురు మృతి చెందగా.. మంగళవారం ఉదయం గడ్చిరోలి జిల్లా ఇంద్రావతి నదీ తీరంలో 15 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. -
మావోయిస్టుల వికృతచర్య ; భారీ విధ్వంసం
రాయ్‌పూర్ : అటవీ ప్రాంతంలో రోడ్డు పనులు చేయిస్తున్న సూపర్వైజర్ను మావోయిస్టులు అతికిరాతకంగా చంపేశారు. హత్య అనంతరం జేసీబీ, ట్రాక్టర్లు సహా 12 వాహనాలను తగులబెట్టారు. తిరుగుప్రయాణంలో అడ్డొచ్చిన పోలీసు బృందంపై నక్సల్స్ కాల్పులు జరపగా.. ఇద్దరు సాధారణ పౌరులు, ఇద్దరు కానిస్టేబుళ్లు మరణించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. బుల్లెట్ దెబ్బలుతిన్న మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. చింతకుప్ప రోడ్డుపై : సుకుమా జిల్లా చింతకుప్ప ప్రాంతంలో రహదారి నిర్మించవద్దంటూ మావోయిస్టులు గతంలో హెచ్చరికలు జారీచేశారు. ఆదివారం పనులు జరుగుతున్న ప్రాంతానికి వచ్చిన మావోయిస్టు బృందం.. కాంట్రాక్టర్ సూపర్వైజర్ను చితకబాది చంపేసి, వాహనాలను తగులబెట్టి తిరుగుప్రయాణమైంది. అంతలోనే వారికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం ఎదుదైంది. ఇరువైపుల నుంచి కాల్పులు జరిగాయి. గంటలపాటు కొనసాగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సాధారణ పౌరులతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక మావోయిస్టు మరణించారని పోలీసులు తెలిపారు. గాయపడ్డ కానిస్టేబుళ్లలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్కౌంటర్ సమాచారం అందిన వెంటనే అదనపు బలగాలను ఘటనా స్థలికి పంపినట్లు చెప్పారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్: ఇద్దరు మావోల మృతి
రాయిపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. జిల్లాలోని సన్‌తోంగ్ అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రీ, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు -
ఎర్రమందారం
-
కోబ్రా కమాండోలు నక్సల్స్‌ను కాటేస్తారా?
న్యూఢిల్లీ: చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోల వేటకు కొత్తగా రెండు వేల మంది కోబ్రా కమాండోలను సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) రంగంలోకి దించనుంది. గత నెలలో భద్రతా బలగాలపై మావోల దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకే సీఆర్పీఎఫ్ కొత్తగా బలగాలను రంగంలోకి దించతున్నట్లు తెలుస్తోంది. పక్కా వ్యూహంతో కొత్తగా 20 నుంచి 25 కంపెనీల కోబ్రా కమాండోలను సుక్మా జిల్లాకు పంపుతున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. తెలంగాణ, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి బస్తర్‌కు తరలిస్తున్నట్లు వివరించారు. కోబ్రా దళాల్లోని జవానులకు ప్రత్యేకంగా అటవీ యుద్ధ నైపుణ్యాలలో శిక్షణనిస్తారు. వీరు పాల్గొన్న దాడుల్లో ప్రత్యర్థులకు కోలుకోలేని దెబ్బలు తగులుతుంటాయి. -
కూలిన ప్రైవేటు హెలికాప్టర్
-
ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలీకాప్టర్
-
‘పిరికిపందల చర్య.. వాళ్ల ఆట కట్టిస్తాం’
-
‘పిరికిపందల చర్య.. వాళ్ల ఆట కట్టిస్తాం’
రాయ్‌పూర్: కేంద్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేసి మావోయిస్టుల పనిపడతామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. నిరాశ, నిస్పృహతోనే మావోయిస్టులు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్లకు ఆయన నివాళి అర్పించారు. మావోయిస్టుల దాడి పిరికిపందల చర్యగా ఆయన వర్ణించారు. ‘ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్. మన అమర జవాన్ల బలిదానం వృధా కాదు. మావోయిస్టుల దాడులతో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు తీవ్ర విఘాతం కలుగుతోంద’ని రాజ్‌నాథ్ అన్నారు. మావోయిస్టుల సమస్యపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల అధికారులతో మే 8న సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎల్ డబ్ల్యూఈ వ్యూహాన్ని సవరించుకోవాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా అమర జవాన్లకు నివాళి అర్పించారు. దక్షిణ బస్తర్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. -
గ్రామస్తుడి కిడ్నాప్..హత్య
రాయ్‌పూర్(ఛత్తీస్‌గఢ్): ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఇటీవల మావోయిస్టుల చేతిలో కిడ్నాప్‌కు గురైన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం చింతల్నార్ పోలీస్‌స్టేషన్ పరిధి కొనన్గూడకు చెందిన బర్సే దేవను ఈనెల 8వ తేదీన మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. లఖన్‌పాల్ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో తీవ్ర గాయాలతో పడి ఉన్న బర్సే దేవా(32) మృతదేహాన్ని శుక్రవారం ఉదయం స్థానికులు కనుగొన్నారు. మావోయిస్టులుగా ఉన్న దేవ కుటుంబసభ్యులు కొందరు ఇటీవల జనజీవన స్రవంతిలో కలిశారు. దీనిని జీర్ణించుకోలేకనే మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దేవా హత్య నేపథ్యంలో ఈ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. -
ఎదురుకాల్పుల్లో మహిళా నక్సల్ మృతి
రాయిపూర్(ఛత్తీస్‌గఢ్): తెలంగాణ సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు చనిపోయింది. సుక్మా జిల్లాలో సోమవారం జరిగిన ఈ ఘటనపై ఎస్పీ ఇందిరా కల్యాణ్ తెలిపిన వివరాలివీ..కోబ్రా, సీఆర్పీఎఫ్, పోలీసు బలగాలు సోమవారం మధ్యాహ్నం చింతగుఫ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దూలేర్ గ్రామ సమీప అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా వారిపైకి మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. కాల్పులు ఆగిన తర్వాత ఆప్రాంతంలో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టగా ఒక మహిళా మావోయిస్టు మృతదేహం కనిపించింది. పక్కనే పడి ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఈ అధికారి ఏంచేశాడో చూడండి..
రాయపూర్: నీళ్లు లేక ఒకపక్క జనం అల్లాడుతుంటే మరొపక్క ప్రజలసొమ్ముతో గవర్నమెంట్ బంగ్లాలో స్విమ్మింగ్ పూల్ కట్టించుకుని జలకాలాటలు ఆడుతున్నాడో ప్రభుత్వాధికారి. ఈ విషయం పాలకుల దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లా ఫారెస్ట్ అధికారిగా పనిచేస్తున్న రాజేశ్ ఛాందెలె ఈ ఘనకార్యం చేశాడు. నీటి కరువుతో ఒక్కపక్క అల్లాడుతుంటే ప్రభుత్వం తనకు కేటాయించిన బంగ్లాలో ఈత కొలను కట్టించుకున్నాడు. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రూ.10 లక్షలతో దీన్ని నిర్మించాడని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై అటవీశాఖ మంత్రి మహేశ్ గడ్కా స్పందించారు. స్విమ్మింగ్ పూల్ కు బదులు నీళ్లు లేక అగచాట్లు పడుతున్న ప్రజలకు చెరువు తవ్వించివుంటే బాగుండేదని అన్నారు. ఈ వ్యవహారంపై సీఎం రమణ్ సింగ్ విచారణకు ఆదేశించారు. రాజేశ్ పై గతంలోనూ వివాదాలున్నాయి. అక్రమ సంపాదన కలిగివున్నందుకు 2014లో అతడి నివాసంపై ఏసీబీ దాడులు జరిగాయి. -
11 మంది అంగన్ వాడీలు అదృశ్యం
ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, 11 మంది అంగన్వాడి కార్యకర్తలు అదృశ్యమైన సంఘటన ఛత్తిస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా గదిరాస్ ప్రాంతంలో శనివారం వెలుగుచూసింది. గదిరాస్ పరిసర ప్రాంతాలకు చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, 11 మంది అంగన్వాడి కార్యకర్తలు కనిపించకుండా పోవడంతో.. ఇది మావోయిస్టుల పనే అయి ఉంటుందని స్థానికులు అంటున్నారు. -
పోలీసును చితకబాదిన నక్సల్స్
ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లో ఓ ఏఎస్ఐని మావోయిస్టులు చితకబాదిన ఘటన సోమవారం జరిగింది. సుక్మా జిల్లా పోలంపల్లి స్టేషన్ ఏఎస్ఐ దేవాంగి, మరో కానిస్టేబుల్‌తో కలిసి సోమవారం మధ్యాహ్నం బైక్‌పై గోరుగూడ వైపు వెళ్తుండగా.. వారిని మావోయిస్టులు అటకాయించారు. నక్సల్స్‌ను చూడగానే వాహనం వెనుక కూర్చున్న కానిస్టేబుల్ పారిపోగా, ఏఎస్ఐ మాత్రం దొరికిపోయాడు. అతణ్ణి మావోయిస్టులు కర్రలతో విపరీతంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక కిందపడిపోయిన దేవాంగిని అక్కడే విడిచిపెట్టి మావోయిస్టులు వెళ్లిపోయారు. తర్వాత ఆ మార్గంలో ప్రయాణించిన కొందరు వ్యక్తులు పోలంపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రత్యేక బలగాలు అక్కడికి చేరుకొని బాధితుణ్ణి దోర్నపాల్ ఆసుపత్రికి తరలించారు. ఏఎస్ఐ దేవాంగికి ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారని పోలీసులు చెప్పారు. కాగా మావోయిస్టులు చేతికి చిక్కిన పోలీసును చంపేయకుండా కొట్టి వదిలేయడం ఇదే ప్రథమం. ఏఎస్ఐని కొట్టి విడిచిపెట్టడం ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. -
మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకుంటాం: షిండే
భద్రతాదళాలపై దాడిచేసి వారి ప్రాణాలను బలిగొన్న మావోయిస్టులను ఊరికే వదిలేది లేదని.. ఇంతకింత ప్రతీకారం తప్పనిసరిగా తీర్చుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే హెచ్చరించారు. మావోయిస్టుల దాడిలో మరణించిన జవాన్ల మృతదేహాలకు షిండే నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియను నిలిపివేసేందుకు మావోయిస్టులు ప్రయత్నించి, విఫలమయ్యారని, తమ ప్రాధాన్యం తగ్గిపోతోందని భయపడే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారని అన్నారు. మంగళవారం నాడు బలగాలు ఎన్నికలు సజావుగా సాగేందుకు మార్గం తనిఖీ చేయడానికే వెళ్లాయన్నారు. ఇలాంటి దాడులతో ఎన్నికలను వాయిదా వేసేది లేదని, లోక్‌సభ ఎన్నికలు షెడ్యూలు ప్రకారమే యథాతథంగా జరుగుతాయని అన్నారు. మావోయిస్టులను అణిచేసేందుకు రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలు కలిసి సంయుక్త ఆపరేషన్ చేస్తయాని షిండే వెల్లడించారు. ఇక మంగళవారం నాటి కేసును దర్యాప్తు నిమిత్తం ఎన్ఐఏకు అప్పగిస్తామన్నారు. భద్రతాపరమైన లోపాలు ఏమైనా ఉన్నాయేమో సమగ్ర విచారణ జరిపిస్తామని తెలిపారు. ఇక మరో కేంద్ర మంత్రి కపిల్ సిబల్ కూడా మావోయిస్టుల దాడిని ఖండించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దీనిపై పోరాడాలని అన్నారు.