
సుక్మా(ఛత్తీస్‌ఘడ్): ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ జవాను తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు. ఈ సంఘటన సుకుమాజిల్లా లింగపల్లి బేస్ క్యాంప్‌లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. బేస్ క్యాంప్‌లో విధులు నిర్వహిస్తున్న జవాన్ల మధ్య దీపావళి సెలవుల విషయంలో జవాన్ల మధ్య వివాదం రాజుకుంది.
ఈ క్రమంలో ఆగ్రహించిన ఓ జవాను.. తోటి జవాన్లపై కాల్పులకు తెగ బడ్డాడు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హెలికాప్టర్‌లో రాయ్‌పూర్‌కు తరలించారు. మృతులలో.. బిహర్‌కు చెందిన రాజమణియాదవ్, డంజి, బెంగాల్ కు చెందిన రాజుమండల్‌గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment