
కోబ్రా కమాండోలు నక్సల్స్‌ను కాటేస్తారా?
న్యూఢిల్లీ: చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోల వేటకు కొత్తగా రెండు వేల మంది కోబ్రా కమాండోలను సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) రంగంలోకి దించనుంది. గత నెలలో భద్రతా బలగాలపై మావోల దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకే సీఆర్‌పీఎఫ్ కొత్తగా బలగాలను రంగంలోకి దించతున్నట్లు తెలుస్తోంది.
పక్కా వ్యూహంతో కొత్తగా 20 నుంచి 25 కంపెనీల కోబ్రా కమాండోలను సుక్మా జిల్లాకు పంపుతున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. తెలంగాణ, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి బస్తర్‌కు తరలిస్తున్నట్లు వివరించారు. కోబ్రా దళాల్లోని జవానులకు ప్రత్యేకంగా అటవీ యుద్ధ నైపుణ్యాలలో శిక్షణనిస్తారు. వీరు పాల్గొన్న దాడుల్లో ప్రత్యర్థులకు కోలుకోలేని దెబ్బలు తగులుతుంటాయి.