cobra commandos
-
స్త్రీ శక్తి.. మరో అడుగు
సెంట్రల్ రిజర్వ్ పోలిస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) స్త్రీసాధికారత, శక్తియుక్తులకు సంబంధించి మూడు చారిత్రక అద్భుతాలకు వేదిక అయింది. కొన్ని నెలలు వెనక్కి వెళితే... నక్సల్స్‌ను ఎదుర్కోవడం కోసం ఏర్పాటు చేసిన ‘కోబ్రా కమాండో’లో మహిళల ప్రాతినిధ్యం లేదు. అయితే 34 మంది మహిళలతో ‘కోబ్రా’ దళాన్ని ఏర్పాటు చేసి మహిళలు లేని లోటును పూరించారు. ‘కోబ్రా’కు ఎంపికైన వారియర్స్ మూడు నెలల పాటు అడవుల్లో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. గుర్‌గ్రామ్ కదార్‌పుర్‌లో కోబ్రా వుమెన్ వారియర్స్ ప్రదర్శించిన యుద్ధవిన్యాసాలు అబ్బురపరిచాయి. వారి మాటల్లోని ఆత్మవిశ్వాసం ఆకట్టుకుంది. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి అభినందనలు తెలియజేస్తూ ‘హిస్టరీ ఇన్ మేకింగ్’ అని ట్విట్ చేసింది సీఆర్పీఎఫ్. 2012లో వరల్డ్స్ ఫస్ట్ ‘ఆల్– ఉమెన్ పారామిలటరీ పైప్‌బ్యాండ్’ను ఏర్పాటు చేసింది సీఆర్పీఎఫ్. ఇక తాజా విషయానికి వస్తే... సీఆర్పీఎఫ్ జడ్–ప్లస్ కేటగిరి కోసం విధులు నిర్వహించడానికి ఎంపికైన 32 మంది ఉమెన్ వారియర్స్ వివిధ విభాగాల్లో పదివారాల పాటు శిక్షణ పొందారు. ఈ నెలలోనే కొత్త బాధ్యతల్లోకి వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్... మొదలైన వారికి రక్షణగా నిలవనున్నారు. రాబోయే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో వీఐపీ రాజకీయ నాయకుల రక్షణ బాధ్యతల్లో పాలుపంచుకోనున్నారు. గతంలో జడ్–ప్లస్ కమాండో విభాగంలో పురుషులు మాత్రమే ఉండేవారు. తాజా అడుగుతో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది సీఆర్పీఎఫ్. -
రాకేశ్వర్ సింగ్ విడుదల.. 100కి.మీకు పైగా బైకుపై
సాక్షి, హైదరాబాద్/భద్రాద్రి–కొత్తగూడెం: మావోయిస్టుల వద్ద బందీగా ఉన్న సీఆర్పీఎఫ్ జవాను రాకేశ్వర్ సింగ్ విడుదల అంత ఆషామాషీగా జరగలేదు. అతన్ని విడిపించేందుకు మధ్యవర్తులు, విలేకరులు దండకారణ్యంలోకి 100 కిలోమీటర్లకుపైగా బైకుపై ప్రయాణించాల్సి వచ్చింది. ఆద్యంతం సినీఫక్కీలో జరిగిన ఈ ప్రత్యేక చర్చల ప్రక్రియ ఎట్టకేలకు సఫలం కావడంతో ఆరురోజుల తర్వాత రాకేశ్వర్ సింగ్ చెరవీడాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మావోలకు కేంద్రం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మంగళవారం నాటికే సానుకూల సంకేతాలు పంపింది. కానీ అదే సమయంలో రాకేశ్వర్ క్షేమంపై ఆందోళన కూడా వ్యక్తం చేసింది. అయితే కేంద్రం హామీలపై సంతృప్తి చెందిన నేపథ్యంలోనే మావోలు బుధవారం రాకేశ్వర్ సింగ్ ఫొటోను మీడియాకు విడుదల చేశారు. ఇదే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సందేశం మావోయిస్టులకు తెలియజేయడానికి నమ్మకస్తులు, తటస్థులైన ధర్మపాల్ షైనీ, తెల్లం బోరయ్యలను ఎంపిక చేసుకున్నాయి. జర్నలిస్టులకు ముందే సమాచారం: జర్నలిస్టులు తెలిపిన వివరాల ప్రకారం.. మావోయిస్టులు బుధవారమే మధ్యవర్తులతో పాటు ఏడుగురు విలేకరులకు అర్ధరాత్రి దాటాక ఫోన్ చేస్తామని చెప్పి ఉంచారు. అదే ప్రకారం గురువారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఇద్దరు మధ్యవర్తులను తీసుకుని బీజాపూర్ నుంచి బైకులపై బయ ల్దేరాలని జర్నలిస్టులకు సూచించారు. దీంతో మొత్తం 9 మంది అటవీమార్గాన దాదాపు 90 కిలోమీటర్లు ప్రయాణించి ఎన్కౌంటర్ జరిగిన జొన్నగూడ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ.. వారి వెంట ఎవరూ ఫాలో కాలేదని మావోలు నిర్ధారించుకున్నారు. అక్కడి నుంచి లోపలికి మరో 15 కిలోమీటర్లు ఫోన్లో సూచనలు ఇస్తూ పిలిపించుకున్నారు. మొత్తానికి ఉదయం 9.30 గంటలకు దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు రాకేశ్వర్‌ను బంధించిన చోటుకు వీరంతా చేరుకున్నారు. అక్కడ వారికి కోడి, టమాట కూరలు, చపాతీలతో భోజనం పెట్టారు. మధ్యవర్తులతో మావోయిస్టులు ఏకాంతంగా గంటసేపు మాట్లాడారు. జొన్నగూడకు 40 మంది మావోయిస్టులు మధ్యాహ్నం 12 దాటగానే మధ్యవర్తులు, జర్నలిస్టులు జొన్నగూడ వైపు బయల్దేరారు. రాకేశ్వర్ సింగ్‌తో పాటు 40 మంది మావోయిస్టులు వారిని అనుసరిస్తూ వచ్చారు. తెర్రం పోలీస్‌స్టేషన్ పరిధిలోని జొన్నగూలో ఏర్పాటు చేసిన ప్రజాకోర్టులో అందరిముందు రాకేశ్వర్ తాళ్లు విప్పి బంధ విముక్తుణ్ణి చేసిన మావోయిస్టులు అతన్ని మధ్యవర్తులకు అప్పగించారు. మావోయిస్టులు తమను బాగా చూసుకున్నారని, ఎక్కడా బెదిరింపులకు పాల్పడటం కానీ, దురుసుగా ప్రవర్తించటం కానీ చేయలేదని చర్చల్లో పాల్గొన్న ముఖేశ్ చంద్రాకర్ ‘సాక్షి’కి వివరించారు. చదవండి: (రాకేశ్వర్‌సింగ్ విడుదల వెనుక అసలు గుట్టేమిటి..?) -
రాకేశ్వర్‌సింగ్ విడుదల వెనుక అసలు గుట్టేమిటి..?
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఏప్రిల్ 3వ తేదీన మావోయిస్టులు సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి చేసి కిడ్నాప్ చేసిన జవాను రాకేశ్వర్‌సింగ్‌ను మావోయిస్టులు ఎట్టకేలకు విడుదల చేశారు. రాకేశ్వర్‌సింగ్‌ను కిడ్నాప్‌చేసి 6 రోజుల పాటు తమ చెరలో ఉంచుకున్న మావోయిస్టులు మొదటి నుంచి అతనిపై సానుకూల ధోరణితోనే వ్యవహరించారు. అతని ప్రాణానికి ఎలాంటి హామీ తలపెట్టబోమని, ప్రభుత్వం వెంటనే చర్చల ప్రక్రియ ప్రారంభించాలని, మధ్యవర్తిత్వం వహించే వారి పేర్లు ప్రకటిస్తే రాకేశ్వర్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం ఒక పాకలో ఏ విధమైన ఆందోళన లేకుండా కూర్చుని ఉన్న రాకేశ్వర్‌సింగ్ చిత్రాన్ని సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. మధ్యవర్తుల పేర్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇంతలోనే అనూహ్యంగా గురువారం మధ్యాహ్నమే రాకేశ్వర్‌సింగ్‌ను మావోలు విడుదల చేసినట్టుగా బస్తర్ ఐజీ ప్రకటించడం అం దరినీ విస్మయానికి గురిచేసింది. రాకేశ్వర్ సింగ్ కుటుంబ సభ్యులను ఆనందంలో ముంచెత్తింది. ఎలా విడుదల చేశారు? రాకేశ్వర్‌ను బందీగా పట్టుకుని చర్చలకు రావాలని ప్రభుత్వానికి డిమాండ్లు విధించిన మావోయిస్టులు అకస్మాత్తుగా అతన్ని విడుదల చేయడం వెనుక ఏం జరిగి ఉంటుందన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది. ఛత్తీస్‌గఢ్ పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం ఏం చేశాయన్నది ఆసక్తికరంగా మారింది. మావోయిస్టులు ప్రభుత్వాధికారులను అపహరించడం, తమ డిమాండ్లు, నెరవేర్చుకోవడం, తమవారిని విడిపించుకోవడం కొత్త విషయమేమీ కాదు.. దశాబ్దాలుగా జరుగుతున్నదే. ఇప్పుడు కూడా పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసిన 150 మంది అమాయక గిరిజనులను విడుదల చేయాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. అదే విధంగా మావోల ఏరివేత కోసం కేంద్రం చేపట్టిన ‘‘ఆపరేషన్ ప్రహార్’’ను నిలిపివేయాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుతం మావోయిస్టులు పైకి చెబుతున్నట్టుగానే ఎలాంటి డిమాండ్లు, షరతులు లేకుండానే జవానును వదిలేశారా? లేక తెరవెనుక ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి ఏమైనా హామీలు లభించాయా? లావాదేవీలు నడిచాయా? అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. రాకేశ్వర్ విడుదలతో కుటుంబ సభ్యుల ఆనందోత్సాహం.. కూంబింగ్ నిలిపివేతకు ఇటాలియన్ల కిడ్నాప్ 2012 మార్చి14న కోరాపూట్‌లో ఎమ్మెల్యే జినా హికాకాతో పాటు ఇద్దరు ఇటాలియన్ టూరిస్టులు క్లాంజియో కొలాంటిడియో, బసుస్కో పౌలోను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. దీంతో సీఎం నవీన్ పట్నాయక్ ప్రభుత్వం వెంటనే వారితో చర్చలు జరిపింది. మావోయిస్టుల కోసం ఒరిస్సా అడవుల్లో జరుగుతున్న కూంబింగ్‌ను వెంటనే ఆపేయాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించడంతో మావోలు ఎమ్మెల్యేతో పాటు ఇద్దరు ఇటాలియన్లకు ఎలాంటి హానీ తలపెట్టకుండా విడుదల చేశారు. అయితే దాని వెనుకా వేరే కారణం ఉందన్న ప్రచారం జరిగింది. ఒకేసారి ఏడుగురు ఐఏఎస్ అధికారులను..! 1987లో తూర్పుగోదావరి జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరైన ఏడుగురు ఐఏఎస్ అధికారులను మావోలు కిడ్నాప్ చేయడం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఐఏఎస్‌లను బందీలుగా చేసుకుని మావోలు అప్పట్లో వారి డిమాండ్లు నెరవేర్చుకున్నారు. అనంతరం వారిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే రాకేశ్వర్ సింగ్ విడుదల వెనుక ఏం జరిగిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రహార్ నిలిపివేతకు, గిరిజనులకు హామీ లభించిందా? ఇతరత్రా అంశాలేమైనా ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా రాకేశ్వర్ సింగ్ సురక్షితంగా విడుదల కావడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆర్కే కోసం కలెక్టర్ కిడ్నాప్ 2011 ఫిబ్రవరి 17. మల్కన్‌గిరి జిల్లా బడ పాడ గ్రామం. ఇది ఏపీ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జిల్లా కలెక్టర్ వినీల్ కృష్ణ, జేఈ పబిత్రా మోహన్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. దారికాచిన మావోలు వారిని కిడ్నాప్ చేసి చిత్రకొండ అడవుల్లో బంధించారు. ఏపీ నుంచి పలువురు పౌరహక్కుల నేతలు మధ్యవర్తిత్వం వహించి వారిని విడుదల చేయించారు. దీనికి ప్రతిగా ఒరిస్సా ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత నిలిపివేసి, అరెస్టు చేసిన ఆదివాసీలను విడుదల చేసింది. ఇదంతా బయటికి కనిపించింది. కానీ అసలు విషయం ఏంటంటే.. మావో అగ్రనేత ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్‌ను ఓ రహస్య ప్రాంతంలో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. అతన్ని అరెస్టు లేదా ఎన్కౌంటర్ చేస్తారన్న విషయం తెలుసుకున్న మావోయిస్టులు వెంటనే మల్కన్‌గిరి కలెక్టర్‌ను కిడ్నాప్ చేశారు. ఆర్కేను అరెస్టు చేయకుండా భద్రతా బలగాలు వెనక్కి వచ్చేయాలని షరతు విధించారు. విధిలేని పరిస్థితుల్లో భద్రతాదళాలు ఆర్కేను విడిచిపెట్టగా, మావోలు కలెక్టర్, జేఈలను విడుదల చేశారు. బయటి ప్రపంచానికి మాత్రం అదంతా గిరిజనుల విడుదల కోసం జరిగిన కిడ్నాప్‌గా ప్రచారం జరిగింది. చదవండి: (వీడిన ఉత్కంఠ: మావోయిస్టుల నుంచి రాకేశ్వర్ విడుదల) -
మావోయిస్టుల నుంచి రాకేశ్వర్ విడుదల
-
వీడిన ఉత్కంఠ: మావోయిస్టుల నుంచి రాకేశ్వర్ విడుదల
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ దండకారణ్యంలో తమ వద్ద బందీగా ఉన్న సీఆర్పీఎఫ్ (కోబ్రా) జవాను రాకేశ్వర్ సింగ్ మన్హాన్‌ను మావోయిస్టులు గురువారం విడుదల చేశారు. ఈ మేరకు బస్తర్ ఐజీ సుందర్రాజ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు ఈ నెల 3న బీజాపూర్ జిల్లాలోని తెర్రెం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎదురుకాల్పులు జరిగిన సమయంలో 22 మంది జవాన్లను మావోయిస్టులు హతమార్చారు. ఇదే క్రమంలో కోబ్రా 210 బెటాలియన్‌కు చెందిన రాకేశ్వర్ సింగ్‌ను తమ బందీగా పట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా జవాన్‌ను విడుదల చేసేందుకు ప్రభుత్వం మధ్యవర్తులను పంపించాలని మావోయిస్టు పార్టీ కోరిన నేపథ్యంలో.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆ రాష్ట్రానికి చెందిన పద్మశ్రీ ధర్మపాల్ షైనీ, గోండ్వానా సమాజ్ అధ్యక్షుడు తెల్లం బోరయ్యలను మధ్యవర్తులుగా పంపించింది. వీరితోపాటు బస్తర్‌కు చెందిన గణేష్ మిశ్రా, రంజన్‌దాస్, ముఖేష్ చంద్రాకర్, యుగేష్ చంద్రాకర్, చేతన్ కుకేరియా, శంకర్, రవి అనే మరో ఏడుగురు జర్నలిస్టుల బృందం కూడా దండకారణ్యంలోకి వెళ్లింది. భారీ ప్రజా కోర్టు జొన్నగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భారీ స్థాయిలో ప్రజాకోర్టు ఏర్పాటు చేశారు. వారి సమక్షంలోనే రాకేశ్వర్ సింగ్‌ను తాళ్లు విప్పి విడుదల చేశారు. మధ్యవర్తులకు అతన్ని అప్పగించారు. వారు రాకేశ్వర్‌ను ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని నేరుగా బాసగూడ సీఆర్పీఎఫ్ క్యాంపునకు తీసుకెళ్లారు. అనంతరం అంబులెన్స్‌లో బీజాపూర్ ఆస్పత్రికి తరలించగా, అతనికి పరీక్షలు చేశారు. కాగా మావోయిస్టులకు, ప్రభుత్వానికి మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందనే వివరాలు మాత్రం బయటకు రాలేదు. కుటుంబసభ్యుల హర్షం జమ్మూకశ్మీర్‌కు చెందిన రాకేశ్వర్ సింగ్ విడుదల పట్ల అతని భార్య మీనూ, కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మీనూ మాట్లాడుతూ.. తన భర్త మావోల వద్ద బందీగా ఉన్న సమయంలో చాలా భయమేసిందన్నారు. వారు ఎలాంటి హానీ తలపెట్టకుండా విడుదల చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనకు ఎలాంటి హామీ ఇవ్వలేదని చెప్పారు. కేంద్ర హోం మంత్రి ఫోన్ మావోయిస్టుల చెర నుంచి విడుదలైన రాకేశ్వర్ సింగ్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడినట్లు ఆ శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. సింగ్ యోగక్షేమాలను అమిత్ షా అడిగి తెలుసుకున్నారని తెలిపాయి. చదవండి: రాకేశ్వర్‌ను విడిచిపెడతాం -
ఎర్రమందారం
-
కోబ్రా కమాండోలు నక్సల్స్‌ను కాటేస్తారా?
న్యూఢిల్లీ: చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోల వేటకు కొత్తగా రెండు వేల మంది కోబ్రా కమాండోలను సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) రంగంలోకి దించనుంది. గత నెలలో భద్రతా బలగాలపై మావోల దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకే సీఆర్పీఎఫ్ కొత్తగా బలగాలను రంగంలోకి దించతున్నట్లు తెలుస్తోంది. పక్కా వ్యూహంతో కొత్తగా 20 నుంచి 25 కంపెనీల కోబ్రా కమాండోలను సుక్మా జిల్లాకు పంపుతున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. తెలంగాణ, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి బస్తర్‌కు తరలిస్తున్నట్లు వివరించారు. కోబ్రా దళాల్లోని జవానులకు ప్రత్యేకంగా అటవీ యుద్ధ నైపుణ్యాలలో శిక్షణనిస్తారు. వీరు పాల్గొన్న దాడుల్లో ప్రత్యర్థులకు కోలుకోలేని దెబ్బలు తగులుతుంటాయి. -
కూలిన ప్రైవేటు హెలికాప్టర్
-
ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలీకాప్టర్
-
59మంది కోబ్రా కమాండోలు మిస్సింగ్
న్యూఢిల్లీ: నక్సల్ వ్యతిరేక, అటవీ యుద్ధ నైపుణ్యాల యూనిట్‌కు చెందిన 59 మంది కోబ్రా కమాండోలు ఆచూకీ లేకుండా పోయారు. ట్రైనింగ్ ముగించుకున్న తర్వాత బీహార్‌లో తమ తొలి అసైన్మెంట్ను అందుకున్న వీరు జమ్మూ కశ్మీర్ నుంచి రైలు మార్గం ద్వారా బయల్దేరారు. 2011లో విధుల్లోకి చేరిన 59మంది జవానులు ఈ మధ్యకాలంలోనే శిక్షణను పూర్తి చేసుకున్నారు. ముఘల్సరై స్టేషన్లో రైలు ఆగిన సమయంలో వారితో పాటు ప్రయాణిస్తున్న కమాండర్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జవానులు అందరూ వెళ్లిపోయారని అధికారులు చెబుతున్నారు. బీహార్‌లో జరుగుతున్న ప్రత్యేక నక్సల్ వ్యతిరేక పోరాటాల్లో వీరు కూడా చేరాల్సివుందని తెలిపారు. జవానుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందినవారేనని చెప్పారు. జవానుల పనితో షాక్ కు గురైన సీఆర్పీఎఫ్ ఘటనపై విచారణకు ఆదేశించింది. కమాండోలందరూ అనధికారికంగా సెలవు తీసుకుని స్వస్ధలాలకు వెళ్లినట్లు చెప్పింది. -
200 మంది మావోయిస్టులు చుట్టుముట్టి..
* 22 ఐఈడీ పేలుళ్లు, కాల్పులు * బిహార్ ఎన్కౌంటర్లో పది మంది కోబ్రా కమాండోల మృతి పట్నా: బిహార్‌లో మావోయిస్టులకు, భద్రతా సిబ్బందికీ మధ్య సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో సీఆర్పీఎఫ్ కోబ్రా బెటాలియన్‌కు చెందిన 10 మంది కమాండోలు మృత్యువాత పడ్డారు. సుమారు 200 మంది మావోయిస్టులు ఒక్కసారిగా కమాండోలను చుట్టుముట్టి 22 ఐఈడీలను పేల్చడమే కాక.. కాల్పులకు తెగబడ్డారు. 10 మంది కమాండోలు చనిపోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇంతమంది కమాండోలను సీఆర్పీఎఫ్ కోల్పోవడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. ఔరంగాబాద్ జిల్లాలోని దుమారీ నాలా అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారన్న సమాచారంతో సీఆర్పీఎఫ్కు చెందిన కోబ్రా కమాండోలు, ఇతర బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయని అధికారులు చెప్పారు. ముందుగా కమాండోలు కాల్పులు జరపడంతో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారన్నారు. ఇదే సమయంలో మావోయిస్టుల ట్రాప్‌లో కమాండోలు చిక్కుకుపోయారని, దీంతో 200 మంది మావోయిస్టులు వారిని చుట్టుముట్టి 22 ఐఈడీలను పేల్చడమే కాక.. వారిపై కాల్పులు జరిపారని చెప్పారు. ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని చెప్పారు. సీఆర్పీఎఫ్ డెరైక్టర్ జనరల్ కె.దుర్గాప్రసాద్, ఇన్స్పెక్టర్ జనరల్(ఆపరేషన్స్) జుల్ఫీకర్ హసన్, ఇతర అధికారులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.