సుక్మా: ‘జానే మేరీ జానేమన్.. బచ్‌పన్ క్యా ప్యార్ మేరా..’ ఈ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 14 ఏళ్ల సహదేవ్ క్లాస్‌రూంలో పాడిన ఈ పాట దేశ వ్యాప్తంగా మార్పోగింది. ఈ బుడ్డోడి గొంతుకు సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. చత్తీస్‌గఢ్ సీఎం సీఎం భూపేష్ బాఘేల్ అతడిని స్వయంగా పిలిపించుకుని ఘనంగా సన్మానించారు. తాజాగా బచ్ పన్ కా ప్యార్ పాటతో పాపులర్ అయిన బాలుడు సహదేవ్ డిర్డో మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ద్విచక్ర వాహనంపై తన తండ్రితో కలిసి వెళ్తుండగా అదుపుతప్పి కిందపడింది. తండ్రికి స్వల్పగాయాలవ్వగా.. సహదేవ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని సుక్మా జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం జగ్‌దల్‌పూర్ వైద్య కళాశాల హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రమాదం గురించి తెలుసుకున్న కొంటా ఎమ్మెల్యే కవాసీ లఖ్మా.. సహదేవ్ దిర్డోకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
ఛదవండి: ఒక్కసారిగా పెరిగిన కోవిడ్ కేసులు.. 44 శాతం అధికంగా.. 781కి చేరిన ఒమిక్రాన్ కేసులు
అదే విధంగా జిల్లా కలెక్టర్ వినీత్ నందన్‌వర్, ఎస్పీ సునీల్ శర్మ.. అతడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రస్తుతం సహ్‌దేవ్ ప్రమాదం గురించి తెలిసిన పలువురు సెలబ్రిటీలు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. సహదేవ్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ట్వీట్ చేస్తున్నారు. మరోవైపు సహదేవ్ ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గానే ఉందని, స్పృహలోకి వచ్చాడని. సింగర్ బాద్షా ట్వీట్ చేశాడు.
Sahdev is better now and has regained consciousness. Will go to Raipur to see a good neurosurgeon. Thank you for your prayers 🙏🙏
— BADSHAH (@Its_Badshah) December 29, 2021
BIHAR: Boy from 'Bachpan ka Pyaar' viral video Sahdev Dirdo meets with accident,#bachpankapyar #SahdevDirdo pic.twitter.com/jiP6fZwF1u
— Syed Kamran Ali (@Sayedkamran_jk) December 28, 2021
Comments
Please login to add a commentAdd a comment