బానెట్‌పై వ్యక్తితో కారు డ్రైవ్‌ చేసిన మైనర్‌.. తర్వాత ఏం జరిగిందంటే? | Mumbai boy 17 drives man on BMW bonnet father arrested | Sakshi
Sakshi News home page

బానెట్‌పై వ్యక్తితో కారు డ్రైవ్‌ చేసిన మైనర్‌.. తర్వాత ఏం జరిగిందంటే?

Published Mon, May 27 2024 7:41 PM | Last Updated on Mon, May 27 2024 8:24 PM

Mumbai boy 17 drives man on BMW bonnet father arrested

మైనర్‌ బాలుడు కారు డ్రైవింగ్‌  కారణంగా ఇద్దరి ప్రాణాలు బలిగొన్న ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఈ ఉదంతంలో రోజుకో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. అయితే పోర్షే కారు ప్రమాదం ఘటన మరవక ముందే కారు బొనెట్‌పై ఓ వ్యక్తిని ఉంచి మైనర్‌ కారు డ్రైవ్‌ చేసిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది.

తన తండ్రికి చెందిన బీఎండబ్ల్యూ కారును 17 ఏళ్ల మైనర్‌ ముంబైలోని రద్దీ ప్రాంతమైన కళ్యాణ్‌ రోడ్డుపై నడిపాడు. మైనర్‌ డ్రైవ్‌ చేయడమే కాకుండా కారు బానెట్‌పై ఓ వ్యక్తి ప్రమాదకరంగా పడకుకొని ఉన్నాడు. రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులు చూసి షాక్‌కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కొంతమంది తమ మొబైల్‌ ఫోన్లలో దీనిని రికార్డ్‌ చేశారు. ఈ క్రమంలో ముంబై పోలీసులు స్పందించారు. బాలుడు డ్రైవ్‌ చేసిన కారు బానెట్‌పై పడుకున్న వ్యక్తిని 21 ఏళ్ల మతాలియాగా గుర్తించారు. అతడితోపాటు కారు యజమాని అయిన బాలుడి తండ్రిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement