హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో చిన్నారి రమ్య మరణించడంతో మైనర్ డ్రైవింగ్పై వెస్ట్ జోన్ పోలీసులు బుధవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అందులోభాగంగా ఎంజే కాలేజీ, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్, మైత్రివనం, సత్యం థియేటర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ప్యారడైజ్, వీఎల్సీసీ బంజారా, అమీర్పేట తదితర ప్రాంతాల్లో పోలీసులు డ్రైవర్ చేపట్టారు.
ఈ సందర్భంగా నగరవ్యాప్తంగా 101 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు నడుపుతున్న మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులకు మూడు రోజుల పాటు పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు.