west zone police
-
నగరంలో మైనర్ డ్రైవింగ్‌పై పోలీసుల స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో చిన్నారి రమ్య మరణించడంతో మైనర్ డ్రైవింగ్‌పై వెస్ట్ జోన్ పోలీసులు బుధవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అందులోభాగంగా ఎంజే కాలేజీ, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్, మైత్రివనం, సత్యం థియేటర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ప్యారడైజ్, వీఎల్సీసీ బంజారా, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో పోలీసులు డ్రైవర్ చేపట్టారు. ఈ సందర్భంగా నగరవ్యాప్తంగా 101 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు నడుపుతున్న మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులకు మూడు రోజుల పాటు పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. -
బెట్టింగ్ ముఠా అరెస్ట్
లంగర్‌హౌజ్ (హైదరాబాద్): క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను వెస్ట్‌జోన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని లంగర్‌హౌజ్‌లో చోటుచేసుకుంది. ఈ దాడిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రెండు ల్యాప్‌ట్యాప్‌లు, సెల్ఫోన్లు, రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. -
బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
హైదరాబాద్ క్రైం: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం నగరంలో జరిపిన పలు దాడుల్లో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. బహదూర్‌పూరాలో బెట్టింగ్ స్థావరాలపై దాడి చేసిన పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 10 మొబైల్ఫోన్లు, నగదు రూ. 51,000, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని షహీయానాద్ గంజ్‌లో బెట్టింగ్‌కు పాల్పడుతున్న బుకీ యోగేష్‌ను వెస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.9,500, ఒక టీవీ, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
జూబ్లీహిల్స్‌లో భారీగా పోలీసు తనిఖీలు
నేరాలను అదుపు చేసేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు మొదలుపెట్టారు. ఇటీవలే మల్లేపల్లి ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేసి, దాదాపు 56 మంది వరకు నేరస్థులను, కొన్ని హత్యకేసుల్లో నిందితులను కూడా పట్టుకున్న పోలీసులు.. ఇప్పుడు తాజాగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మొదలుపెట్టిన ఈ ఆపరేషన్.. తెల్లవారుజాము వరకు కొనసాగింది. మొత్తం 65 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 25 మంది పేకాట రాయుళ్లను కూడా అరెస్టు చేశారు. నగరంలో నేరాలను అదుపులోకి తెచ్చేందుకే ఈ కార్డన్ సెర్చ్ చేస్తున్నట్లు వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. -
'అప్పుల బాధతోనే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య'
-
'అప్పుల బాధ మోయలేకనే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య'
హైదరాబాద్: సినిమా అవకాశాలు లేకపోవడం, ఆర్ధిక ఇబ్బందులు, అప్పుల బాధ మోయలేకనే సినీ హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డారని వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ వెల్లడించారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఉదయ్ కిరణ్ ది ఆత్మహత్యేనని ఉస్మానియా వైద్యులు నివేదికలో తెలిపారు. అయితే ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు దారి తీసిన అంశాలు, కారణాలపై పోలీసులు దృష్టి పెట్టారు. విచారణలో భాగంగా భార్య విషిత, అత్తామామ, సోదరి, బావ, మిత్రుడు శరత్‌లను మంగళవారం సాయంత్రం వెస్ట్‌జోన్ పోలీసులు విచారించారు. -
పోలీసులకు చిక్కిన హాస్యనటుడు ధన్రాజు
హైదరాబాద్: సినీ హాస్యనటుడు ధన్రాజును పోలీసులు అదపులోకి తీసుకున్నారు. వెస్ట్‌జోన్ పోలీసులు ఈ రోజు మసాజ్ సెంటర్లపై దాడులు చేశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 45లోని ఒక మసాజ్ సెంటర్లో ధన్‌రాజ్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ మసాజ్ సెంటర్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. పలు సినిమాలలో హాస్యనటుడుగా మంచి పేరు తెచ్చుకున్న ధనరాజు ఇటీవల ఓ టివి కార్యక్రమంలో కూడా హాస్యాన్ని పండిస్తున్నారు. అందరినీ నవ్వించే ధన్రాజు పాపం చిక్కుల్లో పడ్డాడు.