
బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
హైదరాబాద్ క్రైం: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం నగరంలో జరిపిన పలు దాడుల్లో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. బహదూర్‌పూరాలో బెట్టింగ్ స్థావరాలపై దాడి చేసిన పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 10 మొబైల్‌ఫోన్లు, నగదు రూ. 51,000, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని షహీయానాద్ గంజ్‌లో బెట్టింగ్‌కు పాల్పడుతున్న బుకీ యోగేష్‌ను వెస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.9,500, ఒక టీవీ, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.