లంగర్‌హౌజ్ (హైదరాబాద్): క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను వెస్ట్‌జోన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని లంగర్‌హౌజ్‌లో చోటుచేసుకుంది. ఈ దాడిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రెండు ల్యాప్‌ట్యాప్‌లు, సెల్‌ఫోన్‌లు, రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.