నేరాలను అదుపు చేసేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు మొదలుపెట్టారు. ఇటీవలే మల్లేపల్లి ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేసి, దాదాపు 56 మంది వరకు నేరస్థులను, కొన్ని హత్యకేసుల్లో నిందితులను కూడా పట్టుకున్న పోలీసులు.. ఇప్పుడు తాజాగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేశారు.
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మొదలుపెట్టిన ఈ ఆపరేషన్.. తెల్లవారుజాము వరకు కొనసాగింది. మొత్తం 65 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 25 మంది పేకాట రాయుళ్లను కూడా అరెస్టు చేశారు. నగరంలో నేరాలను అదుపులోకి తెచ్చేందుకే ఈ కార్డన్ సెర్చ్ చేస్తున్నట్లు వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు.
జూబ్లీహిల్స్లో భారీగా పోలీసు తనిఖీలు
Published Sat, Sep 27 2014 7:57 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 PM
Advertisement
Advertisement