'అప్పుల బాధ మోయలేకనే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య'
హైదరాబాద్: సినిమా అవకాశాలు లేకపోవడం, ఆర్ధిక ఇబ్బందులు, అప్పుల బాధ మోయలేకనే సినీ హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డారని వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ వెల్లడించారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
ఉదయ్ కిరణ్ ది ఆత్మహత్యేనని ఉస్మానియా వైద్యులు నివేదికలో తెలిపారు. అయితే ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు దారి తీసిన అంశాలు, కారణాలపై పోలీసులు దృష్టి పెట్టారు. విచారణలో భాగంగా భార్య విషిత, అత్తామామ, సోదరి, బావ, మిత్రుడు శరత్‌లను మంగళవారం సాయంత్రం వెస్ట్‌జోన్ పోలీసులు విచారించారు.