ఫైన్ లేదు కోర్టుకే!
మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలకు నిర్ణయం
వాహన యజమాని పైనా అభియోగపత్రం
గురువారం నుంచి ప్రత్యేక డ్రైవ్‌స ప్రారంభం
స్కూలు ఆటోల ఉల్లంఘనల పైనా నజర్
సిటీలో ఒక్క రోజులో 164 కేసులు నమోదు
సిటీబ్యూరో: ‘సార్... మా అబ్బారుుకి డ్రైవింగ్ లెసైన్సు లేదు. మైనార్టీ కూడా తీరకుండానే కారు తీసుకుని కాలేజ్‌కి వెళ్తుంటాడు. వద్దని వారించినా వినడు సరికదా... నానా రాద్దాంతం చేస్తాడు. నగరంలో నా మాదిరిగా ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఈ సమస్యపై దృష్టి పెట్టండి. మరోసారి వాహనాల జోలికి పోకుండా ఉండేలా మైనర్‌డ్రైవర్లను కట్టడి చేయండి’.
ఇటీవల నగర ట్రాఫిక్ విభాగం అధికారులకు ఓ తల్లి నుంచి వచ్చిన ఫోన్ కాల్. ఈ మాదిరిగా నిత్యం ఫేస్‌బుక్, ఈ-మెరుుల్, ఫోన్ ద్వారా ఫిర్యాదులు అందుతూనే ఉన్నారుు. వీటిని పరిగణలోకి తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీసులు మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణరుుంచారు. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారిని జరిమానాలతో సరిపెట్టకుండా కోర్టుకు తీసుకువెళ్లనున్నారు. దీంతో పాటు స్కూలు ఆటోల ఉల్లంఘనలపై గురువారం నుంచి ప్రత్యేక డ్రైవ్‌స ప్రారంభించారు. తొలిరోజు 164 కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ డీసీపీ ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు.
విద్యా కేంద్రాల వద్ద కాపుకాసి...
‘మైనర్ డ్రైవింగ్’ను కట్టడి చేయాలని నిర్ణరుుంచిన ట్రాఫిక్ పోలీసులు ప్రధానంగా విద్యా సంస్థలపై కన్నేశారు. తొలిదశలో మైనార్టీ తీరకుండానే, డ్రైవింగ్ లెసైన్‌స లేకుండా వాహనాలపై పాఠశాలలు, కళాశాలలకు వాహనాలు తీసుకువస్తున్న వారిని కట్టడి చేయాలని నిర్ణరుుంచారు. దీనికోసం నిర్వహించతలపెట్టిన ప్రత్యేక డ్రైవ్‌స గురువారం నుంచి ప్రారంభమయ్యారుు. సిటీలోని పలు పాఠశాలలు, జూనియర్ కాలేజీల వద్ద ఉదయం నుంచే కాపుకాసిన ట్రాఫిక్ పోలీసులు ‘చిన్న ఉల్లంఘనుల్ని’ గుర్తించారు. గురువారం ఒక్క రోజే నగర వ్యాప్తంగా 75 కేసులు నమోదు చేశారు. స్కూళ్ల వద్ద స్పెషల్ డ్రైవ్ చేస్తున్న నేపథ్యంలో స్కూలు ఆటోల ఉల్లంఘనల్నీ పరిగణలోకి తీసుకున్నారు. పరిమితికి మించి(ఆరుగురు) స్కూలు పిల్లల్ని తీసుకువస్తున్న ఆటోలనూ వదిలిపెట్టలేదు. ఈ రకంగా 91 ఆటోలపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
జరిమానా కాకుండా చార్జ్‌షీట్...
ట్రాఫిక్ పోలీసులు గతంలో మైనర్ డ్రైవింగ్ ఉల్లంఘన కేసులు నమోదు చేసినప్పుడు వాహనచోదకులకు ఇతర ఉల్లంఘనల మాదిరిగానే జరిమానా విధించే వారు. అరుుతే దీని తీవ్రతను పరిగణలోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఈ జరిమానాలకు స్వస్తి చెప్పారు. ఇకపై స్కూలు విద్యార్థులతో సహా ఏ మైనర్ డ్రైవింగ్ చేస్తూ చిక్కినా... వారి నుంచి వాహనం స్వాధీనం చేసుకోవాలని నిర్ణరుుంచారు. సదరు డ్రైవర్‌తో పాటు వాహన యజమాని పైనా కేసు నమోదు చేసి న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు. మైనర్లను జువైనల్ కోర్టుకు, వాహన యజమానిని సాధారణ కోర్టులో హాజరుపరచనున్నారు. దీనికి ముందు అందరికీ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో కౌన్సిలింగ్ పక్కా చేశారు.
‘నిషా’చరుల మాదిరిగానే...
‘ప్రస్తుతం సిటీలో డ్రంకన్ డ్రైవింగ్ కేసుల్లో పోలీసులు జరిమానా విధించట్లేదు. వీరి వాహనం స్వాధీనం చేసుకుని న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేస్తున్నాం. ఇదే విధానాన్ని మైనర్‌డ్రైవింగ్, డ్రైవింగ్ లెసైన్‌స లేకుండా డ్రైవింగ్ చేయడం ఉల్లంఘనలకూ వర్తింపజేస్తున్నాం. న్యాయమూర్తి ఆదేశాల మేరకు వీరికి కోర్టులో జైలు లేదా జరిమానా పడుతుంది. ఈ మార్పుల నేపథ్యంలో పీడీఏ మిషన్లలో ప్రోగ్రామింగ్ సైతం మార్చాం. క్షేత్రస్థారుులో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఎవరైనా ఈ రెండు ఉల్లంఘనలకూ జరిమానా విధించాలని ప్రయత్నించినా అది సాధ్యం కాదు. రానున్న రోజుల్లో ప్రత్యేక డ్రైవ్‌స ముమ్మరంగా నిర్వహించాలని నిర్ణరుుంచాం’. - ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ