Lesainsu driving
-
ఫైన్ లేదు కోర్టుకే!
మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలకు నిర్ణయం వాహన యజమాని పైనా అభియోగపత్రం గురువారం నుంచి ప్రత్యేక డ్రైవ్‌స ప్రారంభం స్కూలు ఆటోల ఉల్లంఘనల పైనా నజర్ సిటీలో ఒక్క రోజులో 164 కేసులు నమోదు సిటీబ్యూరో: ‘సార్... మా అబ్బారుుకి డ్రైవింగ్ లెసైన్సు లేదు. మైనార్టీ కూడా తీరకుండానే కారు తీసుకుని కాలేజ్‌కి వెళ్తుంటాడు. వద్దని వారించినా వినడు సరికదా... నానా రాద్దాంతం చేస్తాడు. నగరంలో నా మాదిరిగా ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఈ సమస్యపై దృష్టి పెట్టండి. మరోసారి వాహనాల జోలికి పోకుండా ఉండేలా మైనర్డ్రైవర్లను కట్టడి చేయండి’. ఇటీవల నగర ట్రాఫిక్ విభాగం అధికారులకు ఓ తల్లి నుంచి వచ్చిన ఫోన్ కాల్. ఈ మాదిరిగా నిత్యం ఫేస్బుక్, ఈ-మెరుుల్, ఫోన్ ద్వారా ఫిర్యాదులు అందుతూనే ఉన్నారుు. వీటిని పరిగణలోకి తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీసులు మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణరుుంచారు. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారిని జరిమానాలతో సరిపెట్టకుండా కోర్టుకు తీసుకువెళ్లనున్నారు. దీంతో పాటు స్కూలు ఆటోల ఉల్లంఘనలపై గురువారం నుంచి ప్రత్యేక డ్రైవ్‌స ప్రారంభించారు. తొలిరోజు 164 కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ డీసీపీ ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. విద్యా కేంద్రాల వద్ద కాపుకాసి... ‘మైనర్ డ్రైవింగ్’ను కట్టడి చేయాలని నిర్ణరుుంచిన ట్రాఫిక్ పోలీసులు ప్రధానంగా విద్యా సంస్థలపై కన్నేశారు. తొలిదశలో మైనార్టీ తీరకుండానే, డ్రైవింగ్ లెసైన్‌స లేకుండా వాహనాలపై పాఠశాలలు, కళాశాలలకు వాహనాలు తీసుకువస్తున్న వారిని కట్టడి చేయాలని నిర్ణరుుంచారు. దీనికోసం నిర్వహించతలపెట్టిన ప్రత్యేక డ్రైవ్‌స గురువారం నుంచి ప్రారంభమయ్యారుు. సిటీలోని పలు పాఠశాలలు, జూనియర్ కాలేజీల వద్ద ఉదయం నుంచే కాపుకాసిన ట్రాఫిక్ పోలీసులు ‘చిన్న ఉల్లంఘనుల్ని’ గుర్తించారు. గురువారం ఒక్క రోజే నగర వ్యాప్తంగా 75 కేసులు నమోదు చేశారు. స్కూళ్ల వద్ద స్పెషల్ డ్రైవ్ చేస్తున్న నేపథ్యంలో స్కూలు ఆటోల ఉల్లంఘనల్నీ పరిగణలోకి తీసుకున్నారు. పరిమితికి మించి(ఆరుగురు) స్కూలు పిల్లల్ని తీసుకువస్తున్న ఆటోలనూ వదిలిపెట్టలేదు. ఈ రకంగా 91 ఆటోలపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. జరిమానా కాకుండా చార్జ్‌షీట్... ట్రాఫిక్ పోలీసులు గతంలో మైనర్ డ్రైవింగ్ ఉల్లంఘన కేసులు నమోదు చేసినప్పుడు వాహనచోదకులకు ఇతర ఉల్లంఘనల మాదిరిగానే జరిమానా విధించే వారు. అరుుతే దీని తీవ్రతను పరిగణలోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఈ జరిమానాలకు స్వస్తి చెప్పారు. ఇకపై స్కూలు విద్యార్థులతో సహా ఏ మైనర్ డ్రైవింగ్ చేస్తూ చిక్కినా... వారి నుంచి వాహనం స్వాధీనం చేసుకోవాలని నిర్ణరుుంచారు. సదరు డ్రైవర్‌తో పాటు వాహన యజమాని పైనా కేసు నమోదు చేసి న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు. మైనర్లను జువైనల్ కోర్టుకు, వాహన యజమానిని సాధారణ కోర్టులో హాజరుపరచనున్నారు. దీనికి ముందు అందరికీ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కౌన్సిలింగ్ పక్కా చేశారు. ‘నిషా’చరుల మాదిరిగానే... ‘ప్రస్తుతం సిటీలో డ్రంకన్ డ్రైవింగ్ కేసుల్లో పోలీసులు జరిమానా విధించట్లేదు. వీరి వాహనం స్వాధీనం చేసుకుని న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేస్తున్నాం. ఇదే విధానాన్ని మైనర్డ్రైవింగ్, డ్రైవింగ్ లెసైన్‌స లేకుండా డ్రైవింగ్ చేయడం ఉల్లంఘనలకూ వర్తింపజేస్తున్నాం. న్యాయమూర్తి ఆదేశాల మేరకు వీరికి కోర్టులో జైలు లేదా జరిమానా పడుతుంది. ఈ మార్పుల నేపథ్యంలో పీడీఏ మిషన్లలో ప్రోగ్రామింగ్ సైతం మార్చాం. క్షేత్రస్థారుులో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఎవరైనా ఈ రెండు ఉల్లంఘనలకూ జరిమానా విధించాలని ప్రయత్నించినా అది సాధ్యం కాదు. రానున్న రోజుల్లో ప్రత్యేక డ్రైవ్‌స ముమ్మరంగా నిర్వహించాలని నిర్ణరుుంచాం’. - ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ -
దాడులతో దడ..!
డ్రైవింగ్ లెసైన్సులకు భలే గిరాకీ ఆర్టీఏ కార్యాలయాల్లో పెరిగిన రద్దీ పోలీసు,రవాణా తనిఖీలతోబారులు తీరుతున్న వాహనదారులు 20 శాతం పెరిగిన రద్దీ సిటీబ్యూరో:డ్రైవింగ్ లెసైన్సుల కోసం ఆర్టీఏ కార్యాలయాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. గత రెండు రోజులుగా రవాణా, పోలీసు విభాగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న తనిఖీలతో లెసైన్సులు లేకుండా బండి నడుపుతున్న వాహనదారులు ఆర్టీఏ బాటపట్టారు. ఈ రెండు రోజుల్లో గ్రేటర్ పరిధిలో సాధారణ రోజుల్లో కంటే 20 శాతానికిపైగా లెర్నింగ్ లెసైన్సులు, డ్రైవింగ్ లెసైన్సులకు డిమాండ్ పెరిగి నట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ తెలిపారు. 360 లెర్నింగ్ లెసైన్స్ స్లాట్ లు అందుబాటులో ఉన్న ఖైరతాబాద్ కేంద్ర కార్యాలయంలో బుధవారం 288 మంది ఎల్‌ఎల్‌ఆర్‌లు తీసుకున్నారు. సాధారణ రోజుల్లో 150 నుంచి 200 వరకు మాత్రమే స్లాట్లు నమోదవుతాయి. అలాగే సాధారణ రోజుల్లో 100 నుంచి 150 వరకు డిమాండ్ ఉండే సికింద్రాబాద్ ఆర్టీఏలో 200మంది ఎల్‌ఎల్‌ఆర్‌లు తీసుకున్నారు. నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లో పర్మినెంట్ డ్రైవింగ్ లెసైన్స్ పరీక్షల కోసం ఏకంగా 435 మంది హాజరయ్యారు. మరోవైపు నగర శివార్లలోని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ డ్రైవింగ్ లెసైన్సుల కోసం వచ్చే వాహనదారుల రద్దీ కనిపించింది. లెర్నింగ్లెసైన్సులు, డ్రైవింగ్ లెసైన్సుల కోసం బుధవారం 991 మంది హాజరయ్యారు. ఏజెంట్లను ఆశ్రయించవద్దు : జేటీసీ నగరంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో డిమాండ్‌కు అనుగుణంగా స్లాట్లు అందుబాటులో ఉన్నాయని, ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకొని పరీక్షలకు హాజరు కావాలని జేటీసీ సూచించారు. ఈ సేవా కేంద్రాల్లోనూ స్లాట్ నమోదు చేసుకొనే సదుపాయం ఉందన్నారు. వినియోగదారులు బ్రోకర్లు, ఏజెంట్లను ఆశ్రయించకుండా నేరుగా ఆర్టీఏ అధికారులను సంప్రదించాలని కోరారు. రోడ్డు భద్రతా నిబంధనలు, ట్రాఫిక్స్ రూల్స్ పట్ల స్పష్టమైన అవగాహన కలిగిన వాహనదారులు లెర్నింగ్, డ్రైవింగ్ పరీక్ష ల్లోనూ ఉత్తీర్ణులవుతారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. ఎల్ఎల్ఆర్ ఇలా పొందవచ్చు.... రవాణాశాఖ వెబ్సైట్లో మొదట స్లాట్ నమో దు చేసుకోవాలి. 24 గంటల్లో ఈ సేవ, నెట్‌బ్యాంకింగ్ ద్వారా నిర్ణీత రుసుం చెల్లించాలి. నిర్ణీత తేదీ, సమయం ప్రకారం పుట్టిన తేదీ, ని వాస ధృవీకరణ పత్రాలతో ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాలి. ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన 20 ప్రశ్న ల్లో 12 ప్రశ్నలకు 10 నిమిషాల్లో సరైన జవాబులు గుర్తిస్తే ఉత్తీర్ణులుగా పరిగణించి వెంటనే ఎల్ఎల్ఆర్ ఇస్తారు. డ్రైవింగ్ లెసైన్స్ ఇలా... ఎల్ఎల్ఆర్ (లెర్నింగ్) తీసుకున్న 30 రోజుల నుంచి 6 నెలల వరకు ఎప్పుడైనా డ్రైవింగ్ టెస్ట్ కు హాజరు కావచ్చు. ఇందుకోసం మరోసారి ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకోవాలి. ఈసేవ, నెట్‌బ్యాంకింగ్ ద్వారా 24 గంటల్లో ఫీజు చెల్లించాలి.నిర్ణీత తేదీ, సమయం ప్రకారం అందుబాటులోని డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌కు పరీక్షకు వెళ్లి, అధికారుల పర్యవేక్షణలో వాహనాలు నడపాలి, నిబంధనలకు అనుగుణంగా నడిపిన వారిని ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. వారం రోజుల్లో డ్రైవింగ్ లెసైన్స్ స్పీడ్ పోస్టు ద్వారా ఇంటికి చేరుతుంది. లెర్నింగ్ పరీక్షల్లోనూ,. డ్రైవింగ్ పరీక్షల్లోనూ ఫెయిల్ అయిన వారు తిరిగి మరోసారి పరీక్షలకు హాజరు కావలసిందే. -
నకిలీ.. మకిలీ!
రవాణా శాఖ లెసైన్సు కోసం మీకు మెడికల్ సర్టిఫికెట్ కావాలా? అంతో ఇంతో ఇచ్చుకుంటే చాలు.. ఒక్కటంటే ఒక్కటే నిమిషంలో మెడికల్ సర్టిఫికెట్ మీ చేతిలో ఉంటుంది. ఇదేదో జిల్లాలో కొద్ది మంది డాక్టర్లు చేసే వ్యవహారమే అనుకుంటున్నారా? ఇక్కడ సర్టిఫికెట్ ఇస్తోంది అసలుసిసలు డాక్టర్ కాదు. ఫిజీషియన్ పేరిట ఓ ఆర్ఎంపీ చేస్తున్న మకిలీ వ్యవహారం. ఓ డాక్టర్ పేరుతో ఉన్న సీలును ఉపయోగిస్తూ విచ్చలవిడిగా సంతకాలు చేసి మెడికల్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. కర్నూలు నగర శివారు నంద్యాల చెక్‌పోస్టుకు సమీపంలో పాత రవాణా శాఖ కార్యాలయం(ఆర్టీఓ) ఎదుటనున్న లక్ష్మీ పాలి క్లినిక్ కేంద్రంగా ఈ దందా సాగుతోంది. మెడికల్ సర్టిఫి‘కేట్’ ప్రభుత్వ వైద్యుని సీల్‌తో ఆర్ఎంపీ దందా రోజూ పదుల సంఖ్యలో సర్టిఫికెట్ల జారీ దగ్గరుండి పంపుతున్న రవాణా శాఖ ఏజెంట్లు పాత ఆర్టీఓ కార్యాలయం ఎదుట దుకాణం సాక్షి టాస్క్‌ఫోర్స్: డ్రైవింగ్ లెసైన్సు కావాలన్నా.. ప్రధానంగా 50 ఏళ్ల వయసు పైబడిన వారు లెర్నింగ్ లెసైన్సు పొందేందుకు మెడికల్ సర్టిఫికెట్ తప్పనిసరి. అదేవిధంగా ఏ వయసు వారైనా హెవీ, ట్రాన్స్‌పోర్టు లెసైన్సు పొందేందుకు కచ్చితంగా మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాలి. ఇందుకోసం ఫారం-1 ఏపై గెజిటెడ్ హోదా కలిగిన ఫిజీషియన్ సర్టిఫై చేయాల్సి ఉంది. అయితే, కర్నూలు ఆర్టీఓ కార్యాలయంలో రోజుకు పదుల సంఖ్యలో లెసైన్సులు జారీ అవుతున్నాయి. వీరందరికీ అవసరమైన మెడికల్ సర్టిఫికెట్ కోసం రవాణాశాఖ ఏజెంట్లు కాస్తా లక్ష్మీ పాలి క్లినిక్కే పంపుతున్నారు. ఇక్కడ డాక్టర్ ఎం.ప్రతాప్ బీఎస్సీ, ఎంబీబీఎస్.. ఫిజీషియన్ అండ్ సర్జన్ అని రిజిస్టర్ నెంబరు 45367గా పేర్కొంటూ రెవెన్యూ కాలనీలో ఉంటున్నట్టు మెడికల్ సర్టిఫికెట్ జారీచేస్తున్నారు. అయితే, ఇది వాస్తవానికి నిజమైన డాక్టరుది కాదు. అయినప్పటికీ రోజుకు పదుల సంఖ్యలో జారీచేస్తూ ఈ ఆర్ఎంపీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. కనీసం ఇవి నిజమైన డాక్టరు జారీ చేస్తున్నారా? నకిలీ డాక్టరా? అన్నది కూడా రవాణాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. సర్టిఫికెట్ సరైన పద్ధతిలో జారీకాకపోయినప్పటికీ వారు పరిశీలించడం లేదన్నది అర్థమవుతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పాత ఆర్టీఓ కార్యాలయం పరిసరాల్లో ఉంటున్న ఏజెంట్లు నడిపిస్తున్నారు. మెడికల్ సర్టిఫికెట్ ఎందుకంటే..ట్రాన్స్‌పోర్టు లెసైన్సు, భారీ వాహనాలు నడిపేందుకు అవసరమైన హెవీ లెసైన్సుతో పాటు రెన్యువల్ కోసం ఫిట్నెస్ సర్టిఫికెట్ అవసరం. ఇది ఉంటేనే రవాణాశాఖ సిబ్బంది లెసైన్స్ జారీచేస్తారు. అదేవిధంగా 50 ఏళ్ల వయసు పైబడిన వారికి లెర్నింగ్ లెసైన్స్ కావాలంటే కూడా మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి. కంటిచూపు బాగుందా? లేదా? ఇతర అవయవాలు బాగున్నాయా? లేదా అనే వివరాలను తెలుపుతూ గెజిటెడ్ హోదా ఉన్న ఫిజీషియన్ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుంది. అయితే, అర్హత లేకపోయినప్పటికీ ఓ ఆర్ఎంపీ డాక్టర్ చేస్తున్న వ్యవహారాన్ని ఎవ్వరూ పట్టించుకోకపోవడం సాక్షి టాస్క్‌ఫోర్స్ పరిశీలనలో బట్టబయలైంది. సర్టిఫికెట్ జారీ ఇలా ఉండాలి వాస్తవానికి మెడికల్ సర్టిఫికెట్‌ను జారీచేసే వ్యక్తి కనీసం ఎంబీబీఎస్ చదువుకుని ఉండాలి. సర్టిఫికెట్ జారీ సమయంలో కూడా కేవలం మెడికల్ ఆఫీసర్ అని, కింద రిజిస్ట్రేషన్ నెంబర్‌ను పేర్కొంటారు. దీనిపై గ్రీన్ ఇంకుతో సంతకం చేయడంతో పాటు బ్రాకెట్లో పూర్తి పేరు కూడా రాస్తారు. అయితే, ఇక్కడ జారీ అవుతున్న సర్టిఫికెట్లు ఏవీ కూడా ఈ ప్రమాణాల్లో లేవు. రబ్బరు స్టాంపులోనే డాక్టరు పేరు ఉంది. దీనిని గమనిస్తే చాలు.. జారీ అవుతున్న మెడికల్ సర్టిఫికెట్లు నకిలీవని ఇట్టే అర్థమవుతుంది. రవాణాశాఖ అధికారులు ఏమంటున్నారంటే... లెసైన్సు సమయంలో మెడికల్ సర్టిఫికెట్‌ను పరిశీలించేది రవాణాశాఖ కార్యాలయ పరిపాలన అధికారి(ఏఓ) స్థాయిలో ఉంటుందని రవాణాశాఖ ప్రాంతీయ అధికారి(ఆర్టీఓ) కె.సత్యనారాయణ మూర్తి తెలిపారు. ఇలాంటి నకిలీ మెడికల్ సర్టిఫికెట్లను ఇక మీదట పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆ సర్టిఫికెట్లతో నాకు సంబంధం లేదు జలదుర్గం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ)లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసే సమయంలో కర్నూలు నగరం నంద్యాల చెక్‌పోస్టుకు సమీపంలో ఉన్న లక్ష్మీ పాలి క్లినిక్‌కు వెళ్లేవాన్ని. అది కూడా కొందరు వైద్యులతో కలిసి అక్కడ కూర్చునేవాన్ని తప్ప ప్రాక్టీస్ చేయలేదు. ఎవ్వరికీ మెడికల్ సర్టిఫికెట్లు జారీ చేయలేదు. కానీ నా పేరుతో శ్యామ్ అనే వ్యక్తి సీల్ తయారు చేసుకుని మెడికల్ సర్టిఫికెట్లు ఇస్తున్నారనే విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు. ఆయన ఇచ్చే సర్టిఫికెట్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను జలదుర్గం పీహెచ్సీ నుంచి గోనెగండ్లకు.. ఆ తర్వాత ప్రస్తుతం ఎమ్మిగనూరు క్లస్టర్‌లోని కలుదేవకుంట్ల పీహెచ్సీలో పనిచేస్తున్నా. నా పేరుతో సర్టిఫికెట్లు ఇస్తున్న అతనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తా. - డాక్టర్ ఎం.ప్రతాప్, మెడికల్ ఆఫీసర్, కలుదేవకుంట్ల పీహెచ్సీ