
మాట్లాడుతున్న డీఎస్పీ ప్రసన్నరాణి
కామారెడ్డి క్రైం: మైనర్ డ్రైవింగ్ సహించేది లేదని, మైనర్లకు వాహనాలు ఇస్తే వారితోపాటు వాహనాల యజమానులకు జైలు శిక్ష తప్పదని డీఎస్పీ ప్రసన్నరాణి హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఇటీవల పట్టుబడిన వందమంది మైనర్లకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. 18 ఏళ్లు నిండకుండా వాహనాలు నడిపిస్తే మైనర్‌లకు శారీరక, మానసిక సా మర్థ్యం తక్కువగా ఉంటుందన్నారు. ప్రమాదాల బారిన పడే అవకాశం ఎక్కువన్నారు. వారితో పాటు ప్రమాదా లు జరిగినప్పుడు ఎదుటి వారి కుటుంబాలకు కూడా తీ వ్రంగా నష్టం వాటిల్లుతుందన్నారు.
అన్ని తెలిసినా ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యాన్ని వీడాలన్నారు. చట్ట ప్రకారం మైనర్లకు వాహనాలు ఇచ్చే వారిపై కూడా కేసులు తప్పవన్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదని, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. మరోసారి తప్పు చేస్తే మాత్రం కేసులు తప్పవని హెచ్చరించారు.
పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా జైలు పాలు కావాల్సి వస్తుందన్నారు. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువశాతం చనిపోతున్నా వారంతా బైకులపై వెళ్తున్నవారే అని తెలిపారు. ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోకపోవడంతోనే ఎంతో మంది మృత్యువాత పడుతున్నారని తెలిపారు.
లైసెన్సులు, హెల్మెట్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ లాంటి నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. పిల్లలు పొరపాట్లు చేయకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పట్టణ ఎస్సై రవికుమార్, ట్రాఫిక్ ఎస్సై మజార్ అలీ, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment