Vikarabad: Old Man Climbed Up The Train And Made A Fuss - Sakshi
Sakshi News home page

రైలింజన్‌ పైకెక్కి వృద్ధుడి హల్‌చల్‌..!

Published Sat, Jul 22 2023 5:50 AM | Last Updated on Sat, Jul 22 2023 1:24 PM

- - Sakshi

వికారాబాద్‌: తాండూరు రైల్వేస్టేషన్‌లో నిలిచిన ఓ రైలింజన్‌ పైకి ఓ వృద్ధుడు ఎక్కి హల్‌చల్‌ చేశాడు. హైటెన్షన్‌ తీగను పట్టుకునేందుకు యత్నించి గాయాలపాలయ్యాడు. ఈఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కర్నాటక రాష్ట్రం కల్లూరుకు చెందిన 60 ఏళ్ల కొండం చంద్రశేఖర్‌ మతి స్థిమితం కోల్పోవడంతో రైల్వే స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతుండేవాడు.

హైదరాబాద్‌ నుంచి ముంబయి వెళ్తున్న హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్వేస్టేషన్‌లో ఆగింది. ఆ సమయంలో చంద్రశేఖర్‌ రైలింజన్‌ పైకెక్కి హైటెన్షన్‌ తీగను పట్టుకునేందుకు యత్నించాడు. అక్కడున్న వారు ఎంత వారించినా వినలేదు. ఇంతలో రైలు కదలడంతో ఇంజన్‌పై పడిపోయాడు. దీంతో వృద్ధుడికి గాయాలయ్యాయి.

స్థానికులు అందరూ కలిసి అతన్ని కిందకు దింపి, చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తీగకు చేయి తగిలి ఉంటే పెను ప్రమాదం జరిగేదని, రైలు కదలడంతో ముప్పు తప్పిందని ప్రయాణికులుఅంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement