'తాత అని పిలిపించుకుని.. డబ్బు ఆశ చూపి..' ముగ్గురు బాలికలపై.. వృద్ధుడు | - | Sakshi
Sakshi News home page

'తాత అని పిలిపించుకుని.. డబ్బు ఆశ చూపి..' ముగ్గురు బాలికలపై.. వృద్ధుడు

Published Fri, Oct 13 2023 1:36 AM | Last Updated on Fri, Oct 13 2023 10:53 AM

- - Sakshi

కరీంనగర్: ముగ్గురు బాలికలపై ఓ వృద్ధుడు మూడు నెలలుగా లైంగికదాడికి పాల్పడుతున్న ఘటన మండలంలోని తిర్మాలాపూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. తాత అని పిలిచిన వారికి డబ్బు ఆశ చూపి.. మాయమాటలు చెప్పి ఈ ఆకృత్యానికి ఒడిగడుతున్నాడు. పిల్లల ఆరోగ్యం బాగలేకపోవడంతో వారి తల్లులు మందలించగా.. అసలు విషయం బయటపడింది.

బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలు రంగధామునిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఒకరు ఐదు, మరొకరు నాలుగు, ఇంకొకరు మూడో తరగతి చదువుతున్నారు. ముగ్గురి తండ్రులు ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ వెళ్లారు. తల్లులు కూలి పనిచేస్తూ వీరిని పోషించుకుంటున్నారు. వీరి సామాజికవర్గానికే చెందిన శివరాత్రి ముత్తయ్య (65) వీరి ఇంటి సమీపంలో ఉంటాడు. పిల్లలకు సెలవు రోజు ఇంటికి పిలిచి డబ్బులు ఇవ్వడంతోపాటు పొలం వద్దకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడుతున్నాడు.

ఇలా మూడునెలలుగా తన కామవాంఛ తీర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో చిన్నారులు నాలుగురోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. తల్లులు ఆరా తీయగా జరిగిన విషయాన్ని వారితో చెప్పారు. సదరు కామాంధుడిని కుల సంఘంలోకి పిలిస్తే రాకపోగా.. బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుల తల్లులు అంటున్నారు. దీంతో చేసేది లేక వారు గొల్లపల్లి పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు.

అడిగితే బెదిరింపులు..
తమ పిల్లలకు జరిగిన అన్యాయంపై సంఘం దృష్టికి తీసుకెళ్లగా.. కుల పెద్దలు పిలిచినా ముత్తయ్య రాలేదని, పైగా ఆయన భార్య మల్లవ్వ, కొడుకు శ్రీనివాస్‌ తమనే బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపించారు.

ఉరి తీయాలి..
తమ పిల్లల జీవితాలను నాశనం చేసిన ముత్తయ్యను ఉరితీయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు స్పందించి నిందితుడితోపాటు ఆయన భార్య మల్లవ్వ, కొడుకు శ్రీనివాస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కుల సంఘం సభ్యులు డిమాండ్‌ చేశారు. సదరు నిందితుడిని ఎస్సై నరేశ్‌ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు సమాచారం.

https://Follow the Sakshi TV channel on WhatsApp

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement