టెహ్రాన్: ఇరాన్ సుప్రీం నేత అలీ ఖమేనీ హయాంను హంతక పాలనగా విమర్శించిన ఆయన మేనకోడలికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఖమేనీ అధికారాన్ని వ్యతిరేకిస్తున్న కుటుంబానికి చెందిన ఫరిదే మొరాద్‌ఖానీని నవంబర్ 23న పోలీసులు తీసుకెళ్లారు.
పోలీస్ కస్టడీలో మరణించిన మహ్సా అమిని అనే యువతిని బహిరంగంగా సమరి్థంచారన్న ఆరోపణలపై న్యాయస్థానం ఆమెకు శిక్ష విధించింది. ఖమేనీ కుటుంబం ఆయన్ని బహిరంగంగా వ్యతిరేకించడం ఇదేం కొత్త కాదు.
Comments
Please login to add a commentAdd a comment