
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలేదా జియా
ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకురాలు ఖలేదా జియా(72)కు ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. సుమారు 21 మిలియన్ టాకాల(కోటి 61 లక్షల రూపాయలు)ను తనకు చెందిన జియా ఆర్ఫానేజ్ ట్రస్ట్‌లోకి విదేశీ విరాళాల రూపంలో మళ్లించి అవినీతికి పాల్పడినందుకు కోర్టు ఆమెకు ఈ శిక్ష విధించింది.
ఈ కేసుతో సంబంధం ఉన్న జియా కుమారుడు తారిఖ్ రహమాన్‌తో పాటు మరో నలుగురికి కూడా 10 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ పరిణామంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా బంగ్లాదేశ్ అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment