నిందితుడు సంజయ్
సాక్షి, నాగోలు: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మహారాష్ట్ర నాగపూర్‌కు చెందిన కోప్రగది సంజయ్(58) ఎల్‌బీనగర్ ఎన్టీఆర్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అక్కడే ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నివాసం ఉండేది. 2017లో ఆగస్టు 7వ తేదీన మధ్యాహ్నం సమయంలో ఇంటి వద్ద ఉన్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అప్పటి ఎల్‌బీనగర్ సీఐ కాశిరెడ్డి నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి సురేష్ నిందితుడికి 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.20వేల జరిమానా విధించారు.
Comments
Please login to add a commentAdd a comment