ఉపాధ్యాయురాలికి జైలు శిక్ష | Teacher Sentenced to Jail in tamilnadu | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయురాలికి జైలు శిక్ష

Published Wed, Mar 23 2016 8:44 AM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM

Teacher Sentenced to Jail in tamilnadu

తిరువొత్తియూరు: టెన్త్ విద్యార్థితో కలసి పారిపోయిన ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టారు. నెల్లై జిల్లా తెన్‌కాశిలోని ప్రైవేటు పాఠశాలలో సెంగోటైకు చెందిన కేసరి కుమార్తె గోదైలక్ష్మి (25) ఉపాధ్యాయురాలు. గత సంవత్సరం అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కడయనల్లూరు మత్తుకృష్ణాపురానికి చెందిన చంద్రకుమార్ కుమారుడు శివసుందర్ పాండియన్ (16) ఆమె వద్ద ట్యూషన్‌కు చేరారు.

వీరిద్దరు ఇంటి నుంచి పారిపోయారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తిరుపూర్ పూలవండి పట్టిలో ఉన్న ఇద్దరిని పోలీసులు విడిపించి తీసుకొచ్చారు. ఆ సమయంలో గోదైలక్ష్మి నాలుగు నెలల గర్భిణి అని తెలిసింది. కోర్టులో ఇద్దరిని హాజరు పరచి విచారణ జరిపి విద్యార్థిని అతని తల్లితో పంపించి ఉపాధ్యాయురాలిని తిరుచ్చి మహిళా జైలులో ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement