కూతురిపై ఆన్ లైన్ యాడ్.. తల్లికి 26 ఏళ్ల జైలు! | Mom jailed for advertising online for men to rape her daughter | Sakshi
Sakshi News home page

కూతురిపై ఆన్ లైన్ యాడ్.. తల్లికి 26 ఏళ్ల జైలు!

Published Sun, May 8 2016 1:29 PM | Last Updated on Sat, Apr 6 2019 8:51 PM

కూతురిపై ఆన్ లైన్ యాడ్.. తల్లికి 26 ఏళ్ల జైలు! - Sakshi

కూతురిపై ఆన్ లైన్ యాడ్.. తల్లికి 26 ఏళ్ల జైలు!

వాషింగ్టన్: అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన కూతురిపైనే వ్యాపారం చేయాలని చూసి ఓ కన్నతల్లి మాతృత్వానికే మచ్చ తెచ్చింది. కన్నకూతురిని తన నీచ వృత్తిలోకి దించాలని ప్రయత్నించిన కేసులో 26 ఏళ్ల జైలుశిక్ష పడింది. ఈ ఘటన అమెరికాలో రెండేళ్ల కింద చోటుచేసుకోగా తాజాగా ఆమెకు కోర్టు శిక్ష ఖరారుచేసింది. పోలీసుల కథనం ప్రకారం... అమెరికాలో నివాసం ఉంటోన్న ఓ కుటుంబం క్లాసిఫైడ్స్ వెబ్ సైట్ రన్ చేస్తోంది. ఆ భార్యాభర్తలు చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు తీసి విక్రయించేవారు. అందులో భాగంగా సొంత కూతురుకు సంబంధించి తమ వెబ్ సైట్ ఆన్ లైన్లో ప్రకటన ఇచ్చారు. ఆ చిన్నారిపై లైంగిక దాడి సమయంలో వీడియో తీయాలని భావించారు. అయితే ఈ విషయం పోలీసులకు తెలిసింది.

వారు ఆ ఇంటికి వెళ్లి పరిశీలించగా, చైల్డ్ పోర్న్ వీడియో లభించాయి. ఓ గుర్తుతెలియని వ్యక్తి చిన్నారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండటం, ఆ పక్కనే తల్లి కూర్చుని ఈ సీన్ చూడటం, అసభ్యకరమైన ఫొటోలు తీయడం చేసిందని పోలీసులు తెలిపారు. కూతురితో అసభ్య వీడియోలు తీసి డబ్బు సంపాదించాలని చూసిందని కోర్టువారికి విన్నవించారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ కేసు విచారణకు రాగా ఆ మహిళకు 26 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. గతేడాది జూన్ లో ఆ చిన్నారి తండ్రి ఇలాంటి అభియోగాలతోనే 27 ఏళ్ల జైలు శిక్షకు గురయ్యాడు. చిన్నారితో పాటు ఆమె సోదరుడు అధికారుల సంరక్షణలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement