సాక్షి, చిత్తూరు : ఓ మానవ మృగం విచక్షణ మరిచింది. తన తమ భేదాలు చూడకుండా పశువులా ప్రవర్తించింది. మద్యం మత్తులో కన్నతల్లి జీవితాన్నే చిదిమేశాడు. సభ్యసమాజం తలదించుకునే ఘటన చిత్తూరు జిల్లా వి.కోటలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కోరిక తీర్చలేదని కన్నతల్లినే గొంతునులిమి కడతేర్చాడు ఓ కామాందుడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని కొంగాటం పంచాయతీ శివుని కుప్పానికి చెందిన బేల్లమ్మ(45)కు ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడైన సుబ్రమణ్యం (28) కూలి పనులు చేసుకుంటూ తాగుడుకు బానిసయ్యడు. రోజు మద్యం తాగి కుటుంబ సభ్యులు, స్థానికులతో గొడవకు దిగుతూ..దాడి చేసేవాడు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి తప్పతాగి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో మదం తలకెక్కి.. కన్న తల్లితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో గొంతునులిమి హత్య చేశాడు. ఈ విషయంతో స్థానికంగా సంచలనం సృష్టించింది. గ్రామస్తులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా నిందితుడు గతంలో తన చెల్లెలిపై కూడా ఆత్యాచార యత్నం చేసినట్లు గ్రామస్తులు ఆరోపించారు. మానవ మృగాన్ని అత్యంత కఠినంగా శిక్షించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment