![Minor Girl Molestation By Five People In Front Of Her Mother In Jharkhand - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/11/jharkhand.jpg.webp?itok=CnCiKkGg)
జార్ఖండ్: తల్లి కళ్ల ఎదుటే కూతురుపై ఐదుగురు దుండగులు అఘాయిత్యానికి తెగబడ్డారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని డియోఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...తల్లి కూతుళ్లు ఇద్దరు ఫంక్షన్‌కి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగిందని తెలిపారు. రెండు మోటారు సైకిళ్లపై ఐదుగురు దుండగులు వారిని అడ్డగించి కూతురుపై అఘాయిత్యానికి తెగబడ్డారని చెప్పారు.
తల్లి వారించేందుకు యత్నించిన ఆమెను తీవ్రంగా గాయపరిచి, బాలికపై అత్యాచారం చేసినట్లు వెల్లడించారు. బాదితురాలిని మెడికల్ పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు డియోఘర్ సూపరింటెండెంట్ పోలీసు సుభాష్ చంద్ర జాట్ తెలిపారు. ఈ మేరకు పోలీసులు బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోవడమే గాక నిందితులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మిగతా ముగ్గురు నిందితులు కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment