సాక్షి, తణుకు: కోడిపందేల రాయుళ్లకు న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది. జైలు శిక్ష, జరిమానా విధించింది. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లా తణుకు సర్కిల్ పరిధిలో కోడిపందేలు నిర్వహించిన 93 మందిని పోలీసులు సోమవారం కోర్టులో హాజరు పరిచారు. వీరికి న్యాయమూర్తి ఒకరోజు జైలుశిక్ష, రూ. 200 చొప్పున జరిమానా విధించించారు. నిందితులను తణుకు సబ్ జైలుకు పోలీసులు తరలించారు.
కోడిపందేలపై పోలీసులు దాడి
పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం మంగపతిదేవిపేట గ్రామంలో కోడిపందేలపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. రూ. 2010 నగదు, 2 కోళ్లు, 2 కత్తులును స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment