koyyalagudem
-
కొయ్యలగూడెం రోడ్ షో లో చంద్రబాబుకు నిరసన సెగ
-
పశ్చిమ గోదావరిలో చేతబడి కలకలం
-
అర్థరాత్రి దున్నపోతును బలి ఇచ్చి...
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని కొయ్యలగూడెం మండలం ఆరిపాటి దిబ్బలులో చేతబడి కలకలం రేపుతోంది. ఓ మహిళ చేతబడి చేస్తూ జామాయిల్ తోటలో దున్నపోతును బలిఇచ్చినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఒక బాలుడి బొమ్మని చిత్రీకరించి దాని ముందు గొయ్యి తవ్వి నిమ్మకాయలు, కుంకుమ, పసుపుతో క్షుద్రపూజలు చేశారు. దీంతో తీవ్ర భయభ్రాంతులకు గురైన గ్రామస్తులు గత మూడు రోజులుగా నిద్రాహారాలు లేకుండా గడుపుతున్నారు. క్షుద్రపూజలు చేసినట్లు భావిస్తున్న మహిళకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. తోటలోకి తీసుకెళ్లి సామాగ్రి అంతా కాల్చి తగులబెట్టారు. వారం రోజుల నుంచి గ్రామంలో చేతబడి జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఈ విషయం బయట పడింది. దున్నపోతు తల నరికి గొయ్యి తీసి పెట్టడంత, క్షుద్రపూజు చేసిన సామాగ్రిని గోతిలో పాతిపెట్టిన విషయాన్ని గ్రామస్తులు కనుగొన్నారు. చేతబడి కలకలం స్థానికులను భయానికి గురి చేస్తోంది. -
వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం
సాక్షి, బయ్యనగూడెం: తమ సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న పథకాల పట్ల నాయీ బ్రాహ్మణులు సంతృప్తి వ్యక్తం చేశారు. సెలూన్లకు ఏడాదికి రూ. 10 వేలు సాయంగా ఇవ్వాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అంతకుముందు సుబ్రహ్మణ్యస్వామి ఆలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. జై జగన్ నినాదాలతో ర్యాలీ హోరెత్తింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు పోతన తాతారావు, తుమ్మలపల్లి గంగరాజు, మీసాల సూర్యానారాయణ, కంభంపాటి బుజ్జిబాబు పాల్గొన్నారు. లింగుశెట్టి సురేశష్, లింగుశెట్టి అంజిబాబు, పొలకంపల్లి శ్రీనివాస్, మాధవరం సర్వారాయుడు, లింగుశెట్టి అప్పారావు తదితర నాయీ బ్రాహ్మణ నేతలు ర్యాలీకి హాజరయ్యారు. -
అది చిరుత కాదు హైనానే
సాక్షి, కొయ్యలగూడెం(పశ్చిమ గోదావరి) : గంగవరం అటవీ ప్రాంతంలో ఇటీవల చిరుతపులి తిరుగుతుందన్న వార్త కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అది చిరుతపులి కాదని హైనాగా అటవీశాఖాధికారులు నిర్ధారించారు. గత ఐదు రోజులుగా చిరుత సంచారం ప్రచారంతో గ్రామస్తుల్లో భయాందోళనలు గురయ్యారు. దీంతో అధికారులు పాదముద్రలు పరిశీలించి చిరుత లేదా హైనావి కావచ్చని నాల్రోజుల క్రితం చెప్పారు. అయితే ఏలూరు నుంచి తీసుకొచ్చిన సాంకేతిక పరికరాల సాయంతో ఆ పాదముద్రల్ని పరిశీలించి హైనావిగా నిర్ధారించారు. కన్నాపురం, ఏలూరు ఫారెస్ట్ సెక్షన్ అటవీశాఖాధికారులు, వైల్డ్ లైఫ్ సిబ్బందితో కలిసి హైనాను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇప్పటికే అటవీప్రాంతంలోని మారుమూల ప్రదేశంలో బోనులు ఏర్పాటు చేశామన్నారు. రెండు రోజులుగా అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో కొన్ని చోట్ల జంతువు పాదముద్రలను గుర్తించామని, త్వరలోనే పట్టుకుంటామని అధికారులు చెప్పారు. -
చంద్రబాబు తీరు దొంగే దొంగ అన్నట్టుగా ఉంది
-
ఎన్నికలను బహిష్కరించిన ‘కొయ్యలగూడెం’
చౌటుప్పల్ (మునుగోడు) : చేనేత వస్త్రాల తయారీకి పెట్టిన పేరుగా నిలిచిన మండలంలోని కొయ్యలగూడెం గ్రామం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలంతా కులమతాలు, వర్గ విభేదాలకు తావు ఇవ్వకుండా ఏకతాటిపై నిలిచారు. అందరు కలిసి తీసుకున్న నిర్ణయానికి కట్టుపడ్డారు. గతేడాది జరిగిన నూతన గ్రామపంచాయతీల విభజన సమయంలో కొయ్యలగూడెం గ్రామానికి అ న్యాయం జరిగిందని.. గ్రామపంచాయతీ ఎన్ని కలను బహిష్కరించాలని ఈనెల 7న నిర్ణయిం చారు. ఏ ఒక్కరూ కూడా పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనకుండా ప్రభుత్వానికి తమ నిరసనను తెలి యపర్చాలని తీర్మాణించారు. అధికారులు నచ్చజెప్పినా తలొగ్గకుండా పంతాన్ని నెరవేర్చుకున్నారు. చౌటుప్పల్ మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొయ్యలగూడెంలో ఆ గ్రామంతో పాటు ఎల్లంబావి, జ్యోతినగర్, గజ్జెలోనిబావి గ్రామాలు ఉండేవి. పంచాయితీ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారంగా 4600 జనాభా, 2837 మంది ఓటర్లు ఉండేవారు. గతేడాది ఈ గ్రామపంచాయతీ నుంచి ఎల్లంబావి, జ్యోతినగర్‌ను వేరు చేశారు. 1287 మంది జనాభా, 976 మంది ఓటర్లతో కలిపి నూతనంగా ఎల్లంబావి పేరిట గ్రామపంచాయతీని ఏర్పాటైంది. ముందుగా అధికారులు చేసిన మార్కింగ్ ప్రకారంగా కాకుండా అకస్మాత్తుగా మరో మార్కింగ్‌తో విభజించి గెజిట్‌ను పూర్తిచేశారు. ఇక అప్పటి నుంచి గ్రామస్తులు తమకు జరిగిన అన్యాయం గురించి అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రోజులు గడుస్తున్నాయో తప్ప ఫలితం మాత్రం దక్కలేదు. విభజనతో ఆగమైన కొయ్యలగూడెం.. విభజనతో కొయ్యలగూడెం గ్రామం పూర్వపు తన ఆనవాళ్లను కోల్పోయింది. గతేడాది మార్చిలో జరిగిన ప్రక్రియలో ఎల్లంబావికి 13–57, 701–705, 438, 441, 473, 708 సర్వే నంబర్లే కేటాయించాలి. కానీ ఆ తర్వాత జరిగిన తతంగంతో అధనంగా 10, 694, 695, 696, 697, 698, 699, 700 సర్వే నంబర్లను కేటాయించారు. 1,287 మంది జనాభా ఉన్న ఎల్లంబావికి 650ఎకరాలను కేటాయించారు. 2,313 మంది జనాభా కలిగిన కొయ్యలగూడెం గ్రామానికి మాత్రం 700 ఎకరాల రెవెన్యూని మాత్రమే కేటాయించారు. దీంతో కొయ్యలగూడెం గ్రామంలోనికి వెళ్లే ప్రధాన రహదారి, కొన్నేళ్లుగా వాడుకలో ఉన్న శ్మశాన వాటిక కూడా ఎల్లంబావి పరిధిలోకి వెళ్లింది. విఫలమైన అధికారుల ప్రయత్నాలు ఎన్నికల్లో గ్రామస్తులతో నామినేషన్లు వేయించేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఎవరికి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని కొంత మందికి బరోసా ఇచ్చారు. అందులో భాగంగా డి.నాగారం క్లస్టర్ వద్ద ఏసీపీ బాపురెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ చిల్లా సాయిలు, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఏదో జరుగుతుందని పసిగట్టిన కొయ్యలగూడెం గ్రామస్తులు ఎవరూ నామినేషన్లు వేయకుండా గస్తీ నిర్వహించారు. క్లస్టర్ వద్ద కాపుకాశారు. సాయంత్రం 5 గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొనడంతో గ్రామం నుంచి ఎలాంటి నామినేషన్ దాఖలవ్వలేదు. ప్రయత్నాలు విఫలమవ్వడంతో అధికారులు వెనుదిరిగారు. బహిష్కరించాలని నిర్ణయం.. తమకు జరిగిన అన్యాయంపై సుమారు 7 నెలలుగా గ్రామస్తులు పోరాడుతూనే ఉన్నారు. అయినా అటు ప్రభుత్వం, ఇటు అధికారులు, మరో వైపు ప్రజాప్రనిధులు కనీసం స్పందించలేదు. దీంతో తమ నిరసన తీవ్రస్థాయిలో ఉండాలని గ్రామస్తులంతా భావించారు. అందులో భాగంగా ఈనెల 7న సమావేశమై పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. ఆ మాటకు ప్రజలంతా కట్టుబడ్డారు. -
ఒక్క సర్వే రాయి వేసినా ఊరుకోం
కొయ్యలగూడెం: గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణ సర్వే పనుల్లో ఒక్క సర్వే రాయి పడినా సహించేది లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం రాజవరం స మీపంలో చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే సర్వే పనుల వద్ద నిరవధిక ఆందోళన చేస్తున్న రైతులకు ఆయన మద్దతు తెలిపి వారి సాధక బాధలు అడిగి తెలుసుకున్నారు. వందల ఎకరాల్లోని పచ్చని పంటలు కోల్పోతున్న రైతులకు న్యాయపరమైన మద్దతు ధరను ఇవ్వమనడం కూడా ప్రభుత్వానికి తప్పుగా కనిపిస్తోందని, రైతుల కడుపుకొట్టి చంద్రబాబు సర్కార్ కడుతున్న కట్టడాలు కూల్చివేస్తామని బాలరాజు పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్ విలువ ప్రకారం ప్రస్తుత మార్కెట్ విలువను అమలు చేసి దానికి రైతులు కోరుతున్న విధంగా నష్టపరిహారాన్ని అందజేయడానికి ప్రభుత్వానికి ఎందుకు అంత బాధ కలుగుతుందని ప్రశ్నించారు. సన్న, చిన్నకారు రైతులు అధికంగా జీవనాధారమైన భూములు కోల్పోతే వారి బతుకులు, కుటుంబాలు అధోగతిపాలవుతాయని బాలరాజు ఆందోళన వ్య క్తం చేశారు. ఈ సందర్భంగా మహిళా రైతులు సైతం తమ బాధలను బాలరాజు వద్ద మొరపెట్టుకున్నారు. అనంతరం బాలరాజు జాయింట్ కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేసేందుకు రావాల్సిందిగా కోరారు. దీంతో ఈనెల 16న రాజవరానికి వచ్చి బాధిత రైతులతో బహిరంగ చర్చావేదికను నిర్వహిస్తామని జేసీ పేర్కొన్నారు. మండల కన్వీనర్ గొడ్డటి నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు మట్టా శ్రీను, దాసరి విష్ణు, మైనార్టీసెల్ జిల్లా కార్యదర్శి ఎస్కే బాజీ, మాజీ సర్పంచ్ పాముల నాగ మునిస్వామి, వైఎస్సార్సీపీ నాయకులు కె.సూరిబాబు, బల్లె నరేష్, చింతలపూడి కిషోర్, గద్దే సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
కులాన్ని తిట్టినా కోపం రావడం లేదా : పవన్ కల్యాణ్
సాక్షి, పశ్చిమగోదావరి : కొయ్యలగూడెం బహిరంగసభలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ నాయకులపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆడపడుచులు, మహిళలు, పోలీసులు, 85 ఏళ్ల వృద్ధులను కొడుతూ, కులం పేరుతో దూషించే నాయకులకు ప్రజలను పాలించే అర్హత లేదన్నారు. ‘జవహర్ నీ కులాన్ని తిడితే నీకు కోపం రావడం లేదేమో.. నాకు వస్తోంది’ అని ఏపీ ఎక్సైజ్‌శాఖ మంద్రి కేఎస్ జవహర్‌ను ఉద్దేశించి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులు దళితులపై ఆనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. (చింతమనేని అనుచరుల హల్చల్) భయపడి ఎన్నికలు పెట్టడం లేదు... ‘కొయ్యలగూడెంలో ఒక్క డిగ్రీ కాలేజీ కుడా లేదు. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే జనసేన గ్రామాల్లో పాతుకు పోతుందనే భయం చంద్రబాబును పట్టుకుంది. నేను ముఖ్యమంత్రి అవటానికి రాలేదు. పోరాటం చేయడానికి వచ్చా’ అని పవన్ చెప్పారు. ప్రాజెక్టుల కోసం త్యాగం చేసిన నిర్వాసితులకు రాళ్ల భూములు, నీటి సౌకర్యం లేని భూములు, నాణ్యత లేని గృహాలు అంటగడుతున్నారని పవన్ ధ్వజమెత్తారు. -
షాక్: కోడిపందేల రాయుళ్లకు జైలు
సాక్షి, తణుకు: కోడిపందేల రాయుళ్లకు న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది. జైలు శిక్ష, జరిమానా విధించింది. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లా తణుకు సర్కిల్ పరిధిలో కోడిపందేలు నిర్వహించిన 93 మందిని పోలీసులు సోమవారం కోర్టులో హాజరు పరిచారు. వీరికి న్యాయమూర్తి ఒకరోజు జైలుశిక్ష, రూ. 200 చొప్పున జరిమానా విధించించారు. నిందితులను తణుకు సబ్ జైలుకు పోలీసులు తరలించారు. కోడిపందేలపై పోలీసులు దాడి పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం మంగపతిదేవిపేట గ్రామంలో కోడిపందేలపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. రూ. 2010 నగదు, 2 కోళ్లు, 2 కత్తులును స్వాధీనం చేసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
పశ్చిమ గోదావరి జిల్లా / కొయ్యలగూడెం: లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాలను బలితీసుకుంది మరో వ్యక్తి చావుబతుకుల్లో ఉన్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కొయ్యలగూడెం సమీపంలోని బ్రహ్మాల కాలనీ వద్ద బైక్‌ను లారీ ఢీకొన్న ఘటనలో శీలం సత్యవతి (45) మృతి చెందింది. ఆమె భర్త శీలం రెడ్డియ్య తలకు తీవ్ర గాయమై విషమ పరిస్థితిలో ఉన్నాడు. నల్లజర్ల మండలం చోడవరానికి చెందిన భార్యాభర్తలు రెడ్డియ్య, సత్యవతి కుమారుడితో కలిసి కొయ్యలగూడెం మండలం సరిపల్లిలో శనివారం మధ్యాహ్నం వివాహ రిసెప్షన్‌కు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న లారీ మరొక లారీని ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న రెడ్డియ్య బైక్‌ను ఢీకొంది. దీంతో సత్యవతి అదుపు తప్పి లారీ చక్రాల కింద పడింది. రెడ్డియ్య బైక్‌పై నుంచి అదుపు తప్పి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. కొడుకు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రెడ్డియ్యను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి ఏలూరుకు మెరుగైన వైద్యం కోసం తరలించారు. రెడ్డియ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు ఎస్సై సూర్యభగవాన్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్టీఆర్ గృహలబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు
-
తెల్లవార్లూ కోడిపందేలు
జంగారెడ్డిగూడెం : సంక్రాంతి పండుగ సందర్భంగా నాలుగో రోజు రాత్రి ప్రారంభమైన కోడిపందేలు తెల్లవార్లూ పెద్దెత్తున ఫ్లడ్‌లైట్ల వెలుతురులో యథేచ్ఛగా సాగాయి. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం తదితర మండలాల్లో మంగళవారం తెల్లవారుజాము వరకు కోడిపందాలు నిర్వహిస్తూనే ఉన్నారు. కొన్ని కోడిపందాల వద్దకు పోలీసులు వెళ్లినా కోడిపందాల నిర్వాహకులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో పోలీసులు వెనుదిరగాల్సి వచ్చింది. మంత్రులు, ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో ఈ పందాలు నిర్వహించినట్టు సమాచారం. గతంలో భోగి, సంక్రాంతి, కనుమ రోజు మాత్రమే నిర్వహించేవారు. ఈ ఏడాది మాత్రం ముక్కమనాడు కూడా పందేలు నిర్వహించడం విశేషం. -
జంగారెడ్డిగూడెం జట్టు జయకేతనం
కొయ్యలగూడెం : జిల్లా ఫుట్‌బాల్ అసోసియేష న్ కోటగిరి విద్యాధరరావు ఫౌండేష న్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం కొయ్యలగూడెంలో ఫ్లో(ఫుట్‌బాల్ లీగ్ ఆఫ్ వెస్ట్ గోదావరి)–2017 మ్యాచ్ నిర్వహించారు. జంగారెడ్డిగూడెం– నరసాపురం జట్లు హోరాహోరీగా ఈ ఈ మ్యాచ్‌లో తలపడ్డాయి. చివరకు జంగారెడ్డిగూడెం జట్టు 1–0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. 1.30 గంటల వ్యవధిలో ఏ ఒక్క జట్టు కూడా గోల్ సాధించలేకపోవడంతో ఆటను అర్ధ గంట పాటు పొడిగించడం విశేషం. విశాఖపట్నానికి చెందిన జంగారెడ్డిగూడెం జట్టులోని సభ్యుడు పవ న్ ఆట ఆఖరి నిమిషంలో గోల్ సాధించి విజయాన్ని చేకూర్చాడు. టోర్నీ నిర్వాహకులు ఫౌండేష న్ వ్యవస్థాపకుడు కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ మ్యాచ్‌ను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. మొత్తం 15 లీగ్‌మ్యాచ్‌లో భాగంగా 9వ మ్యాచ్ కొయ్యలగూడెంలో నిర్వహించామని ఫ్లో సీఈవో ఆర్.రాజేష్ రావూరి, జిల్లా ఫుట్‌బాల్ కార్యదర్శి బెల్లంకొండ సుబ్బారావులు తెలిపారు. 16న పాలకొల్లు, 17న నరసాపురంలో సెమీ ఫైనల్స్, 18న ఏలూరులో ఫైనల్స్ జరపనున్నామని తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు తెల్లం బాలరాజు, ఏఎంసీ చైర్మపి.రామారావు, అఫెడా మాజీ డైరెక్టర్ గొడవర్తి విద్యాసాగర్ పాల్గొన్నారు. -
స్కూల్ బస్సును ఢీకొన్న కారు
కొయ్యలగూడెం : ఓ స్కూల్ బస్సును గురువారం కారు ఢీకొట్టింది. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. గవరవరం గ్రామానికి చెందిన అగ్జీలియం స్కూల్ బస్సు యర్రంపేట నుంచి స్కూల్‌కు వస్తుండగా.. మేఘలాదేవినగర్ వద్ద విద్యార్థులను ఎక్కించుకునేందుకు ఆగింది. దీనిని వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో కారులోని ముగ్గురికి స్వల్ప గాయలయ్యాయి. కారు ముందుభాగం దెబ్బతింది. స్కూల్ బస్సుకు, అందులోని విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అగ్జీలియం సిబ్బంది తెలిపారు. -
'టాలెంట్‌తో పాటు అదృష్టం ఉండాలి'
సినీహీరో సాయి కిరణ్ కొయ్యలగూడెం : సినిమాల్లో హీరోగా రాణించడానికి టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా తోడు ఉండాలని, ముఖ్యంగా తెలుగు చలన చిత్రసీమలో ఇది చాలా అవసరం అని సినీ హీరో విస్సంరాజు సాయికిరణ్ అన్నారు. సోమవారం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో డాక్టర్ దిలీప్ కుమారుడి పుట్టినరోజు వేడుకలకు సినీ హాస్య నటుడు ఆకెళ్ల గోపాలకృష్ణతో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయికిరణ్ మాట్లాడుతూ డాక్టర్ దిలీప్‌కుమార్ తాను క్లాస్మేట్స్ అని, తమ మిత్రత్వం కారణంగా చెన్నై నుంచి నేరుగా కొయ్యలగూడానికి గోపాలకృష్ణతో కలిసి వచ్చానని చెప్పారు. తమిళంలో రమ్యకృష్ణ ప్రధాన పాత్రగా నిర్మితమవుతున్న చిత్రంలో తాను ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. నందికొండ, మారాజు, తొలికిరణం తదితర తెలుగుచిత్రాల్లో నటిస్తున్నట్టు తెలిపారు. తన తండ్రి ప్రఖ్యాత గాయకుడు రామకృష్ణకు స్వర్గీయ నందమూరి తారకరామారావు అందించిన చేయూత వల్ల విఖ్యాత గాయకునిగా ఎదిగారని సాయికిరణ్ పేర్కొన్నారు. ప్రముఖ హీరో రవితేజను ఆదర్శంగా తీసుకుని తనవంతు కృషిచేస్తున్నానని నేటి యువతకు తగ్గట్టు శరీర సౌష్టవాన్ని మార్చుకుని హీరోగా స్థిరపడాలని శ్రమిస్తున్నట్టు చెప్పారు. ఇటీవల ఒక సినిమా నిర్మాణంలో తనకు ప్రమాదం సంభవించడంతో మెడకు తీవ్ర గాయమైందని, దాని వల్ల కొంత విరామం వచ్చినట్టు చెప్పారు. యోగా, మెడిటేషన్ వల్ల పూర్తిగా కోలుకోగలిగినట్టు చెప్పారు. తాను నటించిన చిత్రాల్లో సత్తా, ప్రేమించు చిత్రాలు తనకు బాగా ఇష్టమని పేర్కొన్నారు. ప్రస్తుతానికి టీటీడీ దేవస్థానం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక టెలీఫిలింలు ఎక్కువగా చేస్తున్నట్టు చెప్పారు. కళలకు పుట్టినిల్లు గోదావరి జిల్లాలు అని అన్నారు. హాస్యనటులు ఆకెళ్ల గోపాలకృష్ణ మాట్లాడుతూ ఇప్పటివరకు 52 తెలుగు చలన చిత్రాల్లో నటించినట్టు చెప్పారు. సోగ్గాడే చిన్నినాయనా, రాజా చెయ్యివేస్తే చిత్రాల్లో మంచి పేరు వచ్చిందన్నారు. అనంతరం నటులిద్దరినీ డాక్టర్ దిలీప్‌కుమార్ దంపతులు ఘనంగా సత్కరించి మెమొంటోలు అందించారు. -
ఆమెను చూస్తే.. ‘అవ్వా’క్కవుతారు..!
వందేళ్ల వయసులోనూ చురుగ్గా ఓ బామ్మ నా అన్నవాళ్లు లేకపోయినా ధైర్యంగా జీవిస్తోన్న వైనం మనం చదివిన చిన్నప్పటి కథల్లో పేదరాసి పెద్దమ్మ గుర్తుందా? ఇంచుమించు అలాగే ఒక బామ్మ బ్రిటీషు వారి కాలం నాటి సంగతులను గడగడా చెప్పేస్తోంది. కాలనుగుణంగా మారిన ఆహారపు అలవాట్లును వివరిస్తోంది. సుమారు 100 సంవత్సరాల వయసు కలిగిన ఈ బామ్మ ఉత్సాహం చూస్తే మనం ఆశ్చర్యపోతాం. అన్నట్టూ ఇంకోమాట! ముత్తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన ఇంటిలోనే ఈమె చాన్నాళ్లుగా ఒంటరిగా జీవిస్తోంది. ఆమె చెప్పిన ఆనాటి సంగతులకు ఊకొడతారో.. లేక అవాక్కవుతారో అంతా మీ ఇష్టం. - కొయ్యలగూడెం బుట్టాయగూడెం మండలంలోని మారుమూల గిరిజన గ్రామం ఉప్పరిల్లలో వేట్ల చిన్నమ్మ ఒక్కామె నివసిస్తోంది. సమీప గిరిజనులు ఈమెను ముని అవ్వ అని పిలుస్తుంటారు. పోలవరం మండలం గడ్డపల్లి తన స్వగ్రామమని 9వ ఏటనే వివాహం జరగడంతో ఉప్పరిల్లకు వచ్చి స్థిరపడ్డట్టు చిన్నమ్మ తెలిపింది. అదే సమయంలోని మండలంలోని పులిరామన్నగూడెం, చింతపల్లి గ్రామాల్లో తెల్ల దొరలు వేసవి విడిది కోసం బంగ్లాలు(భవంతులు) కట్టించుకున్నారని చెప్పింది. ప్రస్తుతం పూర్తిగా శిథిలమైన ఆ భవంతుల గోడపై 1920లో నిర్మాణం జరిగినట్టు రాసి ఉంది. ఈ లెక్కన చూస్తే ఆమె వయసు 100 పైనే అని గిరిజనులు చెబుతున్నారు. ఆ రోజుల్లో వరి అన్నం ఎక్కడుంది ! వేట్ల చిన్నమ్మ 40 సంవత్సరాల వయసు వరకు తెల్లకూడు(వరి అన్నం) తెలియదని పేర్కొంది. వెదురు బియ్యం, చేమ దుంపలతో పాటు ఇతర అడివి దుంపలను తన భర్త తీసుకువస్తే వాటిని వండి ఇద్దరం తినేవారమని చెప్పింది. అదేవిధంగా కాలానుగుణంగా వచ్చే కాయలలోని గింజలను వలిచి ఉడకబెట్టి తింటానని తెలిపింది. చింతపిక్కలు, సీతాఫల గింజలు, తంగేడి గింజలు, మారేడు కాయలతో పాటు అడవి మామిడి కాయలను, టెంకలను వండుకుని తింటామని, జీలుగుకల్లు సేవిస్తామని చెప్పింది. తన భర్త, కొడుకులు, కూతుళ్లు అంతా తన కళ్ల ముందే కాలం చేసినా మొక్కవోని ధైర్యంతో జీవనం సాగిస్తున్న చిన్నమ్మ నాటి కాలానికి సాక్షంగా మిగిలింది. -
ఆరు నెలల క్రితమే వివాహం...
కొయ్యలగూడెం : మండలంలోని కన్నాపురం దళితవాడకు చెందిన ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన యడ్లపల్లి నాగలక్ష్మి(18)ని కన్నాపురానికి చెందిన గోపి అనే వ్యక్తికి ఇచ్చి ఆరు నెలల క్రితం వివాహం చేశారు. మూడు నెలల క్రితం నాగలక్ష్మికి గర్భస్రావం జరిగింది. దీనిపై గోపి తల్లీదండ్రులు, కుటుంబసభ్యులతో నాగలక్ష్మికి తరచూ గొడవ చోటు చేసుకునేది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో నాగలక్ష్మి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి దుర్గయ్యకు గోపి కుటుంబ సభ్యులు ఫోన్లో సమాచారం అందించారు. అయితే తన కుమార్తె మృతి వెనుక అనుమానాలు ఉన్నాయని, అత్తమామలు, భర్త గోపి నాగలక్ష్మి మృతికి కారణమని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దుర్గయ్య పేర్కొన్నాడు. మంగళవారం ఉదయం సీఐ బాలరాజు, ఎసై్స పి.చెన్నారావులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టంకు పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నల్లగొండలో చేనేత అభివృద్ధి కమిషనర్ పర్యటన
చౌటుప్పల్: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో 31 చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జాతీయ చేనేత అభివృద్ధి కమిషనర్ అలోక్‌కుమార్ వెల్లడించారు. ఇందుకోసం రూ.2 కోట్ల చొప్పున కేటాయింపులు జరిగాయని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని చేనేత మగ్గాలను పరిశీలించారు. వస్త్రాల తయారీని స్వయంగా చూసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
కొయ్యలగూడెంలో మారిషస్ మంత్రి పర్యటన
చౌటుప్పల్: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామాన్ని మారిషస్ దేశ ఆర్థిక, సామాజిక మంత్రి పృథ్వీరాజ్‌సింగ్ రూపేన్ శుక్రవారం సందర్శించారు. గ్రామంలోని చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో తయారవుతున్న వస్త్రాలను పరిశీలించారు. కార్మికుల సమస్యల గురించి తెలుసుకున్నారు. మారిషస్‌లో చేనేత వస్త్రాల అమ్మాకానికి కృషి చేస్తామని అన్నారు. అనంతరం స్థానిక మహిళా సంఘాల సభ్యులతో సమావేశమై, వాటి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఆర్డీఏ పీడీ సుధాకర్, మరో ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నారు. -
అచ్చమైన మిథునం
ఇటీవల ఓ వృద్ధ జంట జీవితాన్ని వెండితెరపై ‘మిథునం’ పేరిట అందమైన కావ్యంగా ఆవిష్కరించారు తనికెళ్ల భరణి. అటువంటి అచ్చమైన జంట స్థానికంగా ఒకరికిఒకరై తోడుగా జీవనం సాగిస్తున్నారు. తొమ్మిది పదుల వయసులోనూ చెక్కు చెదరని అనుబంధంతో మెలుగుతున్నారు. ఈ ఆదర్శ దంపతుల జీవితం... నిజ జీవిత మిథునం. ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం పాత లైబ్రరీ భవనం పక్కన 95 ఏళ్ల జొరిగే ముత్యాలు, 85 ఏళ్ల భార్య దుర్గమ్మ మేదర వృత్తే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి సాగనంపారు. కుమారులెందరో పుట్టి మరణించడంతో ఓ బాలుడ్ని పెంచుకున్నారు. రెక్కలొచ్చాక ఆ బిడ్డకు ఎగిరిపోయాడు. దీంతో వృద్ధ దంపతులిద్దరూ ఒకరికి ఒకరై 60 ఏళ్లుగా పోలవరం మెయిన్‌రోడ్డుకి ఆనుకుని ఉన్న ఇంట్లో జీవించేవారు. రహదారి విస్తరణలో ఈ ఇల్లు కూడా పోవడంతో చిన్న గుడారం ఏర్పాటు చేసుకుని కాలం వెళ్ల దీస్తున్నారు. భర్తకు స్నానం చేయించడంతో పాటు అన్నం తినిపించడం వంటి అన్ని పనులు భార్య దుర్గమ్మ చేస్తుంది. భర్త బుట్టలు అల్లుతుంటే సాయం అంది స్తుంది. ఆర్థికంగా ఎటువంటి ఆధారం లేకపోయినా ఈ జంట ఆనందంగా జీవనం సాగిస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి!
-
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
కొయ్యలగూడెం: పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం సీతంపేట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఆగివున్న లారీని మినీట్రావెల్ బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. అన్నవరం నుంచి తిరువూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. -
70 ఇయర్స్ ఇండస్ ‘ట్రీ’
ఆ దారి వెంట వెళ్తే చాలు... గొడుగు పట్టినట్టు నీడ పరచుకుంటుంది. పచ్చని పసరు వాసన శ్వాసనాళాల్ని శుభ్రం చేస్తుంది. చల్లని గాలి ఒళ్లంతా పెనవేసుకుంటుంది. ఆహ్లాదకరమైన అనుభవం ఆనందాన్ని మిగులుస్తుంది. ఆ ఘనత శాఖోపశాఖలుగా విస్తరించిన కొన్ని మహావృక్షాలకు దక్కుతుంది. డెబ్భయ్యేళ్ల క్రితం నాటిన మొక్కలు వటవృక్షాలుగా ఎదిగాయి. గత చరిత్రకు సాక్ష్యంగా నిలిచాయి. కొయ్యలగూడెం మీదుగా ప్రయాణించే వారికి నడిబొడ్డున ప్రధాన సెంటర్‌ను ఆనుకున్న సువిశాల ప్రాంతంలో విస్తరించిన వటవృక్షం కనిపిస్తుంది. రూ.కోట్ల విలువైన పోలీస్ స్టేషన్ మైదానంలో ఈ భారీ వృక్షం సహా ఇతర వృక్షాలు పచ్చదనంతో పరవశింపజేస్తున్నాయి. ప్రస్తుతం కొయ్యలగూడెంలో ప్రధాన కేంద్రాలైన చెక్‌పోస్ట్, గణేష్ సెంటర్ల మధ్య నాలుగు ఎకరాల విస్తీర్ణంలో పోలీస్ స్టేషన్ ఉంది. దీని వెనుకే మహావృక్షాలుగా ఎదిగిన మర్రి, వేప, గానుగ, రావిచెట్లు ఉన్నాయి. వీటి వెనుక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. ఈ ప్రాంతానికి చెందిన వృద్ధుడు కొల్లూరు పండు గెరటయ్య అందించిన వివరాల ప్రకారం 1945-46 మధ్యకాలంలో మన్యంలో పెద్దపులిని వేటాడిన ఓ కోయదొరను గ్రామానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేటాడిన పులిని, కోయదొరను అప్పటి జమిందారు ఎర్ర గెరటయ్య ఎద్దుల బండిపై వెంట తీసుకొచ్చారు. పులిని చూసిన ఎద్దులు కాడి వదిలి పరుగు తీశాయి. దీంతో ఎడ్ల కళ్లకు గంతలు కట్టి బండిపై పులిని వేసుకుని ప్రస్తుతం చెట్లున్న ప్రాంతంలో ప్రదర్శించారు. ఆ సమయంలో ప్రస్తుతం కొయ్యలగూడెం అభివృద్ధి చెందకపోవడంతో నిర్మానుష్యంగా ఉండేది. ప్రస్తుత పోలీస్ స్టేషన్‌ను పోలవరం రోడ్‌లోని మాటూరి పంచాక్షరికి చెందిన పెంకుటింట్లో నిర్వహించేవారు. పెద్దపులిని వేటాడినట్టు తెలిసిసమీప గ్రామాల్లోని వందలాది ప్రజలు చూట్టానికి వచ్చారు. అది తెలిసిన అప్పటి బ్రిటిష్ కలెక్టర్ కొయ్యలగూడెంను సందర్శించారు. రెండ్రోజుల తర్వాత కోయదొరను జమిందార్లు ఘనంగా సన్మానించారు. ఇందుకు గుర్తుగా బ్రిటిష్ కలెక్టర్, జమిందార్లయిన కొల్లూరు ఎర్ర గెరటయ్య, కొల్లూరు వెంకటరత్నం, అంకాలగూడెం మునసబు గంటా జానకి రామయ్య, కన్నాపురానికి చెందిన గెడా గెరటయ్య ఈ మొక్కల్ని నాటారు. మొక్కలు నాటే ఆనవాయితీని సుమారు 70 ఏళ్ల క్రితమే మన పూర్వీకులు అందించారన్నమాట. - కొయ్యలగూడెం -
కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన సవతి తండ్రి
కొయ్యలగూడెం :కూతురిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడంటూ జంగారెడ్డిగూడెం రోడ్డులోని 8వ వార్డులో నివాసం ఉంటున్న ఓ వ్యక్తిపై చైల్డ్ లైన్ జిల్లా కో-ఆర్డినేటర్ ఆల్ఫ్రెడ్ జేవియర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం రోడ్డులో ఎస్బీఐ బ్రాంచి సమీపంలో వెల్డింగ్ షాపు యజమాని పంపాని శేషగిరి 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేస్తున్నట్టు పేర్కొన్నారు. షాపు యజమాని తాడేపల్లిగూడెంలో నివసించే సమయంలో సుబ్బమ్మ అనే మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉండేవాడని, ఎనిమిది నెలల క్రితం ఆమె మరణించడంతో ఆమె కుమార్తె, కుమారుడిని కొయ్యలగూడెం తీసుకువచ్చి ఓ అద్దె ఇంటిలో ఉంచినట్టు కో-ఆర్డినేటర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కుమారుడిని తన వెల్డింగ్ షాపులోనే పనికి పెట్టి నిందితుడు తరచూ ఇంటికి వెళ్లి కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడన్నారు. ఈ విషయం స్థానికులు చైల్డ్‌లైన్ సెంటర్‌కు నాలుగు రోజుల క్రితం తెలిపారని, దీంతో చైల్డ్ లైన్ సిబ్బంది కొయ్యలగూడెం వచ్చి అద్దె ఇంటిలో ఉంచిన కుమార్తె వద్దకు వెళ్లి విచారించారన్నారు. ఈ నేపథ్యంలో కుమార్తె కన్నీళ్ల పర్యంతమై తనకు జరుగుతున్న ఘోరాన్ని వివరించింది. చైల్డ్‌లైన్ కేర్ సిబ్బంది బి.నరేంద్ర, ఎస్.రవిబాబు, ఎస్.సునీత పాల్గొన్నారు. దీనిపై ఎస్సై ఎస్ఎస్ఆర్ గంగాధర్ మాట్లాడుతూ నిందితుడు పంపాని శేషగిరి సుబ్బమ్మకు రెండవ భర్తగా వ్యవహరించాడని, ముందు భర్త పిల్లలు కావడం చేత ఇరువురిపై వేధింపులకు పాల్పడేవాడని తెలిపారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.