స్కూల్ బస్సును ఢీకొన్న కారు
కొయ్యలగూడెం : ఓ స్కూల్ బస్సును గురువారం కారు ఢీకొట్టింది. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. గవరవరం గ్రామానికి చెందిన అగ్జీలియం స్కూల్ బస్సు యర్రంపేట నుంచి స్కూల్‌కు వస్తుండగా.. మేఘలాదేవినగర్ వద్ద విద్యార్థులను ఎక్కించుకునేందుకు ఆగింది. దీనిని వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో కారులోని ముగ్గురికి స్వల్ప గాయలయ్యాయి. కారు ముందుభాగం దెబ్బతింది. స్కూల్ బస్సుకు, అందులోని విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అగ్జీలియం సిబ్బంది తెలిపారు.