గంగవరం అటవీ ప్రాంతంలో హైనా వేలిముద్రలు పరిశీలిస్తున్న అటవీ అధికారులు
సాక్షి, కొయ్యలగూడెం(పశ్చిమ గోదావరి) : గంగవరం అటవీ ప్రాంతంలో ఇటీవల చిరుతపులి తిరుగుతుందన్న వార్త కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అది చిరుతపులి కాదని హైనాగా అటవీశాఖాధికారులు నిర్ధారించారు. గత ఐదు రోజులుగా చిరుత సంచారం ప్రచారంతో గ్రామస్తుల్లో భయాందోళనలు గురయ్యారు. దీంతో అధికారులు పాదముద్రలు పరిశీలించి చిరుత లేదా హైనావి కావచ్చని నాల్రోజుల క్రితం చెప్పారు.
అయితే ఏలూరు నుంచి తీసుకొచ్చిన సాంకేతిక పరికరాల సాయంతో ఆ పాదముద్రల్ని పరిశీలించి హైనావిగా నిర్ధారించారు. కన్నాపురం, ఏలూరు ఫారెస్ట్ సెక్షన్ అటవీశాఖాధికారులు, వైల్డ్ లైఫ్ సిబ్బందితో కలిసి హైనాను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇప్పటికే అటవీప్రాంతంలోని మారుమూల ప్రదేశంలో బోనులు ఏర్పాటు చేశామన్నారు. రెండు రోజులుగా అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో కొన్ని చోట్ల జంతువు పాదముద్రలను గుర్తించామని, త్వరలోనే పట్టుకుంటామని అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment