ముంబై : పూణే జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చిరుత దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతిని జిల్లా అటవీ శాఖ అధికారులు అధికారంగా ధ్రువీకరించారు
పూణేలోని షిరూర్ తాలూకా పింపల్సుతి గ్రామానికి చెందిన రక్ష నిఖమ్ (4) ఇంట్లో ఆడుకుంటుంది. ఆ సమయంలో అకస్మాత్తుగా వచ్చిన చిరుత చిన్నారిని నోట కరుచుకుని స్థానిక చెరుకు తోటల్లోకి తీసుకెళ్లింది. చిరుత పులి రాకను గమనించిన తల్లి కాపాడండి అంటూ కేకలు వేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది రక్ష కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
రెండు గంటల పాటు గాలింపు చర్యల అనంతరం చెరుకు తోటలో చిన్నారి జాడ దొరికింది. చిన్నారిపై చిరుత తీవ్రంగా దాడి చేసింది. ఈ దాడితో బాలిక తల,మొండెం వేర్వేరుగా కనిపించాయని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జున్నార్ ఫారెస్ట్ డివిజన్ అధికారి మితా రాజ్‌హన్స్ మాట్లాడుతూ బాలికపై దాడి చేసిన చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment