
పోలీసుల సాక్షిగా ఒక్కటైన ప్రేమజంట
కుంతలగూడెం (కొయ్యలగూడెం) : వివాహం చేసుకోవడానికి పెద్దలు అంగీకరించక పోవడంతో పోలీసుల సాక్షిగా స్టేషన్ ఎదుట ఆదివారం రాత్రి ఒక ప్రేమజంట దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. యర్రంపేట పంచాయతీ శివారు గ్రామం కుంతలగూడెంకు చెందిన బొల్లిపో సత్తిపండు, గెడ్డం సౌజన్య కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి సత్తిపండు పెద్దలు అంగీకరించపోవడంతో వారు బీజేపీ మండల నాయకుడు కొమనారపు సుబ్బారావును కలవగా, ఆయన సౌజన్య చిన్నాన్న అబ్బులును తీసుకుని పోలీసులను ఆశ్రయించాడు. ప్రేమికులు ఇద్దరూ డిగ్రీ విద్యార్థులు కావడంతో, మేజర్లుగా గుర్తించి ఎస్సై గంగాధర్ ఇరు కుటుంబాలకు రాజీ కుదర్చడానికి ప్రయత్నించారు. సత్తిబాబు పెద్దలు అంగీకరించకపోవడంతో రిజిస్ట్రార్ ఆఫీసులో వివాహం చేసుకోవాలని ఎస్సై సూచించారు. అనంతరం ప్రేమికులు ఇద్దరు స్టేషన్ ఎదుట దండలు మార్చుకుని ఒక్కటయ్యారు.