మాజీ ఎంపీటీసీ కుమారుడి కిడ్నాప్ కలకలం | Naxals kidnap Businessman in west godavari district | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీటీసీ కుమారుడి కిడ్నాప్ కలకలం

Published Fri, Aug 1 2014 10:08 AM | Last Updated on Thu, Jul 11 2019 8:38 PM

మాజీ ఎంపీటీసీ కుమారుడి కిడ్నాప్ కలకలం - Sakshi

మాజీ ఎంపీటీసీ కుమారుడి కిడ్నాప్ కలకలం

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురంలో టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ కుమారుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కుమారుడు  హరినాథ్ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారనే వదంతులు వ్యాపించాయి. వారు డబ్బు డిమాండ్ చేయటంతో మాజీ ఎంపీటీసీ గురువారం జంగారెడ్డి గూడెం వెళ్లి వారికి రూ.10 లక్షలు ముట్టచెప్పినట్లు సమాచారం. అయినా కిడ్నాపర్లు అతడిని విడిచి పెట్టకపోవటంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కొయ్యలగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కిడ్నాప్కు గురైన హరినాథ్ పలు వ్యాపారాలు నిర్వహిస్తుండగా... అతడిని జూలై 28న  ఖమ్మం జిల్లా మందలపల్లి వద్ద అపహరణకు గురయ్యాడు. అయితే అతడిని కిడ్నాప్ చేసింది మావోయిస్టులా... లేక నకిలీలా ...వ్యాపారానికి సంబంధించిన బకాయిదారులా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఓ ఫైనాన్స్ వ్యాపారి కుమారుడు హరినాథ్ను దుండగులు వారం క్రితం అపహరించుకు వెళ్లారు. అతడిని విడిచిపెట్టాలంటే పెద్ద మొత్తంలో నగదు ముట్టచెప్పాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. దాంతో హరినాథ్ కుటుంబ సభ్యులు రూ.10 లక్షలు ముట్టచెప్పారు. అయినా కిడ్నాపర్లు హరినాథ్ను విడిచి పెట్టకపోవటంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కొయ్యలగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కిడ్నాపర్ల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement