వైఎస్సార్‌ విగ్రహానికి పాలాభిషేకం | Palabhishekam to YSR Statue At Bayyana Gudem | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ విగ్రహానికి పాలాభిషేకం

Published Sat, Jul 27 2019 2:59 PM | Last Updated on Sat, Jul 27 2019 3:03 PM

Palabhishekam to YSR Statue At Bayyana Gudem - Sakshi

సాక్షి, బయ్యనగూడెం: తమ సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న పథకాల పట్ల నాయీ బ్రాహ్మణులు సంతృప్తి​ వ్యక్తం చేశారు. సెలూన్లకు ఏడాదికి రూ. 10 వేలు సాయంగా ఇవ్వాలని సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో వైఎస్సార్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అంతకుముందు సుబ్రహ్మణ్యస్వామి ఆలయం నుంచి వైఎస్సార్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. జై జగన్‌ నినాదాలతో ర్యాలీ హోరెత్తింది.

ఈ కార్యక్రమంలో వైఎ‍స్సార్‌ సీపీ నాయకులు పోతన తాతారావు, తుమ్మలపల్లి గంగరాజు, మీసాల సూర్యానారాయణ, కంభంపాటి బుజ్జిబాబు పాల్గొన్నారు. లింగుశెట్టి సురేశష్‌, లింగుశెట్టి అంజిబాబు, పొలకంపల్లి శ్రీనివాస్‌, మాధవరం సర్వారాయుడు, లింగుశెట్టి అప్పారావు తదితర నాయీ బ్రాహ్మణ నేతలు ర్యాలీకి హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement