
ఆమెకు థాయ్‌లాండ్ గవర్నమెంట్ 43 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. ఇంతకీ ఆమె చేసిన ఘోరనేరం ఏమిటి? థాయ్ రాచకుటుంబాన్ని తిట్టిందంతే! ఈ మాత్రం దానికే అంత శిక్షా! అంటే ‘అక్కడంతే..అక్కడంతే’ అనే ఆన్సర్ తప్ప ఏదీ వినిపించదు. 63 సంవత్సరాల అంచన్ రాజకుటుంబాన్ని తిట్టి అట్టి వీడియోను సోషల్ మిడియాలో వదిలింది. అదే ఆమె చేసిన పాపం అయింది.
ప్రపంచంలోనే పెద్దదయిన హైస్పీడ్ రైల్‌నెట్ వర్క్‌కు చైనా పెట్టింది పేరు. తాజాగా జియోటోంగో యూనివర్శిటీ శాస్త్రవేత్తలు సరికొత్త హై స్పీడ్ రైలును ప్రవేశపెట్టారు. విశేషం ఏమిటంటే ఈ రైలుబండికి చక్రాలు ఉండవు. హై–టెంపరేచర్ సూపర్‌కండక్టింగ్ (హెచ్‌టీఎస్) సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఈ మాగ్నెటిక్ లెవిటేషన్ ట్రైన్ గంటకు 620 కి.మీలు ప్రయాణం చేస్తుంది. అంటే హైదరాబాద్ నుంచి ముంబైకి గంటలో వెళ్లవచ్చు. గంటలో రావచ్చు!
Comments
Please login to add a commentAdd a comment