scolding
-
సిబ్బందిని బండబూతులు తిట్టిన బ్యాంక్ ఉన్నతోద్యోగి.. వీడియో వైరల్
వ్యాపారానికి సంబంధించి ఉద్యోగులకు టార్గెట్లు అన్ని ప్రైవేటు కంపెనీల్లోనూ సాధారణంగా ఉండేవే. అయితే ప్రైవేటు బ్యాంకుల్లో ఈ పైత్యం మరీ ఎక్కువగా ఉంటుంది. రిటైల్ బ్యాంకింగ్ సేవలతో పాటు ఇన్సూరెన్స్ వ్యాపారం కూడా బ్యాంకులు చేస్తుంటాయి. ఈ ఇన్సూరెన్స్ పాలసీలు విక్రయించేందుకు ఉద్యోగులకు టార్గెట్లు పెడుతుంటాయి. ఇలా టార్గెట్లను సాధించే క్రమంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉన్నతోద్యోగి కింది స్థాయి ఉద్యోగులపై నోరు పారేసుకున్నారు. బండబూతులు తిట్టారు. ఆన్లైన్లో జరిగిన మీటింగ్‌లో ఉన్నతోద్యోగి సిబ్బందిని దుర్భాషలాడారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ యూజర్ ట్విటర్లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. సదరు బ్యాంక్ ఉన్నతోద్యోగి రోజుకు 75 ఇన్సూరెన్స్ పాలసీలు విక్రయించాలని టార్గెట్ ఇచ్చాడని, అది సాధించడంలో విఫలమైన ఉద్యోగిని బెంగాలీ భాషలో తిట్టాడని మరో యూజర్ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా ఈ వైరల్ వీడియోపై స్పందించిన బ్యాంక్ యాజమాన్యం సదరు ఉన్నతోద్యోగిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ట్విటర్ పెట్టిన వీడియోపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సర్వీస్ మేనేజర్ అజయ్ స్పందిస్తూ ఆ ఉన్నతోద్యోగిని సస్పెండ్ చేశామని, బ్యాంకు నిబంధనల మేరకు పూర్తి విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. #HDFC bank’s Manager Mr. Pushpal Roy. Employees were treated in an unprofessional way. I would have given back right there. Not sure why & how employees are tolerating. He is completely demoralised and done blatant attacked on employees. Should be fired ! #toxicworkenvironment pic.twitter.com/m0IrfqXl6b — Sara (@srchetlur) June 5, 2023 -
పోలీసులపై నారా లోకేష్ బూతులు
-
పొలిటికల్ తిట్లలో పోషకాలెక్కువ...
ఇప్పుడు ఓ చందమామ కథ చెప్పుకుందాం,. అనగనగా ఓ ఊర్లో ఓ గయ్యాళి గంగమ్మ ఉండేది. ఆమె నోటికి ఊరంతా హడలిపోయేది. ఇంట్లో ఉన్న భర్తను, పిల్లలను నానా తిట్లు తిడుతుండేది. ఆమె ఇంటి ముందు నుంచి ఊరివారెవరైనా వెళ్లడానికే భయపడేవారు. ఆమె తిట్లు అంత ఘాటుగా ఉండేవి. ఆమె నోటికి దడిచి కొడుకుకు పిల్లను ఇవ్వడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరికి అతని పరిíస్థితి అర్థం చేసుకుని, ప్రేమించిన తెలివైన అమ్మాయి ఓ సాధువును ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న సాధువు గంగమ్మను మార్చాలని ఆ ఇంటికి వెళ్లాడు. ఆ ఇంటికి వెళ్లిన సాధువు ఆమె నోటితీరుకు, ఆమె తిట్లకు అవాక్కయ్యాడు. కాసింత తేరుకుని.. ఆమె మారదని నిర్ణయించుకుని, కాసింత మంత్ర జలం తీసి.. ‘‘ఇక నుంచి ఎప్పడు ఎవరు ఎవరిని తిట్టినా తిట్ల దెయ్యం ప్రత్యక్షం అవుతుంది. తిట్లు సమంజసమే అయితే ఇబ్బంది పెట్టిన వారిని, లేకుంటే అకారణంగా తిట్టిన వారిని తిట్ల దయ్యం ఏడిపిస్తుంది లేదా తినేస్తుంది’’ అని శపించి వెళ్లిపోయాడు. ఆ మరుక్షణం తిట్లభూతం ప్రత్యక్షమై గంగమ్మ ఇంట్లో వీరంగం వేసింది. గంగమ్మ నోరు మూతపడి... పిల్లల ప్రేమ పెళ్లికి వెళ్లింది... కథ కంచికి వెళ్లింది. ఇప్పుడా తిట్ల భూతాలు రాజకీయ నాయకుల ఇంటివద్ద.. పార్టీ ఆఫీసుల వద్దా తిరుగుతున్నాయట. మొన్న మునుగోడు ఎన్నికల సమయంలో వీధుల్లో వీరంగం వేసినవి కూడా ఇవేనట! ఈ మధ్య తిండిపై బాగా ధ్యాస పెరిగింది. తినేది ఆర్గానికా, కాదా... క్యాలరీ ఫుడ్డా కాదా... ఇలా తర్జన భర్జనలు బాగా పెరిగాయి. ఏంతింటే మంచిదో డైటీషియన్లను, మంతెన సత్యనారాయణ రాజు లాంటి వారిని అడగడం ఎక్కువ యింది. నిజానికి ఏం తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందో, శక్తి వస్తుందో మన ప్రధానిని అడిగితే తెలుస్తుంది. రోజూ రెండుమూడు కేజీల తిట్లు.. ‘‘మోదీజీ మీరు అలసిపోరా.. అని ఇటీవల కొంతమంది నన్ను అడిగారు. వారికి నేనిచ్చిన సమాధానం ఏమిటో తెలుసా, రోజూ నేను 2, 3 కేజీల తిట్లు తింటున్నా. అవన్నీ ప్రొటీన్‌గా మారేలా నన్ను దేవుడు ఆశీర్వదించాడు. మనను తిట్టే తిట్ల గురించి మనం పట్టించుకోవద్దు. కార్యకర్తలు మజా చెయ్యాలి. 20–22 ఏళ్లుగా రాత్రీ పగలు తేడా లేకుండా నన్ను తిడుతూనే ఉన్నారు... వాటిలో చిత్ర విచిత్రమైన తిట్లు ఉన్నాయి. వాటివల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. ’’ హైదరాబాద్‌లో సభాముఖంగా ప్రధాని చెప్పిన చిట్కా ఇది. అందరూ, ముఖ్యంగా రాజకీయ నాయకులు పాటించదగ్గది. నడక నుంచి పరుగులు.. రాహుల్ గాంధీ చలో జోడో యాత్ర అంటూ నడక మొదలు పెట్టి, దేశమంతా తిరుగుతూ మన రాష్ట్రంలోకి వచ్చే సరికి ఏకంగా పరుగులు మొదలు పెట్టారు. మిగతా వారంతా ఆయనతో పరుగెత్తలేక అలసిపోయారు. మిగతా పరుగులు మహారాష్ట్రలో చేసుకోండి అంటూ ఆయాస పడి చెతులేత్తేశారట.. అంటే మోదీ భాషలో చెప్పాలంటే రాహుల్ గాంధీకి తిట్లు బాగానే వంటబట్టినట్టున్నాయి. తనీ స్థాయికి రావడానికి చిత్రవిచిత్రమైన తిట్లే అంటున్న ప్రధాని మాటలు విన్నారా రాహుల్ జీ! తిట్లకు వెరవకండి. వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలైన తిట్లు, రకరకాల రుచుల్లో ఉంటాయి. హాయిగా తినండి. మీరు కూడా ఏనాడో ఒకనాడు మోదీ స్థాయికి చేరతారు. ప్రొటీన్ ఫార్ములా... కొద్ది నెలలుగా రాష్ట్ర రాజకీయాల్లో వేడి.. అకస్మాత్తుగా బీజేపీలో పోరాటపటిమ పెరిగాయి. దీనికి ఇంత శక్తి రావడానికి టీఆర్ఎస్ అందునా కేసీఆర్ పవర్ఫుల్ తిట్లే కార ణంగా తోస్తోంది. వీళ్ల తిట్లలో బాగా పోషకాలు ఉన్నట్టున్నాయి. రోజురోజుకూ బీజేపీ కార్యకర్తలు బలం పుంజుకుంటున్నారు. ‘‘ ..పిస్సగాడిద కొడుకు, రండ మంత్రి, చేవ లేని దద్దమ్మ, బుట్టాచోర్, కిరికిరి గాళ్లు...’’ మోదీ అన్నట్టు ఇట్లాంటి చిత్ర విచిత్ర తిట్లలో ఎన్ని పోషకాలుంటాయి మరి!.. అందుకే బీజేపీ కార్యకర్తలు బలం పుంజుకుని విజృంభించేస్తున్నారు. ఈ ప్రొటీన్ ఫార్ములా అన్ని పార్టీలకు వర్తిస్తుందని బీజేపీ నాయకులు విస్మరించి నోరు జారు తున్నట్టున్నారు. అలా నోరు జారడం వల్ల మొన్న ఓ ఎంపీ ఇంటిముందు తిట్ల భూతాలు ఎలా వీరంగం చేశాయో చూశాం కదా. పైన మనం చెప్పుకున్న కథలోలాగా తిట్ల భూతాలు తప్పెవరిదైనా వదలవు. తిట్లతో పోషకాలే కాదు. ప్రాబ్లెమ్స్ తప్పవన్న మాట. ఇక ఏం పర్లేదు అనుకుని రిలాక్సయిన టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులూ ఒక్కసారిగా మేల్కోని యాక్టివయ్యింది, బలపడుతోంది, నోరు జాడిస్తోంది... నేషనల్ లెవల్ ఇంపోర్టెడ్ తిట్లనుంచి, లోకల్ నేతల నాటు తిట్ల నుంచీ గ్రహించిన పోషకాలతోనేనని బీజేపీ నాయకులు కూడా గుర్తించి జాగ్రత్త పడాలి. ప్రజల తిట్లు మరింత పవర్ఫుల్.. ఇప్పడు ముఖ్యమంత్రి, ప్రధానితో సహా, అన్ని కేంద్ర, రాష్ట్ర మంత్రులు, నాయకుల నోటి నుంచి వస్తోన్న సేమ్ విమర్శ.. ‘ఊరికే నోరు పారేసుకోవడం, తిట్టడం తప్ప, మేం చేస్తున్న డెవలప్మెంట్ను చూసేదేలేదు...’ అని. నిజమే, రాజకీయ నాయకులు డెవలప్మెంట్ చూడరు, తిట్లు తిడతారు, తింటారు కానీ, డెవలప్మెంట్ చూసే సెక్షన్ కూడా ఉంది. వాళ్లే కామన్‌పీపుల్. ‘‘రోడ్డు వేయించే మొహాల్లేవు కానీ, ఓటు వెయ్యాలట ఓటు! ఐదొందలు, వెయ్యి చేతుల పెట్టి, సిగ్గు శరం లేదా ఓటడగడానికి. గెలిపియ్యుర్రి డబ్బులు తీసుకుని. మన బతుకులు నాశనమైతయి..’’ ‘మా గల్లీకి ఏ పార్టోల్లూ ప్రచారానికి రాకండి...మేం ఓట్లేయం. మీకు ఎప్పటికీ బుద్ది అస్తలేదు..’’ ఎలక్షన్ టైంలో ఇలాటి తిట్లు వింటుంటాం. ఇవి డెవలప్మెంట్ చూస్తున్న జనం.. నాయకులకు కంచాల నిండా పెడుతున్న తిట్లు.. తినలేనంతగా, అరిగించుకోలేనంతగా. ఈ తిట్లకూ పోషక విలువలు ఉంటాయంటారా?... మోదీ భాషలో ఉండవచ్చు కానీ, ప్రజల తిట్లతో బలం రాజకీయ నాయకులకు రాదు ప్రజాస్వామ్యానికి వస్తుంది. పైగా, పైన కథలో..సాధువు క్రియేట్ చేసిన తిట్లభూతం... న్యాయం వైపు ఉంటదని, అన్యాయం చేస్తే తింటదని చెప్పుకున్నాం కదా! ... సో తిట్లు జాగ్రత్తగా ఎంచుకొని తినండి. -సరికొండ చలపతి -
పరీక్షల్లో ఫెయిలవ్వొద్దు అన్నందుకు తండ్రి హత్య! ట్విస్ట్ ఏంటంటే?
Scared of rebuke for failing exams: తల్లిదండ్రులు మందలించారనో లేకు తాము అడిగింది కొనివ్వటం లేదనో కన్న తల్లిదండ్రుల పై కక్ష సాధించే ప్రబుద్ధులను చూస్తూనే ఉన్నాం. అంతెందుకు దురాలవట్లకు బానిసై చెడు మార్గంలో పయనిస్తున్న పిల్లలను సరైన మార్గంలో పెట్టే నిమిత్తం కాస్త కఠినంగా వ్యవహరించినందుకే తల్లిదండ్రులనే హతమార్చే కిరాతక పిల్లల గురించి విన్నాం. అచ్చం అలానే మధ్యప్రదేశ్‌లోని ఒక బాలుడు దారుణమైన నేరానికి ఒడిగట్టాడు. వివరాల్లోకెళ్తే... మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాకు చెందిన 10వ తరగతి విద్యార్థిని అతని తండ్రి పరీక్షల్లో ఫెయిల్ అయితే ఇంటి నుంచి గెంటేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆ విద్యార్థి తాను పరీక్షల్లో ఫెయిల్ అయితే కచ్చితంగా ఇంటి నుంచి గెంటేయడం ఖాయం అన్న భయంతో తండ్రిని గొడ్డలితో నరికి చంపేశాడు. ఆ బాలుడు నేరం చేయడమే కాకుండా ఈ హత్య నేరంలో తమ పక్కంటివాళ్లను ఇరికించేందుకు యత్నించాడు. అంతేకాదు తమ పక్కింటివాళ్లే తన తండ్రిని చంపారని, తాను చూశానని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయితే ఫోరెన్సిక్ విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు బాలుడిని విచారించగా తానే నేరం చేసినట్లు అంగీకరించడు. ఫైనల్ పరీక్షలు సరిగ్గా చదవలేదని అందువల్ల ఫెయిల్ అవుతానని భయపడ్డానని ఆ బాలుడు చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రాజీవ్ మిశ్రా ఆ బాలుడు తన తండ్రి నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో చంపాడని తెలిపారు. ప్రస్తుతం ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి, అక్కడి నుంచి జువైనల్ హోంకు తరలించినట్లు తెలిపారు. (చదవండి: జైలు నుంచి విడుదలై బాలిక కోసం గాలింపు.. ఇంట్లో తెలియడంతో..) -
కన్న తల్లిపై కర్కశత్వం.. పెనంతో కొట్టి చంపిన కూతురు
లక్నో: నవమాసాలు మోసి.. కనిపెంచిన తల్లిపైనే ఓ కూతురు అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. తల్లి మందలించిందన్న కోపంతో 14 ఏళ్ల బాలిక ఆమెను బలంగా కొట్టి చంపింది. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని నొయిడాలో చోటుచేసుకుంది. నోయిడాలోని శాహదరా ప్రాంతానికి చెందిన అనురాధ అనే మహిళకు 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయిదేళ్ల తర్వాత భర్తతో విడాకులు తీసుకొని కూతురు(14)తో కలిసి నొయిడాలోని సెక్టార్-77 అంతరిక్ష కెన్వాల్ సొసైటీలో నివసిస్తోంది. గ్రేటర్ నోయిడాలోని ఒక సంస్థలో సరఫరా విభాగంలో పని చేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం తల్లీకూతుళ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంట్లో గిన్నెలు శుభ్రం చేయాలని తల్లి కూతురిని కోరింది. కూతురు పనులు చేయకపోవడంతో ఆమెను తిడుతూ చేయిచేసుకుంది. దీంతో ఆగ్రహానికి లోనైన బాలిక పెనంతో(ఫ్రైయింగ్ పాన్) తల్లిని కొట్టింది. తలకు బలమైన గాయాలవ్వడంతో అనురాధ అనురాధ స్పృహ కోల్పోయింది. అయితే తల్లికి గాయాలవ్వడంతో బాలిక తన చుట్టుపక్కల వారిని పిలిచింది. పొరుగున ఉన్న వారు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే మహిళ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కూతురు కొట్టడం ద్వారా అనురాధ చనిపోయినట్లు ఆమె తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. బాలికను కస్టడీలోకి తీసుకుని బాలనేరస్థుల కేంద్రానికి తరలించామని పోలీసులు తెలిపారు. చదవండి: ప్రేమ పెళ్లి.. కడుపులో పెరుగుతున్న బిడ్డ తనది కాదని అనడంతో.. -
బండ బూతులు.. ఎలన్ మస్క్‌కు ఘోర అవమానం!
వ్యాపార లావాదేవీలు, వ్యవహార శైలితోనే కాదు వివాదాలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు టెస్లా సీఈవో ఎలన్ మస్క్. అయితే మరో దిగ్గజ కంపెనీ సీఈవో చేతిలో మస్క్ ఘోర అవమానం పాలయ్యాడనే వార్త ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో జోరుగా షికార్లు కొడుతోంది. ఇంతకీ మస్క్‌ను బండ బూతులు తిట్టింది ఎవరో కాదట. యాపిల్ సీఈవో టిమ్ కుక్. అది ఎందుకు జరిగిందంటే.. కాలిఫోర్నియా: చాలా కాలం క్రితం టెస్లాను విలీన ప్రతిపాదన యాపిల్ వద్దకు వచ్చింది. అయితే ఆ డీల్ అనుకున్న విధంగా నడవలేదు. కారణం.. ఆ డీల్ ఓకే కావాలంటే తనను యాపిల్‌కు సీఈవోగా ప్రకటించాలని మస్క్ కోరాడట. అంతే ఆ మాటతో ఉగ్రుడైన కుక్ .. మస్క్‌ను బండబూతులు తిట్టాడని, ‘F’ పదం చాలాసార్లు వాడాడని, కోపంగా ఫోన్ పెట్టిపడేశాడని సమాచారం. ఈ మేరకు ‘ది వాల్ స్స్ర్టీట్ జర్నల్’ రైటర్ టిమ్ హగ్గిన్స్ రాసిన ‘పవర్ ప్లే: టెస్లా, ఎలన్ మస్క్, అండ్ ది బెట్ ఆఫ్ ది సెంచూరీ’ అనే బుక్‌లో వాళ్లిద్దరి మధ్య సంభాషణలకు సంబంధించిన విషయాల్ని ప్రస్తావించాడు. అయితే హగ్గిన్స్ రాతలను ఎలన్ మస్క్, టిమ్ కుక్‌లు ఖండించారు. తాను కుక్ అసలు ఎప్పుడూ మాట్లాడుకోలేదని, ఎలాంటి ప్రత్యుత్తరాలు జరపలేదని క్లారిటీ ఇచ్చాడు ఎలన్ మస్క్. అయితే ఒకానొక దశలో టెస్లాను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశానని, కానీ, కలవడానికే ఆయన నిరాకరించాడని మస్క్ గుర్తు చేసుకున్నాడు. ఇక కుక్ కూడా మస్క్ లాగే స్పందించాడు. ‘ఎలన్‌తో మాట్లాడాలని నేనేప్పుడు అనుకోలేదు. కానీ, అతను నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎప్పుడూ నేను గౌరవిస్తాను’ అని వ్యాఖ్యానించాడు. ‘ఆ టైంకి టెస్లా విలువ.. ఇప్పుడున్న విలువలో 6 శాతం మాత్రమే ఉంది. బహుశా అందుకే ఆయనకి(కుక్) ఆసక్తి లేకపోయి ఉండొచ్చు. నాన్ సెన్స్.. ఇలాంటి వాళ్ల రాతలు పనికి మాలినవి అంటూ హిగ్గిన్స్పై మండిపడ్డాడు ఎలన్ మస్క్. ఇదిలా ఉంటే మోడల్ ఎక్స్ అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత టెస్లా ఘోరమైన ఆర్థిక నష్టాల్ని చవిచూసింది. దీంతో 2016లో 60 బిలియన్ డాలర్ల ఒప్పందంతో యాపిల్‌కు టెస్లాను అమ్మే ప్రయత్నం చేశాడు మస్క్. అయితే ఆ డీల్ టైంలో ఇద్దరి మధ్య ‘ఘర్షణ వాతావరణంలోనే’ ఏదో జరిగిందనే వార్తని ఆనాడు ప్రముఖ మీడియా హౌజ్‌లు అన్నీ ప్రకటించాయి. అయితే ఆనాడు జరిగింది ఇదేనంటూ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ హగ్గిన్స్ ఆ ఫోన్ సంభాషణను బయటపెట్టడం ఇప్పుడు కార్పొరేట్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. Higgins managed to make his book both false *and* boring 🤣🤣 — Elon Musk (@elonmusk) July 30, 2021 -
ప్రభుత్వం పై లోకేష్ పిచ్చికుక్కలా అరుస్తున్నారు : కొడాలి నాని
-
63 సంవత్సరాల మహిళకు 43 ఏళ్ల జైలు శిక్ష..!
ఆమెకు థాయ్‌లాండ్ గవర్నమెంట్ 43 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. ఇంతకీ ఆమె చేసిన ఘోరనేరం ఏమిటి? థాయ్ రాచకుటుంబాన్ని తిట్టిందంతే! ఈ మాత్రం దానికే అంత శిక్షా! అంటే ‘అక్కడంతే..అక్కడంతే’ అనే ఆన్సర్ తప్ప ఏదీ వినిపించదు. 63 సంవత్సరాల అంచన్ రాజకుటుంబాన్ని తిట్టి అట్టి వీడియోను సోషల్ మిడియాలో వదిలింది. అదే ఆమె చేసిన పాపం అయింది. ప్రపంచంలోనే పెద్దదయిన హైస్పీడ్ రైల్‌నెట్ వర్క్‌కు చైనా పెట్టింది పేరు. తాజాగా జియోటోంగో యూనివర్శిటీ శాస్త్రవేత్తలు సరికొత్త హై స్పీడ్ రైలును ప్రవేశపెట్టారు. విశేషం ఏమిటంటే ఈ రైలుబండికి చక్రాలు ఉండవు. హై–టెంపరేచర్ సూపర్‌కండక్టింగ్ (హెచ్‌టీఎస్) సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఈ మాగ్నెటిక్ లెవిటేషన్ ట్రైన్ గంటకు 620 కి.మీలు ప్రయాణం చేస్తుంది. అంటే హైదరాబాద్ నుంచి ముంబైకి గంటలో వెళ్లవచ్చు. గంటలో రావచ్చు! -
కాలె యాదయ్య వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తలు
మెయినాబాద్(చేవెళ్ల): 111 జీవో, ఎల్ఆర్ఎస్, రిజిస్ట్రేషన్ సమస్యలపై మంగళవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య మంగళవారం ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు, నిరసనకారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే కాలె యాదయ్య కారులో రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ చౌరస్తా మీదుగా వెళుతుండ గా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. 84 గ్రామాలకు గుదిబండగా మారిన 111 జీవోతోపాటు, ఎల్ఆర్ఎస్, రిజిస్ట్రేషన్ సమస్యలపై సమాధానం చెప్పాలంటూ ఆయన్ని నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే కారు దిగి వారిని పరుష పదజాలంతో దూషించారు. అక్కడే ఉన్న టీఆర్ఎస్ నాయకులు కొందరు నిరసనకారులను అడ్డుకుని ఎమ్మెల్యేను అక్కడి నుంచి మండల పరిష త్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలంటూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. -
గొడవలు పెట్టుకునేందుకు ఆన్లైన్లో ఆర్డర్..
కూలీకొస్తారా.. అనగా విన్నాం.. పని ఉంది చేయడానికి వస్తారా అని అడగ్గా విన్నాం.. ఈ మధ్య బజార్ కొస్తారా.. అని కూడా చూశాం.. కానీ కొత్తగా లొల్లికొస్తారా ఏంటి అని అనుకుంటున్నారా..? ఇదే కదా మీ డౌట్. అవును చైనాలో అలాగే అడుగుతారు మరి. మిమ్మల్ని ఎవరైనా ఏడిపించారనుకోండి.. టీజ్ చేశారనుకోండి.. లేదంటే ఎక్కడైనా గొడవకు దిగారనుకోండి. అప్పుడు మీరు సరిగ్గా మాట్లాడలేకపోతే.. అందులో పైచేయి సాధించలేకపోతే.. మీ వద్ద అప్పుడు రెండే ఆప్షన్లు ఉంటాయి. ఒకటి.. నోరు మూసుకుని చక్కగా వెనక్కి వచ్చేయడం లేదంటే.. గొడవ పడిన వారితో మీరు అనవసరంగా తిట్లు పడాల్సి రావడం. కానీ చైనాలో ఓ ఆన్లైన్ కంపెనీ దీనికి కూడా పరిష్కారం వెతికి పెట్టిందండోయ్. టావోబావో అనే కంపెనీ మీ తరఫున గొడవ పడేందుకు వేరే వారిని నియమించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. అది కూడా చాలా ప్రొఫెషనల్‌గా గొడవ పడేవారిని మీకు ఆన్లైన్లో చూపిస్తుంది. టావోబావో ప్రపంచంలోనే అతిపెద్ద ఈ–కామర్స్ సంస్థ. తాజాగా గొడవలు పెట్టుకునేవారిని కూడా ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. మీరు ఏ విషయంలో గొడవపడుతున్నారు..? ఎవరితో గొడవపడుతున్నారు..? మీరు నియమించుకునే వారు ఎలా గొడవ పడాలి.. ఎదుటి వారిని ఏ మాటలు అనాలి..? ఎంత సేపు గొడవ పడాలి.. ఇలా అన్ని వివరాలు ఆన్లైన్లో పొందుపరిస్తే అందుకు తగ్గట్లు సాయం చేస్తారన్న మాట. ఇందుకోసం కొంత డబ్బు వసూలు చేస్తుంది. అయితే గొడవ పడే వారిని నేరుగా మనదగ్గరికి పంపించరు. కేవలం ఫోన్ లేదా మెస్సేజీల ద్వారా మనతో గొడవ పడినవారిని తిరిగి తిట్టేలా ఏర్పాటు చేస్తోంది. గంటకు కేవలం రూ.220 వసూలు చేస్తోంది. -
బాలకృష్ణ బూతు పురాణం
సాక్షి, హిందూపురం: సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి చిందులు తొక్కారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా బాలయ్య తన స్వరూపాన్ని బయటపెట్టారు. ఒక మీడియా ప్రతినిధిపై రౌడీయిజం ప్రదర్శించారు. ‘ప్రాణాలు తీస్తా’ అంటూ ఒంటికాలిపై లేచారు. బాలకృష్ణ వస్తున్నప్పుడు చిన్నపిల్లలను ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది పక్కకు లాగిపడేశారు. దీన్ని షూట్ చేసిన మీడియా ప్రతినిధిపై దౌర్జన్యం చేసి, రాయకూడని భాషలో బూతులు తిట్టారు. కెమెరాతో చిత్రీకరించిన దృశ్యాలను తొలగించాలని చేయి చేసుకున్నారు. ‘రాస్కెల్ మా బతుకు మీ చేతుల్లో ఉన్నాయిరా. నరికి పోగుపెడతాను, ప్రాణాలు తీస్తాను. బాంబులు వేయడం కూడా తెల్సు నాకు. కత్తి తిప్పడం కూడా తెల్సు’ అంటూ బాలయ్య బెదిరిస్తున్న దృశ్యాలు వీడియోలో రికార్డైయ్యాయి. చుట్టూ ఉన్నవారు కూడా ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మీడియా ప్రతినిధిపై బాలకృష్ణ దౌర్జన్యాన్ని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. సభ్య సమాజం తలదించుకొనేలా ప్రవర్తించిన తీరును ప్రతిపక్ష పార్టీలు గర్హించాయి. ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని, పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. బాలయ్యను చూసి భయపడుతున్నారు ఎన్నికల సంఘం బాలకృష్ణ మానసిక పరిస్థితి పరిగణనలోకి తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్బాల్ అహ్మద్‌ఖాన్ కోరారు. హిందూపురానికి చుట్టపు చూపుగా వచ్చిపోయే బాలకృష్ణను చూసి ఇక్కడి ప్రజలు వణికిపోతున్నారని చెప్పారు. ఆయన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియక స్థానికులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే నిరాశ, నిస్పృహతో ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. -
సంచలనం కోసమే ‘కత్తి’ మాట్లాడుతున్నారు
హైదరాబాద్ : హిందువుల పట్ల జరిగిన సంఘటనకు దేశ విదేశాల్లో ఉన్న హిందువులు అందరూ ఆవేదనకు గురయ్యారని శ్రీ పీఠం పరిపూర్ణానంద స్వామి తెలిపారు. ఆదివారం పరిపూర్ణానంద స్వామి హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. హిందూ దేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. రాముడు ఒక దగుల్భాజీ అని, సీత రాముని కన్నా రావణాసురుడి దగ్గర ఉంటేనే ఎక్కువ సుఖపడేదని కత్తి మహేశ్ ఆరోపణలు చేయడం చూస్తుంటే..ఆయన సంచలనం కోసమే ఇలా మాట్లాడుతున్నాడని తెలుస్తోందని అన్నారు. కత్తి వ్యాఖ్యల వల్ల కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. సీతమ్మను దూషించడం అంటే యావత్ స్త్రీ జాతిని అనడమేనన్నారు. రాజ్యాంగంలో శ్రీరాముని చిత్రపటాన్ని పెట్టడానికి కారణం..రాముడు చర్రిత కారుడు అని చెప్పడానికేనని తెలిపారు. ఇది రాజ్యాంగాన్ని ధిక్కరించడం కాదా అని ప్రశ్నించారు. పైశాచిక ఆనందం కోసమే ఇలా మాట్లాడుతున్నారని కత్తి మహేశ్‌ను ఉద్దేశించి అన్నారు. ఇది దేశద్రోహం..బడుగు బలహీన వర్గాల ముసుగులో మహేశ్ ఈవిధంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. రామనామ స్మరణ చేస్తూ అన్ని వర్గాల వారు రేపు(సోమవారం) తనతో పాదయాత్ర చేస్తారని తెలిపారు. కత్తి మహేశ్ మాటల వెనక కుట్ర ఉందని, కులాల అణగదొక్కే ప్రయత్నం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. . ‘ నీకు ఎలా సమాధానం చెప్పాలో మా వాళ్ల దగ్గర ఉపాయాలు ఉన్నాయ్. పోలీసులు, ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. అదుపు తప్పి బరితెగించి వ్యాఖ్యలు చేస్తున్నారు. కత్తి మహేష్ వ్యాఖ్యలకు రెండు రాష్ట్రాల సీఎంలు సమాధానం చెప్పాలి. ప్రతి శ్రీరామ నవమికి ఇద్దరు సీఎంలు దగుల్బాజీల దగ్గరకు పట్టు వస్త్రాలు తీసుకువెళ్తున్నారో చెప్పాలి. ఎవరు ఏ మతం మీద దాడి చేసినా ప్రభుత్వం సెక్యులర్‌గా పని చేయాలి. దిగజారుడు వ్యాఖ్యలు చేసిన వారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలి. నీవు హిందువు కాదు, శ్రీరాముడిని దూషించిన వారు ఎవరూ హిందువులు కాదు. రేపు(సోమవారం) బషీర్ బాగ్ నుంచి యాదగిరిగుట్ట వరకు ధర్మాగ్రహా యాత్ర చేస్తాం. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రీరాముడికి పాలాభిషేకం చేస్తాం. సాధువులకు నిగ్రహం అవసరం అంటున్నారు. ధర్మ పరిరక్షణకు మేము సైనికులము అవుతా’ మని హెచ్చరించారు. -
భార్య మందలించిందని భర్త ఆత్మహత్య
విడవలూరు: నిత్యం తాగుతున్నావని భార్య మందలించిందని మనస్థాపానికి గురైన ఓ భర్త పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై వెంకట్రావు కథనం మేరకు.. మండలంలోని వీరారెడ్డిపాళెంకు చెందిన ఏకొల్లు జనార్ధన్ (35) ఇటీవల మద్యానికి బానిసైపోయాడు. దీంతో భార్య ఇలా మద్యం తాగితే పిల్లల భవిష్యత్ ఏమి కావాలని ప్రశ్నించి పక్కనే ఉన్న తన తల్లి ఇంటికి అలిగి వెళ్లింది. తన భార్య పిల్లల ముందు మందలించిందని మనస్థాపానికి గురై ఇంట్లో ఉన్న పురుగు మందు తాగాడు. గమనించి జనార్ధన్ కుమారులు చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. -
ఉపాధ్యాయుడు మందలించడంతో..
నస్రుల్లాబాద్: మండలంలోని బొమ్మన్‌దేవ్ పల్లి క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్న శ్రీ వెంకట సాయి విద్యానికేతన్ పాఠశాలలో ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు మందలించడంతో విద్యార్థి స్కూల్ నుంచి వెళ్లిపోయిన సంఘటన శుక్రవారం జరిగింది. కంగ్టీ మండలం చాప్టా గ్రామానికి చెందిన ఓ విద్యార్థి 9వ తరగతి చదువుతున్నాడు. అయితే ఉపాధ్యాయుడు దుర్భాషలాడి, కొట్టడంతో సదరు విద్యార్థి స్థానిక 33/11కేవీ సబ్‌స్టేషన్‌లోకి పరిగెత్తాడు. వెంటనే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది బాలుడికి మందలించి తిరిగి పాఠశాల ఉపాధ్యాయుడికి అప్పజెప్పి పాఠశాల యాజమాన్యానికి సమాచారమిచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ సదరు విద్యార్థికి మానసిక పరిస్థితి సరిగ్గాలేక గతంలోనూ ఇలాగే వెళ్లిపోయాడని, తనకు మానసిక పరిస్థితి లేదని మెడికల్ రిపోర్ట్ కూడా అందించాడని పేర్కొన్నారు. అయితే సదరు విద్యార్థి మాత్రం తాను స్కూల్‌కు నోట్‌బుక్ తెచ్చికోలేదని తిరిగి వెళ్తూ సార్ చూ స్తే కొడ్తాడని సబ్‌స్టేషన్‌లోకి వెళ్లాలని చెప్పాడు. అయితే విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట ధర్నాకు దిగాయి. పాఠశాల యాజమాన్యం అధికఫీజు ఒత్తిడివల్లే విద్యార్థి మనస్థాపానికి గురై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని వారు ఆరోపించారు. ఈ ధర్నాలో పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా కార్యదర్శి బాల్‌రాజ్, బీసీ విద్యార్థి సంగం జిల్లా కార్యదర్శి కర్నం భాస్కర్, ఏబీవీపీ రాజు, సాయిలు, జగన్, అస్లాం, గిరి తదితరులున్నారు. -
సీఐ దూషించాడని..
రాజమండ్రి రూరల్(తూర్పుగోదావరి): బొమ్మూరు సీఐ కనకారావు దూషించాడని ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ గిరిజా చంద్రశేఖర్ మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓ కేసు విషయమై సీఐ, చంద్రశేఖర్‌ను స్టేషన్‌కు పిలిపించి బండబూతులు తిట్టడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. బాధితుడు ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. -
పిచ్చోడు.. బుడ్డర్ఖాన్.. అలీబాబా చాలీస్ చోర్!
సార్వత్రిక ఎన్నికల పుణ్యమాని చాలా రోజుల తర్వాత మళ్లీ నాయకుల తిట్ల పురాణం వినే భాగ్యం తెలుగు ప్రజలకు కలిగింది. సాధారణంగా నోటి దురుసు ప్రదర్శించే విషయంలో కాస్త వెనకబాటులో ఉండే నాయకులు కూడా ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా స్వరం పెంచేశారు. ప్రధానంగా టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు కేంద్రంగానే ఈ తిట్లన్నీ సాగుతున్నాయి. కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ కేసీఆర్‌ను నోటికొచ్చినట్లు తిడుతున్నారు. కిలాడీ, అలీబాబా చాలీస్ చోర్, కాపలా కుక్క, బుడ్డర్ఖాన్, పిచ్చోడు.. ఇలా ఎవరికి తోచిన స్థాయిలో వాళ్లు కేసీఆర్‌ను తిట్టిపోస్తున్నారు. కే అంటే కిలాడీ అని.. కేసీఆర్ అంటే మాట తప్పే పెద్ద కిలాడీ అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పడ్డాక కాపలా కుక్క(వాచ్డాగ్) లా పని చేస్తానని చెప్పిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు మొరగడమేంటని విమర్శించారు. కేసీఆర్ బుడ్డర్‌ఖాన్‌లా మాట్లాడుతున్నారని మరో సందర్భంలో పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. నిత్యం ఫాం హౌస్‌లో పడుకునే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసిందెప్పుడని ప్రశ్నించారు. కేసీఆర్ ఒక అలీబాబా చాలీస్‌చోర్.. టీఆర్ఎస్కు ఓటువేస్తే దొంగోడి చేతికి తాళం చెవి ఇచ్చినట్లే’ అని మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి అన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌వి మాయ మాటలు.. నమ్మి మోసపోవద్దని కేంద్రమంత్రి జైరాం రమేష్ అన్నారు. కేసీఆర్ బిడ్డకోసీటు, కొడుక్కో సీటు, అల్లుని కో సీటు ఇచ్చి.. తానూ రెండుసీట్లు తీసుకున్నాడు.. ఇది కుటుంబ పాలనకు నిదర్శనమన్నారు. ఇక విమర్శల విషయంలో ఎప్పుడూ పెద్దగా ధైర్యం చేయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కేసీఆర్ విషయంలోకి వచ్చేసరికి రెచ్చిపోయి మాట్లాడారు. తనను జైలుకు పంపుతానని కేసీఆర్ అంటున్నాడని, 'మరోసారి పిచ్చిమాటలు మాట్లాడితే పిచ్చాస్పత్రికి పంపిస్తా జాగ్రత్త’ అని ఆయన అన్నారు. ఇలా దాదాపు ప్రతి ఒక్కళ్లూ కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని తమ తిట్లపురాణాలకు మరింత పదును పెడుతున్నారు. -
నోర్ముయ్... స్టుపిడ్....
గిద్దలూరు : రెవెన్యూ శాఖామంత్రి రఘువీరారెడ్డి ఓ ఉద్యోగిపై నోరు పారేసుకున్నారు. తమకు వేతనాలు పెంచాలని కోరిన ఒక వీఆర్ఏని ఆయన దూషించిన సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఆదివారం రాత్రి జరిగింది. తహసీల్దార్ కార్యాలయ భవన శంకుస్థాపనకు వచ్చిన మంత్రిని వీఆర్ఏలు తమకు వేతనాలు పెంచాలని కోరారు. అందుకు బదులిచ్చిన మంత్రి ఇప్పుడిస్తున్న వేతనాలకు రెండింతలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వెంటనే అక్కడున్న శేఖర్ అనే వీఆర్ఏ ఎప్పుడు పెంచుతారని ప్రశ్నించగా... 'నోర్ముయ్...స్టుపిడ్..' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న మరో మంత్రి మహీధర్ రెడ్డి కలుగచేసుకుని వేలు చూపిస్తూ...'ఏయ్...ఇక్కడ గోల చేయొద్దు' అంటూ కన్నెర్ర చేశారు. పోలీసులు వీఆర్ఏలను వెనక్కు నెట్టేశారు.