HDFC Bank Officer Abuses Employees In Online Meeting, Suspended After Video Goes Viral - Sakshi
Sakshi News home page

టార్గెట్‌ టార్చర్‌! సిబ్బందిని బండబూతులు తిట్టిన బ్యాంక్‌ ఉన్నతోద్యోగి.. వీడియో వైరల్‌

Published Mon, Jun 5 2023 8:35 PM | Last Updated on Tue, Jun 6 2023 12:21 PM

HDFC Bank officer abuses employees in online meeting suspended after video viral - Sakshi

వ్యాపారానికి సంబంధించి ఉద్యోగులకు టార్గెట్లు అన్ని ప్రైవేటు కంపెనీల్లో​నూ సాధారణంగా ఉండేవే. అయితే ప్రైవేటు బ్యాంకుల్లో ఈ పైత్యం మరీ ఎక్కువగా ఉంటుంది. రిటైల్‌ బ్యాంకింగ్‌ సేవలతో పాటు ఇన్సూరెన్స్‌ వ్యాపారం కూడా బ్యాంకులు చేస్తుంటాయి. ఈ ఇన్సూరెన్స్‌ పాలసీలు విక్రయించేందుకు ఉద్యోగులకు టార్గెట్‌లు పెడుతుంటాయి. 

ఇలా టార్గెట్‌లను సాధించే క్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నతోద్యోగి కింది స్థాయి ఉద్యోగులపై నోరు పారేసుకున్నారు. బండబూతులు తిట్టారు. ఆన్‌లైన్‌లో జరిగిన మీటింగ్‌లో ఉన్నతోద్యోగి సిబ్బందిని దుర్భాషలాడారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ యూజర్‌ ట్విటర్‌లో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది. సదరు బ్యాంక్‌ ఉన్నతోద్యోగి రోజుకు 75 ఇన్సూరెన్స్‌ పాలసీలు విక్రయించాలని టార్గెట్‌ ఇచ్చాడని, అది సాధించడంలో విఫలమైన ఉద్యోగిని బెంగాలీ భాషలో తిట్టాడని మరో యూజర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

కాగా ఈ వైరల్‌ వీడియోపై స్పందించిన బ్యాంక్‌ యాజమాన్యం సదరు ఉన్నతోద్యోగిని సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ట్విటర్‌ పెట్టిన వీడియోపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సర్వీస్‌ మేనేజర్‌ అజయ్‌ స్పందిస్తూ ఆ ఉన్నతోద్యోగిని సస్పెండ్‌ చేశామని, బ్యాంకు నిబంధనల మేరకు పూర్తి విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement