
ప్రతీకాత్మక చిత్రం
విడవలూరు: నిత్యం తాగుతున్నావని భార్య మందలించిందని మనస్థాపానికి గురైన ఓ భర్త పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై వెంకట్రావు కథనం మేరకు.. మండలంలోని వీరారెడ్డిపాళెంకు చెందిన ఏకొల్లు జనార్ధన్ (35) ఇటీవల మద్యానికి బానిసైపోయాడు. దీంతో భార్య ఇలా మద్యం తాగితే పిల్లల భవిష్యత్ ఏమి కావాలని ప్రశ్నించి పక్కనే ఉన్న తన తల్లి ఇంటికి అలిగి వెళ్లింది.
తన భార్య పిల్లల ముందు మందలించిందని మనస్థాపానికి గురై ఇంట్లో ఉన్న పురుగు మందు తాగాడు. గమనించి జనార్ధన్ కుమారులు చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment