committed suiicde
-
జైలులో జీవిత ఖైదీ ఆత్మహత్య
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ వద్ద గల జిల్లా జైలులో ఓ జీవితఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అరగొండ గ్రామానికి చెందిన వెంకట్ (65) తన మనుమడిని చంపిన కేసులో ఈ నెల 9వ తేదీన కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. జైలులో శిక్ష అనుభవిస్తున్న వెంకట్.. మంగళవారం సాయంత్రం జైలులోని బాత్రూమ్లో టవల్‌తో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు 6వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
భార్య మందలించిందని భర్త ఆత్మహత్య
విడవలూరు: నిత్యం తాగుతున్నావని భార్య మందలించిందని మనస్థాపానికి గురైన ఓ భర్త పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై వెంకట్రావు కథనం మేరకు.. మండలంలోని వీరారెడ్డిపాళెంకు చెందిన ఏకొల్లు జనార్ధన్ (35) ఇటీవల మద్యానికి బానిసైపోయాడు. దీంతో భార్య ఇలా మద్యం తాగితే పిల్లల భవిష్యత్ ఏమి కావాలని ప్రశ్నించి పక్కనే ఉన్న తన తల్లి ఇంటికి అలిగి వెళ్లింది. తన భార్య పిల్లల ముందు మందలించిందని మనస్థాపానికి గురై ఇంట్లో ఉన్న పురుగు మందు తాగాడు. గమనించి జనార్ధన్ కుమారులు చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. -
కుమార్తెతో మాట్లాడించలేదని తండ్రి ఆత్మహత్య
రావులపాలెం (తూర్పు గోదావరి): తన కుమార్తెతో మాట్లాడించడం లేదని మనస్థాపం చెందిన తండ్రి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఊబలంక గ్రామానికి చెందిన మడికి వెంకన్న(40) వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. అతడి భార్య జీవనోపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లింది. దీంతో కుమార్తెను వెంకన్న అత్తగారింట్లో ఉంచాడు. ఇటీవల కుమార్తెను చూడడానికి వెళ్లగా, అతడి అత్తింటివారు కుమార్తెతో మాట్లాడించలేదు. ఫోన్ చేసినా ఇవ్వకపోవడంతో మనస్థాపం చెందాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంటి వద్ద పురుగుమందు తాగాడు. స్థానికులు అతడిని గమనించి 108లో కొత్తపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. ఎస్సై పీవీ త్రినాథ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.